YCP Leaders affairs : వైసీపీ నేతల ఇల్లీగల్ ఎఫైర్సే నేటి కరెంట్ ఎఫైర్స్
వైసీపీ నేతల ఇల్లీగల్ ఎఫైర్సే నేటి కరెంట్ ఎఫైర్స్
వైసీపీ నేతలకు(YCP Leaders) వివాహేతర సంబంధాల(Extra marital affairs) సమస్యలు చుట్టుముడుతున్నాయి. ఆ నేతల ఇల్లీగల్ ఎఫైర్స్(Illegal ) ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి.
వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొందరు నేతల రాసలీలలకు సంబంధించిన ఆడియోలు వెలుగులోకి వచ్చాయి. అధికారం కోల్పోయిన తరువాత ఆ పార్టీ నేతల ఇల్లీగల్ ఎఫైర్స్ ఒక్కొక్కటీ వెలుగులోకి బయటపడుతున్నాయి.
మొదటగా మాజీ మంత్రి అంబటి రాంబాబు(ambati ram babu) పలువురు మహిళలతో 'ఆ' విషయాలు మాట్లాడిన ఆడియోలు బయటకి వచ్చాయి. ఓ మహిళతో అమ్మాయిల విషయం మాట్లాడుతూ 'అన్నీ చేస్తానంటే' పంపించు అన్న మాటలు విన్నాం. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో అప్పటి ఎంపీ గోరంట్ల మాధవ్ డైరెక్ట్ వీడియోలతో సహా దొరికిపోయాడు. ఎవరితోనో నగ్నంగా ఉండి వీడియో కాల్(Nude video call) మాట్లాడడం అప్పట్లో సంచలనంగా మారింది. అప్పట్లో ఈ వివాదాలపై పెద్ద దుమారమే రేగింది. వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత ఆ పార్టీలో పెద్ద నేత విజయసాయిరెడ్డిపై(Vijay sai reddy) సంచలన ఆరోపణలు చేశాడు ఓ వ్యక్తి. తన భార్య విజయసాయిరెడ్డి వల్లే గర్భం దాల్చిందని, తన భార్య కన్న బిడ్డకు విజయసాయిరెడ్డే తండ్రేనని మధుసూదన్(Madhu sudhan) అనే వ్యక్తి ఆరోపించాడు. తన భార్య గర్భానికి.. బిడ్డ జననానికి కర్త, కర్మ, క్రియ విజయసాయి రెడ్డే కారణమని ఒక మహిళ భర్త సంచలన ఆరోపణలు చేశారు. ఈ మేరకు పోలీసులకు కూడా ఫిర్యాదు చేయడంతో మొత్తం బయటికి వచ్చింది. ఆ మహిళ దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ పదవిలో ఉంది. వైసీపీ హయాంలో ఒక వెలుగు వెలిగిన శాంతి కావడంతో ఈ వ్యవహారం సంచలనంగా మారింది. ఎంతమంది అధికారులు ఉన్నప్పటికీ శాంతిని మాత్రం పట్టుబట్టి మరీ ఎన్టీఆర్ జిల్లాలో పోస్టింగ్ ఇప్పించారనే ఆరోపణలు ఉన్నాయి. కొత్త ప్రభుత్వం రాగానే సస్పెన్షన్ వేటు పడటంతో ఇంటికే పరిమితం అయ్యారు. తన కొడుక్కి డీఎన్‌ఏ పరీక్ష నిర్వహిస్తే మొత్తం బయటపడుతుందని ఆరోపించాడు మధుసూదన్.
అంబటి, గోరంట్ల, విజయసాయి వ్యవహారాలు బయటపడుతున్న క్రమంలోనే మరో నేత దువ్వాడ శ్రీనివాస్ ఇల్లీగల్ ఎఫైర్ బయటకొచ్చింది. తన భార్యా పిల్లలను వదిలిపెట్టి మరో మహిళతో ఉంటున్న దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గతంలో దువ్వాడ శ్రీనివాస్ పవన్ మూడ పెళ్లిళ్ల వ్యవహారంపై విమర్శలు చేశాడు. హిందూ మతాన్ని గౌరవించేవారు ఒకే స్త్రీని పెళ్లాడాలని, కానీ, ఆ సంప్రదాయాలకు తూట్లు పొడిచిన వ్యక్తి పవన్ కల్యాణ్ అంటూ విమర్శించాడు. దువ్వాడ చెప్పిన హిందూమతం సంప్రదాయాలు ఎటుపోయాయి అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఆ మహిళతో దువ్వాడ ఉంటున్న ఇంటి ఎదుట ఆయన భార్య, పిల్లలు ధర్నాకు కూడా దిగారు. రాజకీయ చరిత్ర ఉన్న కుటుంబం పరువుతీయొద్దని వేడుకున్నారు. మొత్తంగా వైసీపీ ఇల్లీగల్ ఎఫైర్స్ ఇప్పుడు కరెంట్ ఎఫైర్స్‌గా తెలుగురాష్ట్రాల్లో చర్చకు దారితీస్తున్నాయి.