ప్రతిపక్ష హోదా ఇవ్వకుంటే అసెంబ్లీకి(Assembly) వెళ్లనని జగన్‌ చెప్పడం సిగ్గు చేటని, చేతకానితనమని, అసలు ఎమ్మెల్యే పదవికి జగన్‌ అర్హుడు కాడని, వెంటనే రాజీనామా చేయాలని,వై.ఎస్‌.షర్మిల(Appcc YS Sharmila) ట్వీట్‌ చేసిన విషయం తెలిసిందే.

ప్రతిపక్ష హోదా ఇవ్వకుంటే అసెంబ్లీకి(Assembly) వెళ్లనని జగన్‌ చెప్పడం సిగ్గు చేటని, చేతకానితనమని, అసలు ఎమ్మెల్యే పదవికి జగన్‌ అర్హుడు కాడని, వెంటనే రాజీనామా చేయాలని ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వై.ఎస్‌.షర్మిల(Appcc YS Sharmila) ట్వీట్‌ చేసిన విషయం తెలిసిందే. షర్మిల ట్వీట్‌పై వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీYsr congress Party) ఘాటుగానే రియాక్టయ్యింది. చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu)ఏజెంటుగా రాజకీయాలు చేసేవారికి, ప్రజల తరఫున ప్రతి క్షణం ఆలోచించే వారికి మధ్య చాలా తేడా ఉంటుందని పేర్కొంది. షర్మిలలాగే వైసీపీ కూడా ట్వీట్టర్‌లో సుదీర్ఘ పోస్టు పెట్టింది. షర్మిల మాటలు చూస్తుంటే ఆమెకు జగన్‌పై ద్వేషం కనిపిస్తుందే తప్ప ప్రజా సమస్యలు ఎక్కడా కనిపించడం లేదని వైసీపీ తెలిపింది. ప్రతిపక్షంలో ఉంటూ మరో ప్రతిపక్షాన్ని విమర్శిస్తున్నారంటే చంద్రబాబుకు మద్దతు పలకడమేనని అర్థమవుతోందని, అదే మీ ఎజెండాగా కనిపిస్తోందని విమర్శించింది. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి (YS Rajashekar Reddy)విగ్రహాలు కూలుస్తుంటే నోరు విప్పని షర్మిల ఇప్పుడేమో ఏదేదో చెబుతున్నదని వైసీపీ విమర్శిచింది. పావురాల గుట్టలో పావుమైపోయాడని వైఎస్సార్‌ మరణాన్ని అవహేళన చేసిన వారితో మీరు కలిసి నడవడం లేదా అని మండిపడింది. తెలంగాణలో(Telangana) పుట్టాను.. తెలంగాణలోనే ఉంటాను అంటూ తెలంగాణ ప్రజలకు మాయమాటలు చెప్పి అక్కడ నుంచి బిచాణా ఎత్తేసి పారిపోయి ఇక్కడకు రాలేదా? అని షర్మిలను వైసీపీ ప్రశ్నించింది. మీకన్నా పిరికివాళ్లు.. మీకన్నా స్థిరత్వం లేనివాళ్లు.. మీకన్నా అహంకారులు.. మీకన్నా స్వార్థపరులు ఎవరైనా ఉంటారా అంటూ ఘాటుగా ప్రశ్నించింది. ఇంతకీ మీరు పోస్టు చేసిన ట్వీట్‌ చంద్రబాబు దగ్గర నుంచి వచ్చిందా? లేక పక్క రాష్ట్రంలో ఉన్న ఆయన ఏజెంటు దగ్గర నుంచి వచ్చిందా? అని అడిగింది.

ehatv

ehatv

Next Story