Peddireddi Ramchandra Reddy : పెద్దిరెడ్డి ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన సమయమిది!

మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని(Pedi reddy Ram chandra reddy) వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి(YS Jagan) బలంగా విశ్వసిస్తారు. ఆయనపై ఎవరెన్ని చెప్పినా జగన్ పట్టించుకోరు. అందుకే వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో ఆయనకు ఎనలేని ప్రాధాన్యమిచ్చారు. ఇస్తూనే ఉన్నారు. ఇప్పుడు పెద్దిరెడ్డిని పొలిటికల్‌ అడ్వైజరీ కమిటీ మెంబర్‌ (పీఏసీ)గా, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడిగా నియమించారు. మొన్నటి ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ 11 అసెంబ్లీ స్థానాలను, నాలుగు లోక్‌సభ స్థానాలను గెల్చుకుంది. ఈ విజయంలో పెద్దిరెడ్డి కుటుంబానికే కీలక భాగస్వామ్యం ఉందన్నది కాదనలేని సత్యం. పుంగనూరు నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తంబళ్లపల్లె నుంచి ఆయన తమ్ముడు ద్వారకనాథరెడ్డి, రాజంపేట లోక్‌సభ స్థానం నుంచి కుమారుడు మిథున్‌రెడ్డి విజయం సాధించారు. అంటే పెద్దిరెడ్డి కుటుంబానికి ప్రజలలో ఆదరణ ఉందని అర్థమవుతోంది. ఈ విషయం తెలుసుకునే పెద్దిరెడ్డికి పార్టీలో మంచి స్థానం కల్పించారు జగన్‌! అయితే పార్టీలో పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి, ఆయ‌న కుమారుడు మిథున్‌రెడ్డి పెత్త‌నం ఎక్కువైంద‌ని కొందరు లోలోపల అనుకుంటూ ఉంటారు. మొన్నటి ఎన్నికల్లో తాము పరాజయం చెందడానికి పెద్దిరెడ్డే కారణమని జగన్‌కు కొందరు ఫిర్యాదు కూడా చేశారు. తమకు కాకుండా ప్రత్యర్థులకు ఆర్థిక సాయం చేశారని కొందరు వైసీపీ అభ్యర్థులు అధినేతకు కంప్లయింట్‌ కూడా చేశారు. ఇన్నేసి ఫిర్యాదులు అందినప్పటికీ జగన్‌ వాటిని పక్కన పెట్టి పెద్దిరెడ్డికి పెద్ద పీట వేశారు.

ఇది పెద్దిరెడ్డిని నమ్మి జగన్‌ ఇచ్చిన పదవి. ఇలాంటి సమయంలో తనపై వస్తున్న విమర్శలను, ఫిర్యాదులను పెద్దిరెడ్డి పెద్ద మనసు చేసుకుని పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు తనపై విమర్శలు వస్తున్నాయన్నది ఆయన ఆత్మ విమర్శ చేసుకోవాలి. అందరినీ కలుపుకుని వెళ్లాల్సిన బాధ్యత కూడా ఆయనపై ఉంది. పార్టీని మళ్లీ బలోపేతం చేయాల్సిన కర్తవ్యం కూడా ఆయనదే!

Eha Tv

Eha Tv

Next Story