Jr NTR : జూ.ఎన్టీఆర్ అభిమానుల చూపు వైసీపీ వైపు..!
ఎన్టీఆర్ ఘాట్(NTR Ghat) జూనియర్ ఎన్టీఆర్(Jr NTR) ఫ్యాన్స్ వేసిన ఫ్లెక్సీలను(Flexi) తొలగించిన వీడియోలు సోషల్ మీడియాలో(Social media) వైరల్‌గా అవుతున్నాయి. గత కొంతకాలంగా టీడీపీకి జూ.ఎన్టీఆర్ దూరంగా ఉంటున్నారన్న వార్తలు వస్తున్నాయి. హరికృష్ణ మరణం తరువాత ఆయన కుటుంబానికి నారా కుటుంబానికి(Nara Family), ఆయన కుటుంబానికి దూరంగ పెరుగుతున్నట్లు వార్తలు వచ్చాయి.
ఎన్టీఆర్ ఘాట్(NTR Ghat) జూనియర్ ఎన్టీఆర్(Jr NTR) ఫ్యాన్స్ వేసిన ఫ్లెక్సీలను(Flexi) తొలగించిన వీడియోలు సోషల్ మీడియాలో(Social media) వైరల్‌గా అవుతున్నాయి. గత కొంతకాలంగా టీడీపీకి జూ.ఎన్టీఆర్ దూరంగా ఉంటున్నారన్న వార్తలు వస్తున్నాయి. హరికృష్ణ మరణం తరువాత ఆయన కుటుంబానికి నారా కుటుంబానికి(Nara Family), ఆయన కుటుంబానికి దూరంగ పెరుగుతున్నట్లు వార్తలు వచ్చాయి. జూ.ఎన్టీఆర్‌ను టీడీపీ వాడుకొని వదిలేసిందని ఆయన ఫ్యాన్స్ అంటుండగా.. చంద్రబాబు అరెస్టును తారక్, కల్యాణ్‌రాం(Kalyan Ram) లైట్ తీసుకున్నారన్న విమర్శలు కూడా వచ్చాయి.
తాజాగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఫ్లెక్సీలు తొలగించడంతో ఆయన అభిమానులు బాలకృష్ణపై(Bala Krishna) మండిపడుతున్నారు. అయితే ఇప్పుడు ఒక్కొక్కరు జూనియర్ అనుచరులే కానీ, ఆయన అభిమానులే కానీ వైసీపీలో(YCP) చేరేందుకు సిద్ధమయ్యారట. జూనియర్ ఎన్టీఆర్‌కు అత్యంత సన్నిహితంగా ఉండే కొడాలి నాని(Kodali nani), వల్లభనేని వంశీ(Vallabhaneni Vamsi) వైసీపీలో చేరేందుకు అతనే పరోక్ష సహకారమందించారని టీడీపీలోని ఓ వర్గం వాదిస్తోంది. ఇక జూ.ఎన్టీఆర్ మామ నార్నే శ్రీనివాసరావు సైతం గత ఎన్నికలకు ముందు వైసీపీలో చేరి ఆ పార్టీ విజయానికి కృషి చేశారు. తాజాగా ఎన్నికలకు ముందు దర్శకుడు వి.వి.వినాయక్ వైసీపీకి మరింత దగ్గర అవుతున్నారట. జూ.ఎన్టీఆర్ అనుచరుడిగా ఉన్న వి.వి.వినాయక్ వైసీపీకి మద్దతుదారుడిగా ఉంటూ వస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఎంపీగా పోటీ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. అటు వైసీపీ కూడా వినాయక్‌కు టికెట్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని తెలుస్తోంది. మరోవైపు టీడీపీలో పొసగని హరికృష్ణ కుటుంబ అభిమానులు వైసీపీలోకి వెళ్లేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. వీరందరినీ జూ.ఎన్టీఆరే ప్రోత్సహిస్తున్నారని టీడీపీలోని జూ.ఎన్టీఆర్ వ్యతిరేక వర్గం అనుమానిస్తోంది. వైసీపీలోకి చేరేందుకు జూ.ఎన్టీఆర్ అనుచరులు, అభిమానులు సిద్ధమవుతుండడంతో రాజకీయంగా ఈ అంశం ఇప్పుడు చర్చనీయాంశమైంది.