నెల్లూరు కోర్టు ఫైళ్ల మిస్సింగ్ కేసులో మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డికి సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చింది. నేరం జరిగిన తీరు పట్ల మంత్రి కాకాణికి అవగాహన లేదని, ఫైళ్ల మిస్సింగ్ కేసులో ఆయన పాత్ర లేదని కేంద్ర దర్యాప్తు సంస్థ తేల్చింది. సయ్యద్ హయత్, షేక్ ఖాజా రసూల్‌లను సీబీఐ దోషులుగా పేర్కొంది. దొంగతనాలు అలవాటున్న వీరే కోర్టులో ఉన్న బ్యాగ్ దొంగిలించారని చార్జ్ షీట్‌లో స్పష్టం చేసింది. మంత్రి కాకాణికి దోషులతో సంబంధం లేదని సీబీఐ […]
నెల్లూరు కోర్టు ఫైళ్ల మిస్సింగ్ కేసులో మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డికి సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చింది. నేరం జరిగిన తీరు పట్ల మంత్రి కాకాణికి అవగాహన లేదని, ఫైళ్ల మిస్సింగ్ కేసులో ఆయన పాత్ర లేదని కేంద్ర దర్యాప్తు సంస్థ తేల్చింది. సయ్యద్ హయత్, షేక్ ఖాజా రసూల్‌లను సీబీఐ దోషులుగా పేర్కొంది. దొంగతనాలు అలవాటున్న వీరే కోర్టులో ఉన్న బ్యాగ్ దొంగిలించారని చార్జ్ షీట్‌లో స్పష్టం చేసింది. మంత్రి కాకాణికి దోషులతో సంబంధం లేదని సీబీఐ చెప్పడం కాకాణికి పెద్ద రిలీఫ్. ఈ కేసులో ఆంధ్రప్రదేశ్ పోలీసుల విచారణను సీబీఐ సమర్థించింది. ఏడాది పాటు విచారణ జరిపిన సీబీఐ అధికారులు 88 మంది సాక్షులను ప్రశ్నించారు. ఇందుకు సంబంధించిన 403 పేజీల చార్జ్‌షీట్ రూపొందించింది. మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధంలేదని ఆయన మొదటి నుంచి చెబుతూ వచ్చారు. సీబీఐ విచారణకైనా తాను సిద్ధమని హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసులో సీబీఐ విచారణ మొదలుపెట్టింది. ఆయన నిర్దోషిగా తేలారు.
టీడీపీ నేత సోమిరెడ్డి ఆరోపణలను కొట్టిపారేసిన సీబీఐ.. మంత్రి కాకాణికి దోషులతో ఎలాంటి సంబంధం లేదని తేలింది. ఏపీ పోలీసుల విచారణను సీబీఐ సమర్థించింది. పోలీసులు నిర్ధారించిన సయ్యద్ హయత్, షేక్ ఖాజా రసూల్‌లను సీబీఐ దోషులుగా నిర్ధారించింది. సీబీఐ విచారణకు తాను సిద్ధమని హైకోర్టులో మంత్రి కాకాణి ముందే చెప్పారు. సీబీఐ విచారణ జరపాలని హైకోర్టును మంత్రి కోరారు. సీబీఐ విచారణకు అభ్యంతరం లేదని అప్పట్లోనే హైకోర్టుకి అడ్వకేట్ జనరల్ తెలిపారు. టీడీపీ చేసిన ఆరోపణల్లో ఏ మాత్రం నిజం లేదని తాజాగా తేలింది.