ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సైలెంట్‌గా ఉంటూ వస్తున్న గోరంట్ల మాధవ్‌ ఈరోజు విరుచుకుపడ్డారు.

ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సైలెంట్‌గా ఉంటూ వస్తున్న గోరంట్ల మాధవ్‌ ఈరోజు విరుచుకుపడ్డారు. కూటమి ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు. సూపర్‌ సిక్స్ అంటూ అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించారు. సూపర్‌ సిక్స్‌కు కొత్త అర్థం చెప్పుకొచ్చారు గోరంట్ల మాధవ్‌. హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ తాజాగా కూటమి ప్రభుత్వంపై చేసిన విమర్శలు పొలిటికల్ హీట్‌ను పెంచాయి.రాయి. ఎన్నికల సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తామని హామీ ఇచ్చిన విషయం అందరికి తెలిసిందే. ప్రస్తుతం అదే హామీని నెరవేర్చాలని కోరుతూ ఇటీవల మాజీ సీఎం జగన్ సైతం ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. తాజాగా గోరంట్ల మాధవ్‌ హిందూపురంలో మీడియా సమావేశం నిర్వహించి చంద్రబాబు సూపర్‌ సిక్స్‌ కాదు.. అదొక 'లోఫర్‌ సిక్స్' అని అన్నారు. డిప్యూటీ సీఎం ఓ జోకర్‌ సిక్స్ అంటూ తీవ్ర పదజాలాన్ని వాడారు. రాష్ట్ర ప్రజలను సూపర్‌ సిక్స్‌తో చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ మోసం చేశారన్నారు. కూటమి ప్రభుత్వాన్ని గెలిపించి ప్రజలు చింతిస్తున్నారని.. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మళ్లీ జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని గోరంట్ల మాధవ్‌ అన్నారు. అయితే గోరంట్ల మాధవ్‌ ఒక్కసారిగా ఎందుకు ఇంత రెచ్చిపోయాడో.. అధిష్టానం అండాదండలతోనే ఆయన అధికార పార్టీపై విమర్శలు కురిపిస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Eha Tv

Eha Tv

Next Story