టీడీపీ(TDP) సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడుని(Ayyannapathrudu) పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీ నుంచి విశాఖ వచ్చిన అయ్యన్నపాత్రుడుని కృష్ణా జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు స‌మాచారం. ఇటీవల గన్నవరం యువగళం సభలో ముఖ్యమంత్రి జ‌గ‌న్‌(Jagan), మంత్రులపై అయ్యన్నపాత్రుడు తీవ్ర‌స్థాయిలో వ్యాఖ్య‌లు చేశారు.

టీడీపీ(TDP) సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడుని(Ayyannapathrudu) పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీ నుంచి విశాఖ వచ్చిన అయ్యన్నపాత్రుడుని కృష్ణా జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు స‌మాచారం. ఇటీవల గన్నవరం యువగళం సభలో ముఖ్యమంత్రి జ‌గ‌న్‌(Jagan), మంత్రులపై అయ్యన్నపాత్రుడు తీవ్ర‌స్థాయిలో వ్యాఖ్య‌లు చేశారు. గన్నవరం సభలో(Gannavaram Sabha) ప్రసంగాలకు సంబందించి వైసీపీ నేత‌లు ప‌లువురు టీడీపీ నాయ‌కులపై పోలీసుల‌కు ఫిర్యాదులు కూడా చేశారు. ఈ క్ర‌మంలోనే మాజీ మంత్రి పేర్ని నాని(Perni Nani) ఫిర్యాదుతో అయ్యన్న పాత్రుడుపై కేసు నమోదు చేశారు. సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ అయ్యన్నపై 153 A, 354 A1(4), 504, 505(2), 509 ఐపీఎస్ సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదుచేశారు. ఈ క్ర‌మంలోనే ఢిల్లీ నుంచి విశాఖ చేరుకున్న అయ్యన్నపాత్రుడుని పోలీసులు అరెస్ట్ చేశారు.

Updated On 1 Sep 2023 1:22 AM GMT
Ehatv

Ehatv

Next Story