పుష్ప 2 థియేటర్లలో సందడి చేస్తోంది. ఎక్కడ చూసినా పుష్ప వేవ్‌ నడుస్తోంది. మొదటి ఆట నుంచే పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకున్న ఈ సినిమా కలెక్షన్లను కుమ్మి పారేస్తున్నది.

పుష్ప 2 థియేటర్లలో సందడి చేస్తోంది. ఎక్కడ చూసినా పుష్ప వేవ్‌ నడుస్తోంది. మొదటి ఆట నుంచే పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకున్న ఈ సినిమా కలెక్షన్లను కుమ్మి పారేస్తున్నది. ఈ సినిమాపై వైసీపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు(Former Minister Ambati Rambabu) ట్వీట్ చేశారు. తనదైన మార్క్‌తో ఓ పోస్ట్ పెట్టాడు. పుష్ప 2 ది రూల్(Pushpa 2 the rule) సినిమాతో ఆల్ ఇండియా ఇండస్ట్రీ హిట్ ఇచ్చినందుకు అల్లు అర్జున్‌(Allu Arjun)తో పాటు చిత్ర బృందానికి ఆయన అభినందనలు చెప్పారు. 'పుష్ప అంటే వైల్డ్‌ ఫైర్‌ కాదు.. వరల్డ్ ఫైర్' అంటూ ట్వీట్ చేశాడు. కాగా పుష్ప విడుదలను ఆపేస్తాం, అడ్డుకుంటాం, ఆడనివ్వం అని అన్నవారు పుష్ప 2 సృష్టిస్తున్న సునామిని చూసి బిత్తరపోతున్నారు. మెగా ఫ్యాన్స్‌, టీడీపీ సానుభూతిపరులు పుష్ప2 ఆడకూడదనుకున్నారు. కానీ సినిమా రికార్డులు సృష్టిస్తోంది. మెగా ఫ్యాన్స్‌ సపోర్ట్ లేకపోయినా బాక్సాఫీసును బద్దలు కొడుతున్నది. నంద్యాలలో వైసీపీ అభ్యర్థికి సపోర్ట్‌గా వెళ్లడంతో గొడవ మొదలయ్యింది. ఇప్పటికీ ఇది కొనసాగుతూనే ఉంది.

ehatv

ehatv

Next Story