Gangula Avanthi Reddy : ఆళ్లగడ్డ నుంచి అవంతి పోటీ... ఎవరీమే!
ఉమ్మడి కర్నూలు(Kurnool) జిల్లాలో ఉన్న ఆళ్లగడ్డ నియోజకవర్గంపై(Allagadda Constituency) అందరి ఆసక్తి ఉంటుంది. ప్రస్తుతం అక్కడ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్‌కు(YSR congress) చెందిన బ్రిజేంద్రరెడ్డి ఉరఫ్ నాని(Brijendra Reddy Uraf Nani) ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇప్పుడు పార్టీ అధినేత జగన్ అభ్యర్థుల పనితీరును జల్లెడ పడుతున్నారు కదా! గెలుపు గుర్రాల కోసం అన్వేషిస్తున్నారు కదా! ఈ క్రమంలోనే బ్రిజేంద్రరెడ్డికి మరోసారి టికెట్ దొరకడం కష్టమేనన్న మాట వినిపిస్తోంది.
ఉమ్మడి కర్నూలు(Kurnool) జిల్లాలో ఉన్న ఆళ్లగడ్డ నియోజకవర్గంపై(Allagadda Constituency) అందరి ఆసక్తి ఉంటుంది. ప్రస్తుతం అక్కడ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్‌కు(YSR congress) చెందిన బ్రిజేంద్రరెడ్డి ఉరఫ్ నాని(Brijendra Reddy Uraf Nani) ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇప్పుడు పార్టీ అధినేత జగన్ అభ్యర్థుల పనితీరును జల్లెడ పడుతున్నారు కదా! గెలుపు గుర్రాల కోసం అన్వేషిస్తున్నారు కదా! ఈ క్రమంలోనే బ్రిజేంద్రరెడ్డికి మరోసారి టికెట్ దొరకడం కష్టమేనన్న మాట వినిపిస్తోంది. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక జరుగుతున్న నేపథ్యంలో ఆళ్లగడ్డలో రాజకీయ సమీకరణలు మారుతున్నాయట! కొన్నాళ్లుగా అక్కడ వైఆర్‌ఎస్ కాంగ్రెస్ తరపున గంగుల అవంతి రెడ్డి(Gangula Avanthi Reddy) జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆళ్లగడ్డ నుంచి ఫ్యాన్ సింబల్‌పై ఆమెనే పోటీ చేయవచ్చనే అభిప్రాయం నెలకొంది. ఎమ్మెల్యే నానిపై సర్వే నివేదికలు వ్యతిరేకంగా వచ్చాయట! ఎంత వ్యతిరేకత ఉన్నప్పటికీ బ్రిజేంద్రరెడ్డి అదృష్టమేమిటంటే అక్కడ తెలుగుదేశంపార్టీ ఇన్‌ఛార్జ్‌గా భూమా అఖిలప్రియ(Bhuma Akhila Priya) ఉండటం. ఆమెపై బోల్డన్ని ఆరోపణలు ఉన్నాయి. కిడ్నాప్‌లు, దౌర్జన్యాలు, భూ ఆక్రమణలు ఇలా అనేకానేక కేసుల్లో ఆమె ఉన్నారు. ఆమె తమ్ముడు జగత్‌విఖ్యాత్‌రెడ్డి, భర్త భార్గవ్‌పై కూడా కేసులు ఉన్నాయి. మొత్తంగా ఆళ్లగడ్డలో భూమా అఖిలప్రియపై కూడా వ్యతిరేకత ఉంది. అంటే ఇటు బ్రిజేంద్రరెడ్డి, అటు అఖిలప్రియకు వ్యతిరేకంగా ఎవరు పోటీపడినా ఈజీగా గెలుస్తారన్నమాట! వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అధినాయకత్వం కూడా ఆళ్లగడ్డలో అభ్యర్థిని మార్చాలనే అనుకుంటున్నదని సమాచారం. ఎమ్మెల్యే బ్రిజేంద్రరెడ్డి సోదరి అవంతిని బరిలో దింపాలని జగన్ అనుకుంటున్నారు. మొన్నీమధ్యన అవంతిని తీసుకుని ఎమ్మెల్యే బ్రిజేంద్రరెడ్డినే స్వయంగా ముఖ్యమంత్రి దగ్గరకు తీసుకెళ్లారట! జగన్‌కు పరిచయం చేశారట! అప్పుడు అవంతికి జగన్ ఏ హామీ ఇచ్చారో ఏమోగానీ అవంతి మాత్రం ఆళ్లగడ్డలో విస్తృతంగా ప్రచారం చేసుకుంటున్నారు. ఇంటింటికి వెళ్లి పరిచయం చేసుకుంటున్నారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌ను మరోసారి గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు.