Chandra shekar Reddy : నారా లోకేష్‌తో మేకపాటి భేటీ
టీడీపీ(TDP) యువనేత నారా లోకేష్‌తో(Nara Lokesh) వైసీపీ(YCP) బహిష్కృత నేత, ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి(Mekapati Chandra shekar Reddy) భేటీ అయ్యారు. కడప జిల్లా బద్వేలులో పాదయాత్ర చేస్తున్న లోకేష్‌ను మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి శనివారం కలిశారు. ఈ సందర్భంగా లోకేష్ పాదయాత్రకు ఆయన సంఘీభావం ప్రకటించారు. అనంతరం ఇరువురు నేతలు తాజా రాజకీయ పరిణామాలపై చర్చించుకున్నట్లు తెలుస్తోంది.
టీడీపీ(TDP) యువనేత నారా లోకేష్‌తో(Nara Lokesh) వైసీపీ(YCP) బహిష్కృత నేత, ఉదయగిరి(Udayagiri) ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి(Mekapati Chandra shekar Reddy) భేటీ అయ్యారు. కడప జిల్లా బద్వేలులో పాదయాత్ర చేస్తున్న లోకేష్‌ను మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి శనివారం కలిశారు. ఈ సందర్భంగా లోకేష్ పాదయాత్రకు ఆయన సంఘీభావం ప్రకటించారు. అనంతరం ఇరువురు నేతలు తాజా రాజకీయ పరిణామాలపై చర్చించుకున్నట్లు తెలుస్తోంది. భేటీ అనంతరం మేకపాటి మాట్లాడుతూ.. నేను ఉదయగిరి నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచానని.. వచ్చే ఎన్నికల్లోనూ తానే గెలిస్తున్నాని ఘంటాపథంగా చెప్పారు. లోకేష్ సత్తా ఉన్న నాయకుడని.. రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. త్వరలో తాను టీడీపీలో చేరుతానని తెలిపారు. వైసీపీలో విలువలు లేవని.. సీనియర్ ఎమ్మెల్యేనన్న కనీస గౌరవం లేకుండా చులకనగా వ్యవహరించారని అన్నారు. మరోవైపు నెల్లూరు జిల్లాకు చెందిన వైసీపీ బహిష్కృత నేతలు ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలు కూడా టీడీపీలో చేరబోతున్నారు.