YCP Balija Ashok : కాకినాడ వైసీపీ ఎంపీ అభ్యర్థి బలిజ అశోక్
బలిజ అశోక్(Balija Ashok).. పొలిటికల్ ఇంటెలిజెన్స్ విభాగానికి ఎస్పీగా(SP) పనిచేస్తున్న సత్యయేసుబాబుకు(Satyayesubabu) ఇతను స్వయానా పిల్లనిచ్చినమామ. బలిజ అశోక్ 2019లో కాకినాడ(Kakinada) ఎంపీ టికెట్(MP Ticket) ఆశించారు.. కానీ అప్పుడు వైసీపీ(YCP) అధిష్టానం వంగా గీతకు(Vanga Geetha) టికెట్ కేటాయించింది. అయినా బలిజ అశోక్ వైసీపీ నేతలతో సన్నిహతంగా వ్యవహరిస్తూ వచ్చాడు. సీఎం జగన్‌కు(CM Jagan) సత్యయేసుబాబు సన్నిహితంగా ఉంటున్నాడు.

YCP Balija Ashok
బలిజ అశోక్(Balija Ashok).. పొలిటికల్ ఇంటెలిజెన్స్ విభాగానికి ఎస్పీగా(SP) పనిచేస్తున్న సత్యయేసుబాబుకు(Satyayesubabu) ఇతను స్వయానా పిల్లనిచ్చినమామ. బలిజ అశోక్ 2019లో కాకినాడ(Kakinada) ఎంపీ టికెట్(MP Ticket) ఆశించారు.. కానీ అప్పుడు వైసీపీ(YCP) అధిష్టానం వంగా గీతకు(Vanga Geetha) టికెట్ కేటాయించింది. అయినా బలిజ అశోక్ వైసీపీ నేతలతో సన్నిహతంగా వ్యవహరిస్తూ వచ్చాడు. సీఎం జగన్‌కు(CM Jagan) సత్యయేసుబాబు సన్నిహితంగా ఉంటున్నాడు. ప్రతిరోజు రాజకీయానికి సంబంధించిన రిపోర్టులు అందజేస్తూ ఉంటాడు. సీఎం జగన్‌కు సన్నిహితుడైన సత్యయేసుబాబుకు మామ కావడంతో ఇతనికి టికెట్ దక్కడం సులవైందంటున్నరు. బలిజ అశోక్ గతంలో ఇండియన్ రైల్వేస్‌లో(Indian Railways) పనిచేశారు. అక్కడ ఆయన పలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొఆన్నారు. మేకపాటి కుటంబానికి చెందిన కేఎంసీ కంపెనీలో కూడా ఆయన సలహాదారుడిగా వ్యవహరించారు. ఆ కంపెనీకి సంబంధించిన కేసుల్లో కూడా బలిజ అశోక్ నిందితుడిగా ఉన్నారు. మేకపాటితో సన్నిహితంగా ఉండడం, ఆయన కంపెనీల్లో కీలక పాత్ర పోషిస్తున్న బలిజ అశోక్‌కు టికెట్ ఇస్తున్నారన్న ప్రచారంతో వైసీపీ శ్రేణులు, కార్యకర్తలు ఆశ్చర్యపోతున్నారు. అయితే ఆయనకు సత్యయేసుబాబుకు పిల్లనిచ్చిన మామగానే గుర్తింపు ఉంది. స్థానికంగా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించలేదని, సోషల్ సర్వీస్‌లో ఏనాడూ పాల్గొనలేదని, ప్రజలకు ఇతని గురించి పెద్దగా తెలియదని.. ఇలాంటి వ్యక్తికి ఎంపీ టికెట్ ఎలా ఇస్తారనేది ఆయన వ్యతిరేక వర్గం వాదన. వైసీపీ నేతలతో సన్నిహిత సంబంధాలున్నంత మాత్రాన.. ప్రజలతో సంబంధాలు కూడా ఉండాలి కదా అని ఆ వర్గం ప్రశ్నిస్తున్నారు.
