ఏమైనా కానివ్వండి ...కుప్పం(Kuppam) నియోజకవర్గంలో ఉన్నవారు అదృష్టవంతులు! ఈ మూడునాలుగు రోజులు వారు నక్కను తొక్కినట్టే! వారి పంట పండినట్టే! కారణం ఎన్నికల్లో విజయం సాధించేందుకు ప్రధానపార్టీలు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాయి. ఎన్నికల ఖర్చుపై ఎన్నికల సంఘం పెట్టిన నిబంధనలేవీ అక్కడ పని చేయడం లేదు. కుప్పంలో గెలిచి సత్తా చాటుకోవాలన్న చంద్రబాబు(Chandrababu) ప్రయత్నం.

ఏమైనా కానివ్వండి ...కుప్పం(Kuppam) నియోజకవర్గంలో ఉన్నవారు అదృష్టవంతులు! ఈ మూడునాలుగు రోజులు వారు నక్కను తొక్కినట్టే! వారి పంట పండినట్టే! కారణం ఎన్నికల్లో విజయం సాధించేందుకు ప్రధానపార్టీలు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాయి. ఎన్నికల ఖర్చుపై ఎన్నికల సంఘం పెట్టిన నిబంధనలేవీ అక్కడ పని చేయడం లేదు. కుప్పంలో గెలిచి సత్తా చాటుకోవాలన్న చంద్రబాబు(Chandrababu) ప్రయత్నం. చంద్రబాబును ఎలాగైనా సరే ఓడించాలన్నది వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌(YCP) పంతం. అందుకే ఈ రెండు పార్టీలు చెరో 150 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాయి. ఇంత ఖరీదైన ఎన్నిక ఇంతకు ముందు ఎక్కడా జరగలేదు. ఇప్పటికే ఓ పార్టీ ఓటుకు నాలుగువేల రూపాయల చొప్పున పంపిణీ చేస్తోంది. డిమాండ్‌ను బట్టి ఓటుకు అయిదు వేల రూపాయలు కూడా ఇస్తోంది.

ఇంతకు ముందు తెలుగుదేశంపార్టీ(TDP) ఓటర్లకు మొక్కుబడిగా ఎంతో కొంత ఇచ్చేసి గంపగుత్తగా ఓట్లు వేయించుకునేది. ఇప్పడు పరిస్థితి మారింది. మునుపెన్నడూ లేని విధంగా కుప్పంలో ఓటుకు డిమాండ్‌ బాగానే పెరిగంది. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో టీడీపీని మ‌ట్టి క‌రిపించిన అనుభ‌వం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌కు ఉంది. టీడీపీ భయానికి అదే కారణం. ఈసారి కూడా అదే జరిగితే ఓడిపోవడం ఖాయమని చంద్రబాబు భావిస్తున్నారు. చంద్రబాబును గెలిపించుకోవడానికి ఆయన సతీమణి నారా భువనేశ్వరి(Nara Bhuvaneshwari) కుప్పంలోనే మకాం వేశారు. నాయకులను అలెర్ట్‌ చేస్తున్నారు. పరిస్థితులను పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు సమాచారాన్ని రాబడుతున్నారు. వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి ఏదైనా అనుకుంటే దాన్ని నెరవేర్చుకునేవరకు నిద్రపోరన్న సంగతి టీడీపీ క్యాడర్‌కు తెలియందేమీ కాదు. అందుకే కుప్పంపై టీడీపీ స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకుంటోంది. ఓటర్లకు వంద కోట్ల వరకు పంచుతున్నది టీడీపీ. 50 లక్షలను క్యాడర్‌కు ఇచ్చి ఎన్నికల్లో బాగా పని చేయమని చెబుతున్నది. మొత్తంగా రెండు పార్టీలో ఈ ఎన్నిలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.

Updated On 9 May 2024 4:47 AM GMT
Ehatv

Ehatv

Next Story