టీడీపీ ప్రభుత్వంలో కాపులపై అనేక కేసులు పెట్టారని జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. తుని రైలు ద‌హ‌నం కేసు కొట్టేసినందుకు రామోజీ బాధ పడుతున్నారని.. కేసులు కొట్టేస్తే చంద్రబాబు, రామోజీలకు బాధ ఎందుకో అర్థం కావడం లేదని అన్నారు. వంగవీటి మోహన్ రంగాను చంపి.. అల్లర్లు జరిగితే కాపులపై కేసులు పెట్టారని.. 1989లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ.. సీఎం చెన్నారెడ్డి ఒకే ఒక జీవోతో కాపులపై కేసులు ఎత్తేశారని పేర్కొన్నారు. టీడీపీ హయాంలో కాపులను హింసించారని ఆరోపించారు.

టీడీపీ ప్రభుత్వంలో కాపులపై అనేక కేసులు పెట్టారని జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu) అన్నారు. తుని రైలు ద‌హ‌నం కేసు(Tuni Railway Case) కొట్టేసినందుకు రామోజీ బాధ పడుతున్నారని.. కేసులు కొట్టేస్తే చంద్రబాబు(Chandra Babu), రామోజీ(Ramoji)లకు బాధ ఎందుకో అర్థం కావడం లేదని అన్నారు. వంగవీటి మోహన్ రంగా(Vangaveeti Mohana Ranga)ను చంపి.. అల్లర్లు జరిగితే కాపులపై కేసులు పెట్టారని.. 1989లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ(Congress Party).. సీఎం చెన్నారెడ్డి( Chenna Reddy) ఒకే ఒక జీవోతో కాపులపై కేసులు ఎత్తేశారని పేర్కొన్నారు. టీడీపీ(TDP) హయాంలో కాపులను హింసించారని ఆరోపించారు. కాపులపై చంద్రబాబు ప్రభుత్వం 69 రకాల కేసులు పెట్టిందని.. టీడీపీ ప్రభుత్వం కాపుల మీద పెట్టిన కేసులను వైఎస్ జగన్(YS Jgan) ప్రభుత్వం రద్దు చేసిందని తెలిపారు.

టీడీపీ ఉంటే కాపులను హింసిస్తారు, కేసులు పెడతారని పేర్కొన్నారు. కాపులను నాశనం చేయాలని కంకణం కట్టుకున్న పార్టీ టీడీపీ అని.. టీడీపీ కాపు వ్యతిరేక పార్టీ అని అన్నారు. ముద్రగడ పద్మనాభం కుటుంబాన్ని వేధించడంలో.. చంద్రబాబు సైకోలా వ్యవహరించాడని అన్నారు. చరిత్ర తెలియని వారు కాపు ప్రతినిధులమంటూ వస్తున్నారని.. పవన్ కు కాపుల చరిత్ర తెలియదని ఎద్దేవా చేశారు. ముద్రగడ పద్మనాభం కుటుంబాన్ని చంద్రబాబు వేధిస్తున్నప్పుడు పవన్ కల్యాణ్(Pawan Kalyan) ఎక్కడున్నాడు..? అని ప్ర‌శ్నించారు. వంగవీటి మోహన్ రంగాకు పవన్ టీ ఇచ్చాడట..! ఆయన చనిపోయాక కాఫీ , టీ ఇచ్చాడా..? సెటైర్లు వేశారు.

Updated On 2 May 2023 6:03 AM GMT
Ehatv

Ehatv

Next Story