Yarlagadda Lakshmi Prasad : ఆనాడు చంద్రబాబుమేనరికం సంబంధాలు మంచివి కావన్నారు...
మహానటుడు ఎన్టీఆర్ వర్ధంతి రోజున ఎన్టీఆర్ ఘాట్(NTR Ghat) దగ్గర బాలకృష్ణ(Balakrishna) చేసిన చర్యపై అనేక విమర్శలు వస్తున్నాయి. జూనియర్ ఎన్టీఆర్(Jr NTR) అభిమానులు ఫెక్సీ పెట్టి ఉండవచ్చు. బాలకృష్ణకు ఆ ఫ్లెక్సీ నచ్చకపోవచ్చు. అంత మాత్రాన ఆ ఫ్లెక్సీ అక్కడ ఉండటానికి వీల్లేదని, వెంటనే పీకేయమని చెప్పడానికి అసలు బాలకృష్ణ ఎవరని నెటిజన్లు(Netizens) తిట్టిపోస్తున్నారు.
మహానటుడు ఎన్టీఆర్ వర్ధంతి రోజున ఎన్టీఆర్ ఘాట్(NTR Ghat) దగ్గర బాలకృష్ణ(Balakrishna) చేసిన చర్యపై అనేక విమర్శలు వస్తున్నాయి. జూనియర్ ఎన్టీఆర్(Jr NTR) అభిమానులు ఫెక్సీ పెట్టి ఉండవచ్చు. బాలకృష్ణకు ఆ ఫ్లెక్సీ నచ్చకపోవచ్చు. అంత మాత్రాన ఆ ఫ్లెక్సీ అక్కడ ఉండటానికి వీల్లేదని, వెంటనే పీకేయమని చెప్పడానికి అసలు బాలకృష్ణ ఎవరని నెటిజన్లు(Netizens) తిట్టిపోస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ విషయంలో తెలుగుదేశం పార్టీ(TDP) నేతలు ఓవరాక్షన్ చేస్తున్నారని, తారక్ ఆల్‌రెడీ ఆకాశమంత ఎత్తుకు ఎదిగారని, ఆకాశం మీద ఉమ్ము వేయాలని చూస్తే అది వారి మొహం మీదనే పడుతుందని మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్(Yarlagadda Lakshmi Prasad) వ్యాఖ్యానించారు. తారక్ ఫ్లెక్సీలు తొలగిస్తే ఆయనకేమీ నష్టం లేదని, తారక్‌పై ఎవరు ఎన్ని విమర్శలు చేసినా అది వారికే నష్టమని చెప్పారు. 'అప్పట్లో బాలకృష్ణ కూతురును లోకేశ్‌కు(Nara Lokesh) ఇచ్చి పెళ్లి చేస్తున్నారా? అని చంద్రబాబు(Chandrababu) నాయుడును నేను అడిగాను. నాన్సెన్స్ అంటూ తనను తిట్టారని, మేనరికం సంబంధాలు మంచి కావన్నారని లెక్చర్లు ఇచ్చిన చంద్రబాబు చివరకు బాలకృష్ణ కూతురును నారా లోకేశ్‌కు ఇచ్చి కట్టబెట్టారని యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అన్నారు.ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిపై() పిచ్చి పిచ్చి కేసులు పెట్టారని, లక్ష కోట్ల అవినీతిని అని తప్పుడు ప్రచారం చేశారని చెప్పారు. సీఎం జగన్ ఒక హీరో అని, నేను మంచి చేస్తేనే ఓటు వేయండని ధైర్యంగా చెప్పిన నేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాత్రమేనని, అలాంటి నేత దేశంలో మరొకరు లేరని యార్లగడ్డ అన్నారు.