ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు మాజీ మంత్రి, ఎమ్మెల్సీ యనమల రామకృష్ణడు ఓ లేఖ రాశారు.

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు మాజీ మంత్రి, ఎమ్మెల్సీ యనమల రామకృష్ణడు ఓ లేఖ రాశారు. ఆ లేఖలో యనమల అసహనం కొట్టొచ్చినట్టు కనిపించింది. కాకినాడ సెజ్‌(Kakinada SEZ )లో మత్స్యకారులు, చిన్న రైతుల నుంచి తక్కువ ధరకు భూములు కొనన పెద్ద కంపెనీలు లాభపడ్డాయని, రైతులు, మత్స్యకారులకు న్యాయం చేయాల్సిందిగా ఆ లేఖలో యనమల విన్నవించుకున్నప్పటికీ చంద్రబాబుపై అసంతృప్తి ఉన్నట్టు తోస్తున్నది. నిజానికి తెలుగుదేశంపార్టీ(TDP)లో చాలా సీనియర్‌ నాయకుడు యనమల. ఓ రకంగా చంద్రబాబు(Chandra babu Naidu)తో సమకాలీకుడు. అంతటి సుదీర్ఘమైన అనుభవం ఉన్న తనకు పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ తగిన ప్రాధానయత ఇవ్వలేదన్న ఆవేదన ఆయనలో ఉంది. లోకేశ్‌ పెత్తనం బాగా పెరిగిపోయందన్న అభిప్రాయమూ ఉంది. కాకినాడ సెజ్ ద్వారా కేవీ రావు వేల కోట్లు లాభం పొందార‌ని, కానీ భూములు కోల్పోయిన బీసీ(BC), మత్స్యకార రైతులు తీవ్ర అన్యాయానికి గురయ్యారని లేఖ‌లో య‌న‌మ‌ల ప్ర‌స్తావించారు. త‌నను బెదిరించి పోర్ట్‌లో షేర్ల‌ను త‌క్కువ మొత్తానికే రాయించుకున్నారంటూ కేవీ రావు(KV Rao) సీఐడీకి ఫిర్యాదు చేయడం, ఈ మేరకు వైవీ సుబ్బారెడ్డి(YV Subba Reddy), ఆయ‌న కుమారుడు విక్రాంత్‌రెడ్డి(Vikranth Reddy), విజ‌య‌సాయిరెడ్డి(Vijay sai Reddy)పై కేసు న‌మోదు చేసిన సంగ‌తి తెలిసిందే. కాకినాడ సెజ్‌లో కేవీరావు చౌద‌రికి చెందిన బ‌డా కంపెనీలు త‌క్కువ ధ‌ర‌కే భూమిని పొంది, ఆ త‌ర్వాత జీఎంఆర్‌కు వంద‌ల కోట్లుకు అమ్మార‌ని య‌న‌మ‌ల ఆ లేఖలో ప్ర‌త్యేకంగా పేర్కొన‌డం గమనార్హం.ఆ తర్వాత మరో కంపెనీకి అమ్మి 4 వేల కోట్ల రూపాయల లబ్దిపొందారని యనమల ఆ లేఖలో వివరించారు కాకినాడ సెజ్‌లో పరిశ్రమలు పెట్ట‌డానికి ముర‌ళీ చౌద‌రికి చెందిన‌ దివీస్ కంపెనీతో సహా పలు పరిశ్రమలను స్థాపించడానికి భూములు పొంది భారీగా ఆర్థిక ప్రయోజ‌నాలు పొందార‌ని య‌న‌మ‌ల ప్రస్తావించారు. పెట్టుబ‌డిదారుల‌కు లాభాలు, పేద‌ల‌కు తిప్ప‌లు అని ఆయ‌న పేర్కొన్నారు. సముద్ర కాలుష్యం, వాయు కాలుష్యంతో పాటు భూములు కోల్పోయిన బీసీ కులాల వారు మాత్రం తీవ్రంగా నష్టపోతున్నారని యనమల రామకృష్ణుడు ఆ లేఖలో పేర్కొన్నారు. ఓ విధంగా చంద్రబాబు పాలనపై పరోక్ష విమర్శలు చేశారు.

ehatv

ehatv

Next Story