Avinash Reddy : ఎంపీ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురు
వేకా(Viveka) హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి(Avinah reddy) తెలంగాణ హైకోర్టులో(high court) చుక్కెదురైంది. సీబీఐ(CBI) తన పని తాను చేసుకోవచ్చన్న న్యాయస్థానం.. ఈ వ్యవహారంలో తాము కలుగ జేసుకోలేమని వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది.
వివేకా(Viveka) హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి(Avinah reddy) తెలంగాణ హైకోర్టులో(high court) చుక్కెదురైంది. సీబీఐ(CBI) తన పని తాను చేసుకోవచ్చన్న న్యాయస్థానం.. ఈ వ్యవహారంలో తాము కలుగ జేసుకోలేమని వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. సుప్రీం కోర్ట్(Supreme court డైరెక్షన్స్ స్పష్టంగా ఉన్నాయన్న న్యాయస్థానం.. సీబీఐ విచారణ చేసుకోవచ్చని చెప్పినట్లు సమాచారం. ప్రస్తుత పరిస్థితుల్లో ముందస్తు బెయిల్ ఇవ్వలేమని న్యాయస్థానం పేర్కొన్నట్లు తెలుస్తోంది.
బెయిల్(Bail) పిటీషన్ పై తేలేవరకు కనీసం రెండు వారాలైనా సీబీఐ ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆపాలని అవినాష్ రెడ్డి తరుపు నాయ్యవాదులు హైకోర్టులో వాదించగా.. సుప్రీంకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో మేము కలుగజేసుకోలేమని.. ఇప్పటికిప్పుడు అవినాశ్ బెయిల్ పిటీషన్ ను విచారించలేమని హై కోర్టు పేర్కొన్నట్లు సమాచారం. బెయిల్ పిటీషన్‌పై వెకేషన్ బెంచ్ ముందు మెన్షన్ చేసుకోవాలని అవినాశ్ రెడ్డి లాయర్లకు సూచించిన హైకోర్టు.. జూన్ 5వ తేదీకి విచారణను వాయిదా వేసింది.