ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్ 2023 ఫైనల్ మ్యాచ్ భారత్, ఆస్ట్రేలియా జ‌ట్ల మధ్య అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరగనుంది. రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా మూడో ప్రపంచకప్‌ టైటిల్‌ను సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్(World Cup Final) 2023 ఫైనల్ మ్యాచ్ భారత్(India), ఆస్ట్రేలియా(Australia) జ‌ట్ల మధ్య అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం(Narendra Modi Stadium)లో జరగనుంది. రోహిత్ శర్మ(Rohit Sharma) సారథ్యంలోని టీమిండియా మూడో ప్రపంచకప్‌ టైటిల్‌ను సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అదే సమయంలో ప్రజల ఉత్సాహాన్ని చూసి ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ACA) ప్రపంచ కప్ ఫైనల్‌ను చూసి ఆనందించేలా 13 జిల్లా ప్రధాన కేంద్రాల‌లో ఫ్యాన్‌ పార్క్‌ స్క్రీన్‌లను ఏర్పాటు చేస్తోంది.

క్రికెట్ అభిమానులకు ప్రవేశం ఉచితం.. ఫ్యాన్‌ పార్క్‌లో ఫుడ్‌ స్టాల్స్‌ను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు ఏసీఏ కార్యదర్శి ఎస్‌ఆర్‌.గోపీనాథ్‌రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లోని 13 వేదికల్లో లైవ్ స్క్రీనింగ్‌ నిర్వహించాలని ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) నిర్ణయించినట్లు ఆయ‌న తెలిపారు. ఫైనల్ చూసేందుకు 2-3 లక్షల మందికి పైగా వస్తారని ఆశిస్తున్నామ‌న్నారు.

ఏసీఏ అభ్యర్థనపై స్పందించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ గతంలో ఉన్న అన్ని అవిభాజ్య జిల్లాల్లోని ప్రధాన కార్యాలయాల్లో పెద్ద స్క్రీన్‌ల ఏర్పాటుకు అనుమతించారు. మరోవైపు విశాఖపట్నం బీచ్‌ రోడ్డులో వరల్డ్‌కప్‌ ఫైనల్‌ మ్యాచ్ స్క్రీనింగ్ నేప‌థ్యంలో నగర పరిధిలో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు పోలీసులు.

డీసీపీ లా అండ్ ఆర్డర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. క్రికెట్ స్టేడియం సమీపంలో నివసించే వారందరూ మ్యాచ్ రోజున దయచేసి ప్ర‌ధాన ర‌హ‌దారి కాకుండా ప్ర‌త్యామ్న‌య మార్గాల ద్వారా చూసుకోవాల‌ని విజ్ఞప్తి చేశారు. చాలా చోట్ల పార్కింగ్‌ స్థలాలను ఏర్పాటు చేశామ‌ని తెలిపారు.

ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ వీక్షించేందుకు ఏపీలో బిగ్ స్క్రీన్లు ఏర్పాటు చేసిన ప్రాంతాల వివరాలివే

1.శ్రీకాకుళం: ఎం. హెచ్. స్కూల్ గ్రౌండ్, 7 రోడ్ జంక్షన్

2.విజయనగరం: ఐస్ ఫ్యాక్టరీ జంక్షన్, భాష్యం స్కూల్ వెనుక

3.విశాఖపట్నం: ఆర్కీ బీచ్ , కాళీ మాత టెంపుల్ ఎదురుగా

4. కాకినాడ: రంగరాయ మెడికల్ కాలేజ్ గ్రౌండ్

5. ఏలూరు: ఇండోర్ స్టేడియం గ్రౌండ్, కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా

6. విజయవాడ: ఎం.జి. రోడ్, ఇందిర గాంధీ మున్సిపల్ స్టేడియం

7. గుంటూరు: మాజేటి గురవయ్య హై స్కూల్ గ్రౌండ్

8. ఒంగోలు: జెడ్పీ మినీ స్టేడియం

9. నెల్లూరు: వి.ఆర్. హైస్కూల్ గ్రౌండ్

10. కడప: ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్

11. అనంతపురం: పోలీస్ ట్రైనింగ్ కాలేజ్ (పి.టి.సి)

12. కర్నూల్: డి.ఎస్. ఏ. స్టేడియం

13. తిరుపతి: కె.వి.ఎస్. స్పోర్ట్స్ పార్క్, తుమ్మలకుంట గ్రౌండ్

Updated On 18 Nov 2023 10:01 PM GMT
Yagnik

Yagnik

Next Story