Viral News : సీరియల్స్ చూడొద్దన్నందుకు ఆత్మహత్యాయత్నం
అన్నమయ్య జిల్లాలో వింత ఘటన చోటుచేసుకుంది. సీరియల్ చూడొద్దని చెప్పినందుకు మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. టీవీ సీరియల్ చూడొద్దనందుకు ఒక మహిళ నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన గురువారం రాత్రి మదనపల్లిపట్టణంలో చోటు చేసుకొంది. మదనపల్లి పట్టణం శేషప్పతోటకు చెందిన భవన నిర్మాణ కార్మికుడు బాబు..

Viral News
అన్నమయ్య జిల్లాలో వింత ఘటన చోటుచేసుకుంది. సీరియల్ చూడొద్దని చెప్పినందుకు మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. టీవీ సీరియల్ చూడొద్దనందుకు ఒక మహిళ నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన గురువారం రాత్రి మదనపల్లిపట్టణంలో చోటు చేసుకొంది. మదనపల్లి పట్టణం శేషప్పతోటకు చెందిన భవన నిర్మాణ కార్మికుడు బాబు..గురువారం కూలీ పనులకు వెళ్లి రాత్రి ఇంటికి చేరుకున్నాడు. ఆ సమయంలో భార్య సోనీ (36) టీవీ సీరియల్ చూస్తూ ఉంది.
ఆ సమయంలోనే ఇంట్లో పిల్లలు కొట్టుకుంటున్నారు. ఆ విషయాన్ని కూడా పట్టించుకోకుండా సోనీ సీరియల్ లో లీనమైపోయింది. వస్తూవస్తూనే ఇంట్లో పరిస్థితిని చూసిన బాబు.. టీవీని ఆఫ్ చేసి.. పిల్లలు కొట్టుకుంటూ ఉంటే సీరియల్ చూసుకుంటూ వున్నావు అని భార్యను మందలించాడు. దీంతో మనస్థాపం చెందిన సోనీ నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. చికిత్స నిమిత్తం ఆమెను స్థానిక ప్రభుత్వఆసుపత్రికి తరలించారు.
