గుంటూరుజిల్లా(Guntur District) తెనాలి లింగయ్య(Tenali Lingaiah)కాలనీకి చెందిన మడియాల వెంకటేశ్వరి(Madiyala Venkateswari) అలియాస్ బుజ్జి (Bujji)(32) కొన్నాళ్లు వాలంటీర్‌గా పనిచేసింది.

గుంటూరుజిల్లా(Guntur District) తెనాలి లింగయ్య(Tenali Lingaiah)కాలనీకి చెందిన మడియాల వెంకటేశ్వరి(Madiyala Venkateswari) అలియాస్ బుజ్జి (Bujji)(32) కొన్నాళ్లు వాలంటీర్‌గా పనిచేసింది. అనంతరం కంబోడియా(Combodia)వెళ్లి, అక్కడివాళ్లతో కలిసి సైబర్ నేరాలకు పాల్పడింది. అనారోగ్యానికి గురై తిరిగి తెనాలి చేరుకున్న ఆమె.. భర్తను వదిలేసి, తల్లి గొంతు రమణమ్మతో కలిసి ఉంటోంది. జల్సాలకు అలవాటు పడిన తల్లీకూతురు డబ్బు కోసం ముగ్గురు మహిళలు, ఒక పురుషుడిని చంపేశారు.. మరో ముగ్గురు మహిళల హత్యకు ప్రణాళిక వేయగా, బెడిసికొట్టింది. రెండు హత్యల్లో వీరితోపాటు తెనాలికి చెందిన రజిని, భూదేవి అనే మహిళలు కూడా పాల్గొన్నారు ప్రకాశం(Prakasam) జిల్లా మార్కాపురాని(Markapuram)కి చెందిన మేనత్త సుబ్బలక్ష్మి(SubbaLaxmi) ఆస్తి రాసివ్వడం లేదంటూ 2022లో తల్లి రమణమ్మతో కలిసి వెంకటేశ్వరి ఆమెకు మద్యంలో సైనైడ్ కలిపి ఇచ్చి చంపేసింది. 2023 ఆగస్టులో తెనాలికి చెందిన వృద్ధురాలు నాగమ్మ బాకీ చెల్లించాలని అడుగుతోందని శీతల పానీయంలో సైనైడ్ కలిపి ఇచ్చి చంపేశారు. 2024 ఏప్రిల్లో తెనాలికి చెందిన పీసు అలియాస్ మోషే తరచూ తన భార్య భూదేవిని వేధిస్తుండేవాడు. అతన్ని చంపేస్తే బీమా నగదు వస్తుందని భూదేవి, రమణమ్మ కలిసి మోషేకు మద్యంలో సైనైడ్ కలిపి ఇచ్చి చంపేశారు. ఈ ఏడాది జూన్లో వెంకటేశ్వరి తెనాలికి చెందిన రజినితో కలిసి నాగూర్ బీ అనే మహిళను బ్రీజర్లో సైనైడ్ కలిపి తాగించి హత్యచేశారు. నాగూర్ బీ హత్య అనుమానస్పదంగా అనిపించడంతో పోలీసులు దర్యాప్తు చేయగా తల్లికూతురు చేస్తున్న వరుస హత్యల గుట్టు రట్టు అయ్యింది. మరో ఇద్దరిని హత్య చేసేందుకు పన్నాగం పన్నారని పోలీసుల విచారణలో తేలింది.

ehatv

ehatv

Next Story