Extramarital Affair : వివాహేతర సంబంధం.. ప్రియుడితో కలిసి భర్తను చంపి బావిలో పడేసిన భార్య
వివాహేతర సంబంధం.. ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య

వివాహేతర సంబంధం.. ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య'' ఈ వార్త ప్రతి రోజూ ప్రతీ పత్రికలో, ప్రతి మీడియాలో చూస్తున్నాం. ఇదే తరహాలో మరొకటి జరిగింది. ఈ ఘటన ప్రకాశం(Prakasam) జిల్లా ఒంగోలు (Ongole)రూరల్ మండలం పాతపాడు గ్రామంలో చోటు చేసుకుంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పాతపాడు గ్రామంలో మోరబోయిన అర్జున్ రెడ్డి(Arjun reddy) (55), ఆయన భార్య సుశీల(susheela) నివాసం ఉంటున్నారు. అయితే అర్జున్ రెడ్డి భార్య అదే గ్రామానికి చెందిన కాపూరి రమేష్ రెడ్డి(Ramesh reddy)తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ క్రమంలో రమేష్ రెడ్డి తరచూ అర్జున్ రెడ్డి ఇంటికి వెళ్లి వస్తుండేవాడు. తప్పుడు పని ఏదో ఒకరోజు బయట పడాల్సిందే కదా.. వన్డే వీరి సంబంధం గురించి భర్త అర్జున్‌రెడ్డికి తెలిసింది. దీంతో భార్యను మందలించాడు. ఇంకోసారి ఇంటికి రావొద్దని రమేష్‌రెడ్డికి కూడా చెప్పాడు. తమ తొడ సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన భార్య, ఆమె ప్రియుడు రమేష్ రెడ్డి అతన్ని మట్టుబెట్టాలని నిర్ణయించుకున్నారు. అందుకు పథకం రచించారు. గత నెల 19న అర్జున్ రెడ్డిని మద్యం తాగుదాం అంటూ పొలాల వైపునకు తీసుకెళ్లాడు. అర్జున్‌రెడ్డిని మాటల్లో పెట్టి పూటు పూటుగా మద్యం తాగించారు. ఫుల్లుగా తాగిన తర్వాత అర్జున్‌రెడ్డిపై బండరాయితో మోది హత్య చేశారు. చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత పక్కనే ఉన్న బావిలో ప్రియురాలు, ప్రియుడు కలిసి అర్జున్‌రెడ్డిని పడేశారు. ఆ తర్వాత ఏమీ తెలియనట్లు నంగనాచిగా ఎవరి దారిన వాళ్లు వెళ్లారు. మార్చి 19 నుంచి అర్జున్ రెడ్డి కనిపించడం లేదు. దీంతో కుటుంబ సభ్యులు అర్జున్ రెడ్డి ఆచూకీ కోసం వెతుకుతున్నారు. ఆయన భార్య, రమేష్ రెడ్డి కూడా కనిపించకుండా పోయారు. దీంతో అర్జున్ రెడ్డి కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది. మృతుడి సోదరుడి ఫిర్యాదు మేరకు పలువురిని విచారించిన పోలీసులు.. అర్జున్‌రెడ్డిని హత్య చేశారని నిర్ధారించుకొని కుటుంబసభ్యుల సమక్షంలో బావిలోంచి శవాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం అప్పగించారు. కీలక నిందితులు పరారీలో ఉన్నారు.. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
