ప్రియుడితో(Lover) కలిసి ఉండాలని ఓ మహిళ పెద్ద స్కెచ్చే వేసింది. అందుకు భర్తను(Husband) తొలగించుకోవాలని అనుకుంది. తప్పుడు కేసు పెట్టి జైలుకు పంపాలని చూసింది. ప్రియుడి సహకారంతో ఓ మహిళను చంపి(Murder) ఆ నేరాన్ని భర్తపై తోసేయాలనుకుంది. ఎన్టీఆర్‌ జిల్లా(NTR district) పెనమలూరు మండలం కానూరులో ఈనెల 13న జరిగిన హత్యకేసును పోలీసులు ఛేదించారు. వివరాల్లోకి వెళ్తే..

ఎన్టీఆర్‌ జిల్లా ప్రసాదంపాడుకు చెందిన మృదులాదేవి, రవీంద్ర ప్రేమ పెళ్లి చేసుకున్నారు. ఈ జంటకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. రవీంద్ర ఓ ప్రైవేట్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. మృధులాదేవి ఓ బాడీకేర్‌ సెంటర్‌లో ఉద్యోగం చేస్తోంది. ఈ క్రమంలో మృధులాదేవికి కృష్ణలంకకు చెందిన సాయిప్రవీణ్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్త తొడ సంబంధానికి దారి తీసింది. ఇద్దరూ కలిసి జీవించాలని అనుకున్నారు. ఈ క్రమంలో ఓ సారి సాయిప్రవీణ్‌తో మృదుల లేచిపోయింది కూడా. ఆ సమయంలో ఆమె భర్త రవీంద్ర తన భార్యను బతిమలాడి మళ్లీ ఇంటికి తెచ్చుకున్నాడు. సాయిప్రవీణ్‌కు దూరంగా ఉండలేక ఎలాగైనా భర్తను అడ్డుతొలగించుకోవాలనుకుంది. ఏదైనా హత్య కేసులో భర్తను ఇరికించి జైలుకు(Jail) పంపాలని ఇద్దరూ కలిసి వ్యూహం పన్నారు.

ఇందుకుగాను గతంలో తమ ఇంట్లో అద్దెకున్న గరిగెల నాగమణిని చంపి ఆ నేరాన్ని భర్తపైకి తోసేయాలని చూశారు. నాగమణి భర్త ఊర్లో లేడని తెలుసుకున్న సాయిప్రవీణ్‌, మృదుల ఆమెను ఎనికేపాడు రప్పించారు. రవీంద్ర తనను మోసం చేశాడని, తనను శారీరకంగా వాడుకొని బంగారం కూడా తాకట్టుపెట్టుకున్నాడని, తనకు ఏదైనా హాని జరిగితే రవీంద్రే కారణమంటూ నాగమణి వాయిస్‌ రికార్డ్‌(Voice record) చేయించారు. తర్వాత నాగమణి మెడకు చున్నీ బిగించి చంపేశారు. సాయిప్రవీణ్‌ ఈమె సెల్‌ఫోన్‌ తీసుకుని ఆమె భర్తకు, ప్రియురాలు మృదులాదేవికి వాయిస్‌ రికార్డులు పంపించాడు. ఈ కేసులో అరెస్టయిన రవీంద్రను పోలీసులు విచారించగా.. తన భార్యకున్న వివాహేతర సంబంధాన్ని బయటపెట్టాడు. దీంతో మృదులాదేవిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా అసలు విషయం బయటపడింది. ఈ కేసులో సాయిప్రవీణ్‌, మృదులాదేవి, హత్యకు సహకరించిన మూర్తిబాబును అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చారు.

Updated On 17 Jan 2024 5:05 AM GMT
Ehatv

Ehatv

Next Story