తిరుపతి(Tirupati) జిల్లా మంగళంపేటకు చెందిన లక్ష్మి తిరుపతిలోని శివజ్యోతి(shiva Jyothi) నగర్‌లో నివాసం ఉండేది. ఇన్‌స్టాలో(Instagram) చిన్నరెడ్డి(Chinna Reddy) నాయక్‌ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఇతను అమర్‌రాజాలో పనిచేస్తాడు. లక్ష్మిని ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటా అని చెప్పడంతో లక్ష్మి కూడా అతడిని ప్రేమించింది. ఏడాది పాటు వీరిద్దరూ సహజీవనం(Live-In) చేశారు.

తిరుపతి(Tirupati) జిల్లా మంగళంపేటకు చెందిన లక్ష్మి తిరుపతిలోని శివజ్యోతి(shiva Jyothi) నగర్‌లో నివాసం ఉండేది. ఇన్‌స్టాలో(Instagram) చిన్నరెడ్డి(Chinna Reddy) నాయక్‌ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఇతను అమర్‌రాజాలో పనిచేస్తాడు. లక్ష్మిని ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటా అని చెప్పడంతో లక్ష్మి కూడా అతడిని ప్రేమించింది. ఏడాది పాటు వీరిద్దరూ సహజీవనం(Live-In) చేశారు. ఈ క్రమంలో యువతికి గర్భం(Pregnancy) రావడంతో పెళ్లి చేసుకోవలని ఆమె చిన్నరెడ్డినాయక్‌పై ఒత్తిడి తెచ్చింది. దీంతో పెళ్లికి అతడు నిరాకరించడమే కాకుండా తన క్యారెక్టర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఇన్‌స్టాలో పరిచయమైతే పెళ్లి చేసుకుంటారా అని ఎదురు ప్రశ్నించాడు. దీంతో మనస్తాపం చెందిన యువతి నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది.

బాధితురాలు లక్ష్మిని ఐద్వా మహిళా సంఘం నాయకురాలు అమ్మాజీ జయంతి పరామార్శించారు. బాధితురాలికి బాసటగా నిలిచారు. ఈ సందర్భంగా అమ్మాజీ జయంతి మీడియా(Media) సమావేశంలో మాట్లాడుతూ బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. అధికారులు, రాజకీయనాయకులు బాధితురాలికి జరిగిన అన్యాయాన్ని ఖండించకపోగా, కేసును నీరుగారుస్తున్నారన్నారు. బాధితురాలిని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. న్యాయం జరగని పక్షంలో మోసం చేసిన వ్యక్తి ఇంటి ముందు, కలెక్టర్, ఎస్పీ ఆఫీస్‌ ఎదుట బైఠాయిస్తామని హెచ్చరించారు.

Updated On 11 Dec 2023 1:03 AM GMT
Ehatv

Ehatv

Next Story