ఇప్పుడు తెలుగు రాజకీయాలన్నీ షర్మిల(sharmila) చుట్టూ తిరుగుతున్నాయి. అన్నతో గొడవపడి పుట్టింటికి దూరమై మెట్టింట్లో పార్టీని స్థాపించి గెలవాలని చూస్తున్నారు వైఎస్ఆర్(YSR) బిడ్డ. ఇక్కడ గెలుపు ఓటములను పక్కనపెడితే తెలంగాణాలో(Telangana) షర్మిల పార్టీ పరిస్థితి..

ఇప్పుడు తెలుగు రాజకీయాలన్నీ షర్మిల(sharmila) చుట్టూ తిరుగుతున్నాయి. అన్నతో గొడవపడి పుట్టింటికి దూరమై మెట్టింట్లో పార్టీని స్థాపించి గెలవాలని చూస్తున్నారు వైఎస్ఆర్(YSR) బిడ్డ. ఇక్కడ గెలుపు ఓటములను పక్కనపెడితే తెలంగాణాలో(Telangana) షర్మిల పార్టీ పరిస్థితి.. ఇక్కడి పరిణామాలను చూసుకుంటే ఆమె పార్టీకి గెలిచేంత సీన్ లేదని క్లియర్ కట్‏గా అర్థమైపోతుంది.. కానీ షర్మిల వెనుక ఎందుకు పార్టీలు పరుగులు పెడుతున్నాయి? వాళ్ళతో కలవాలని ఎందుకు బేరసారాలకు దిగుతున్నాయి?

తెలంగాణలో రాజకీయ పరిస్థితులు దారుణంగా ఉన్నాయి.. కేసీఆర్(KCR) పై వ్యతిరేకత ఉన్నా.. ఆయనను ఓడించే సరైన పార్టీ లేదు.. కాంగ్రెస్‏కు ఓటు బ్యాంకు ఉన్నా.. దాన్ని ఉపయోగించుకునే నాయకులూ లేరు. ఇక బీజేపీ పరిస్థితి అంతే.. ఓటు బ్యాంకు లేకపోయినా రాబోయేది బీజేపీ(BJP) ప్రభుత్వమే అని జబ్బలు చరుస్తున్నారు పార్టీ నేతలు. వీరందరికి తోడు షర్మిల.. ఆమె తప్పితే ఆమె పార్టీలో చెప్పుకోదగ్గ నాయకులు ఒక్కరు కూడా లేరు.

కాంగ్రెస్(congress) పార్టీకి రాజశేఖర్ రెడ్డి(Rajashekar Reddy) బ్రాండ్ అంబాసిడర్. ఇప్పుడు ఆయన లేకపోయినా అయన పేరు చెప్పుకొని ఇప్పటికీ ఓట్లు అడుగుతుంటారు నేతలు.. తెలంగాణలో ఇప్పుడు అదే పెద్ద తలనొప్పిగా మారింది. నాన్న బ్రాండ్ ను వాడుకొని ఎన్నో కొన్ని సీట్లు గెలుచుకోవాలని చూస్తున్నారు షర్మిల.. షర్మిల పోటీ చేస్తే అది కాంగ్రెస్ పార్టీకి తీవ్ర నష్టం చేకూర్చే అవకాశం ఉంది. అందుకోసం షర్మిల పార్టీని కాంగ్రెస్‏లో విలీనం చేయాలని చర్చలు జరుగుతున్నాయి. దీనికోసం కర్ణాటక(Karnataka) ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్‏ను(DK ShivaKummar) రంగంలోకి దింపింది కాంగ్రెస్ హై కమాండ్. కర్ణాటక గెలుపు తరువాత కాంగ్రెస్ పార్టీ తెలుగు రాష్ట్రాలపై ఫోకస్ పెంచింది దానికోసం.. కర్ణాటక కింగ్ మేకర్ డీకే శివకుమార్ రంగంలోకి దిగి షర్మిలతో పలుమార్లు చర్చలు కూడా జరిపారు. అంతే కాదు ఏపీలో కనపడకుండా పోయిన కాంగ్రెస్ పార్టీని మళ్లీ తెరపైకి తెచ్చి ఎన్నికల బరిలో నిలపాలని డీకే తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. దీనికోసమే అయన కోనసీమ జిల్లాలో పర్యటించారని కొంత మంది చెబుతున్నారు.

వైఎస్ఆర్టీపీ(YSRTP)ని కాంగ్రెస్‏లో విలీనం చేస్తే.. ఆమెకు రాజ్యసభతో పాటు ఏపీ పీసీసీ(AP PCC) చీఫ్ బాధ్యతలు ఇస్తామని కాంగ్రెస్ ఆఫర్ చేసినట్టు సమాచారం. ఏపీలో కాంగ్రెస్ ఓటు బ్యాంకు మొత్తం ఇప్పుడు జగన్ వైపు ఉంది.. ఆ ఓట్లని తిరిగి పొందాలంటే సరైన నేత అవసరం.. దానికి షర్మిల అయితేనే కరెక్ట్ అని.. అన్నఓటు బ్యాంకును చీల్చగలిగే సత్తా చెల్లికి మాత్రమే సాధ్యమవుతుందని హై కమాండ్ భావించిందట. మరీ ఈ ఆఫర్ కు షర్మిల ఒప్పుకుంటారా? . తండ్రి పార్టీలో చేరి అన్న ఓటు బ్యాంకును చీలుస్తారా? అన్నవి ప్రశ్నార్థకంగా మారాయి.

Updated On 1 Jun 2023 4:03 AM GMT
Ehatv

Ehatv

Next Story