ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు(AP assembly Sessions) రేపట్నుంచి ప్రారంభం కాబోతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు(AP assembly Sessions) రేపట్నుంచి ప్రారంభం కాబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ శాసనసభకు సంబంధించి ప్రతిపక్ష హోదా(Opposition) విషయం మరోసారి చర్చకు రాబోతున్నది. తనకు ప్రతిపక్ష నేత హోదా కల్పించాలని మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్‌రెడ్డి(YS Jagan) కోరుతున్నారు. వచ్చినవి 11 స్థానాలే కాబట్టి ప్రతిపక్ష హోదా ఇవ్వడం కుదరదని అధికారపక్షం అంటోంది. ఇప్పటి వరకు అసెంబ్లీలో సీట్ల కేటాయింపు జరగలేదు. ఈ సమావేశాలకు కూడా సీట్ల కేటాయింపు జరగకపోవచ్చని అసెంబ్లీ వర్గాలు అంటున్నాయి. సీట్ల కేటాయింపు జరగకపోవడంతో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఓ సాధారణ ఎమ్మెల్యేగానే సభలో కూర్చుంటారు. జగన్ అసెంబ్లీకి వస్తారా.. రారా అన్న విషయంపై కూడా చర్చ జరుగుతోంది. ఇకపోతే ఈసారి అసెంబ్లీ సమావేశాలకు విజిటర్స్ పాసులు కుదించారు. ఎమ్మెల్యేల వెంట పెద్ద సంఖ్యలో వారి అనుచరులు వస్తుండటంతో పాసులను కంట్రోల్ చేయాలని అధికారులు నిర్ణయించారు. మరోవైపు అసెంబ్లీలో సభ్యులు అడిగే ప్రశ్నలకు తగిన సమాధానాలు ఇవ్వాలని, అందుకు ప్రిపేర్ కావాలని మంత్రులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు.