వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌(YSRCP) అధినేత వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి(YS Jagan) అసెంబ్లీకి వెళతారా లేదా అన్న విషయంలో క్లారిటీ లేదు

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌(YSRCP) అధినేత వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి(YS Jagan) అసెంబ్లీకి వెళతారా లేదా అన్న విషయంలో క్లారిటీ లేదు. జగన్‌ అసెంబ్లీకి(AP Assembly) వస్తేనే బాగుంటుందన్నది కూటమిలోని మూడు పార్టీలు అంటే టీడీపీ(TDP), బీజేపీ(BJP), జనసేనల(Janasena) కోరిక. అసెంబ్లీలో జగన్‌ ఉంటే ప్రతీదానికి ఆయన వంక చూసి, తప్పులకు ఆయనను బాధ్యుడిగా చేసి, తమ ఘన కీర్తిని చాటుకుంటూ దెప్పిపొడవాలన్నది కూటమిలోని పార్టీల అభిమతం. జగన్‌ మాత్రం ఆ అవకాశం వారికి ఇవ్వడం లేదు. అందుకే కూటమి పార్టీలు గింజుకుంటున్నాయి. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీకి 151 స్థానాల బలం ఉండింది. విపక్షమైన టీడీపీకి 23 సీట్లే ఉండేవి. అప్పుడు చంద్రబాబు కూడా చివరి రెండేళ్ల పాటు అసెంబ్లీ మొహం కూడా చూడలేదు. అప్పుడు జగన్ కూడా చంద్రబాబును బాగా ఆడుకున్నారు. చర్చకు వచ్చిన ప్రతీ అంశంలోనూ చంద్రబాబును(Chandrababu) వేలెత్తి చూపుతూ ఆయనను ఇబ్బంది పెట్టారు. అప్పుడు తనకు జరిగిన పరాభవాలకు అంతకు ఇంత బదులు తీర్చుకోవాలన్నది చంద్రబాబు మనోవాంఛ. పైగా ఇప్పుడు కూటమికి 164 స్థానాలు ఉన్నాయి. జగన్‌ పార్టీకి కేవలం 11 సీట్లే ఉన్నాయి. అంచేత అసెంబ్లీలో కూటమిదే హవా ఉంటుంది. వైసీపీ బిక్కుబిక్కుమంటూ ఉండాల్సి ఉంటుంది. ఇలాంటప్పుడు తాను అసెంబ్లీకి వెళితే తనను చెడుగుడు ఆడుకుంటారని జగన్‌ భావించి ఉంటారు. అందుకే ఆయన అసెంబ్లీకి హాజరు కావడం లేదు. కొత్త అసెంబ్లీలో జగన్‌ కేవలం రెండు సార్లే హాజరయ్యారు. ఎమ్మెల్యేగా ప్రమాణం చేసినప్పుడు మొదటిసారి హాజరయ్యారు. తర్వాత గవర్నర్‌ ప్రసంగం అప్పుడు రెండోసారి అసెంబ్లీకి వచ్చారు. ఈసారి వస్తారో రారో తెలియదు. స్పీకర్‌(Speaker) అయ్యన్నపాత్రుడు మాత్రం జగన్‌ అసెంబ్లీకి రావాలనే కోరుకుంటున్నారు. ఆయన అసెంబ్లీ సమావేశాలకు వస్తే ఆయనకు కూడా మాట్లాడే ఛాన్సిస్తామని చెప్పారు. అంటే జగన్‌ కోరుకుంటున్నట్టు వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదన్నమాట! ప్రతిపక్ష హోదాపై జగన్‌ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. కోర్టు ఏరకంగా స్పందిస్తుందో ఏమో! ఈసారి జరిగే వింటర్‌ సమావేశాల వరకు తీర్పు వస్తుందో రాదో కూడా చెప్పలేం. అనుకూలంగా వస్తే సరేసరి! లేకపోతే జగన్‌ ఏం చేస్తారన్నది కూడా సస్పెన్స్‌గానే ఉంది. స్పీకర్‌ అయ్యన్నపాత్రుడుకు కూడా జగన్‌ ఎమ్మెల్యేగా ఉండటమే కావాలి. ఇదే మాటను అయ్యన్న పాత్రుడు పదే పదే చెబుతూ వస్తున్నారు కూడా! ప్రతిపక్ష నాయకుడికి కొన్ని అధికారాలు ఉంటాయి. ఆయన ప్రతీ అంశంపై మాట్లాడవచ్చు. ఎమ్మెల్యేలకు అలా కుదరదు. స్పీకర్‌ ఎప్పుడు అవకాశం ఇస్తే అప్పుడే మాట్లాడాలి. అందుకే అయ్యన్నపాత్రుడు ఎమ్మెల్యేగానే జగన్‌ అసెంబ్లీకి రావాలని కోరుకుంటున్నారు. తాను దయతలచి అవకాశం ఇచ్చినప్పుడే కదా జగన్‌ మాట్లాడగలరు అన్నది అయ్యన్నపాత్రుడు ఆలోచన. మరి జగన్ ఏం చేస్తారో!

Eha Tv

Eha Tv

Next Story