Dharmavaram Constituency Review : ఈ సారి టీడీపీ – జనసేన కలిస్తే కేతిరెడ్డి ధర్మవరంలో మళ్లీ గెలుస్తారా..?
గత ఎన్నికల్లో ధర్మవరంలో వైసీపీ నుంచి కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి(Kethireddy Venkatarami Reddy) గెలుపొందారు.. జగన్ కీలకంగా భావించే నేతల్లో కేతిరెడ్డి ఒకరు.. రాబోయే ఎన్నికల్లో టీడీపీ-జనసేన కలిసి పోటీ చేస్తే కేతిరెడ్డి ధర్మవరంలో మళ్లీ గెలుస్తారా.. వైసీపీ మళ్లీ ఇక్కడ విజయం సాధిస్తుందా..?

Dharmavaram Constituency
ఏపీలో ఎన్నికల వేడి కనిపిస్తుంది.. రాబోయే ఎన్నికలకు అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి.. ఎవరికి వారు వాళ్ళ బలాలు, బలహీనతలను బేరీజు వేసుకుంటూ పార్టీ బలోపేతంపై ద్రుష్టి పెడుతున్నారు.. అయితే గత ఎన్నికల్లో టీడీపీ- జనసేన విడి విడిగా పోటీ చేశారు.. రాబోయే ఎన్నికల్లో పొత్తుతో వెళ్లాలని చూస్తున్నారు… వీళ్లిద్దరు కలిసి పోటీ చేస్తే వైసీపీకి ఎంత వరకు నష్టం… ఏ నియోజక వర్గాలపై ఎక్కువ ప్రభావం ఉంటుందనేది సస్పెన్స్‌గా మారింది.
గత ఎన్నికల్లో ధర్మవరం(Dharmavaram)లో వైసీపీ నుంచి కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి(Kethireddy Venkatarami Reddy) గెలుపొందారు.. జగన్ కీలకంగా భావించే నేతల్లో కేతిరెడ్డి ఒకరు.. రాబోయే ఎన్నికల్లో టీడీపీ-జనసేన కలిసి పోటీ చేస్తే కేతిరెడ్డి ధర్మవరంలో మళ్లీ గెలుస్తారా.. వైసీపీ మళ్లీ ఇక్కడ విజయం సాధిస్తుందా..?
