దేశమంతటా చలిగాలులు వీస్తున్నా ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలు మాత్రం రోజురోజుకీ వేడెక్కుతున్నాయి. మరో మూడు నెలలలో అసెంబ్లీ ఎన్నికలు(Assembly Elections) జరగనున్న నేపథ్యంలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ(YSRCP) అధినేత జగన్మోహన్‌రెడ్డి(Jagan Mohan Reddy) అధికారం నిలబెట్టుకోవడమే లక్ష్యంగా వ్యూహాలకు పదునుపెడుతున్నారు. ప్రజా వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలకు టికెట్లు ఇచ్చేది లేదని నిర్మోహమాటంగా చెప్పేస్తున్నారు. ఉన్నవారు ఉంటున్నారు. వెళ్లిపోయేవారు వెళ్లిపోతున్నారు. గుంటూరు(Guntur) జిల్లాలో అత్యంత కీలకమైన స్థానం మంగళగిరి(Mangalgiri). ఇక్కడ్నుంచి వైసీపీకి చెందిన ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రాతినిధ్యం వహించేవారు. జగన్‌కు అత్యంత సన్నిహితుడు.

తనకు ఈసారి టికెట్‌ దొరకడం కష్టమని తెలుసుకున్న ఆళ్ల పార్టీకి, పదవికి రాజీనామా చేసేశారు. రాష్ట్ర రాజకీయాలలో హాట్‌టాపిక్‌ మారిన ఘటనపై మీడియా ఫోకస్‌ చేయకముందే 11 నియోజకవర్గాలు ఇన్‌ఛార్జ్‌లను ప్రకటించి సంచలనం సృష్టించారు జగన్. పార్టీలో ఎప్పట్నుంచో ఉన్నవారిని పక్కన పెట్టడం కొందరికి రుచించడం లేదు. కొందరు అసంతృప్తిని కూడా వ్యక్తపరిచారు. పార్టీలో తమకు తగిన ప్రాతినిధ్యం లభించడం లేదనే అభిప్రాయంతో ఉన్నారు మరికొందరు. గత ఎన్నికల ముందు నుంచి వైసీపీని అంటిపెట్టుకుని ఉన్న సినీ నటుడు అలీలో(Ali) కూడా ఇలాంటి భావనే ఉందేమో తెలియదు కానీ పార్టీలోని కొందరికి మాత్రం అలీ విషయంలో అధినాయకత్వం తప్పటడుగులు వేస్తున్నదన్న అభిప్రాయం ఉంది.

నిజానికి అలీ రాజకీయ ప్రస్థానం తెలుగుదేశంపార్టీతోనే(TDP) మొదలయ్యింది. 1999లో అలీ ఆ పార్టీలో చేరారు. పార్టీ విజయం కోసం రాష్ట్రమంతా పర్యటించారు. ఇంత చేసినా తనకు పార్టీలో తగిన గుర్తింపు ఇవ్వలేదని చాలా సందర్భాలలో అలీ చెప్పుకొచ్చారు. ఇటీవల పొన్నూరులో జరిగిన సభలోనూ ఇదే విషయాన్ని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా పోటీ చేయాలని అనుకుంటున్న అలీ తన ఓటును హైదరాబాద్‌ నుంచి గుంటూరుకు మార్పించుకున్నారు. 2019లో అలీ వైసీపీలో చేరారు. పార్టీ కోసం కష్టపడ్డారు. జగన్‌ ప్రభుత్వం చేపట్టిన జగనన్న కాలనీల కోసం స్థలం అవసరమైతే రాజమండ్రిలో(Rajahmundry) ఉన్న తన సొంత భూమిని చాలా తక్కువ ధరకే ప్రభుత్వానికి ఇచ్చేశారు.

తక్కువలో తక్కువ అక్కడ ఎకరం కోటిన్నర రూపాయలు పలుకుతుంది. జగన్‌ మీద ఉన్న అభిమానం ప్లస్‌ పేదలకు మంచి జరుగుతుందన్న సదుద్దేశంతో అలీ ఎకరాకు 50 లక్షల రూపాయలే తీసుకున్నారు. మొత్తంగా అలీకి 15 కోట్ల రూపాయల నష్టం వచ్చింది. ఆ నష్టాన్ని నవ్వుతూ భరించారే తప్ప ఏనాడూ గొప్పలు చెప్పుకోలేదు. నిజానికి గత ఎన్నికల్లోనే అలీ టికెట్‌ను ఆశించారు. కాకపోతే అప్పుడున్న పరిస్థితులలో పార్టీ అధిష్టానం అలీకి టికెట్‌ ఇవ్వలేకపోయింది. అయినప్పటికీ అలీ పార్టీ పట్ల మునుపటి విధేయతనే కనబరుస్తున్నారు. మైనారిటీలు ఎక్కువగా ఉన్న స్థానాలలో అలీ పోటీ చేస్తే విజయం సులువవుతుందని విశ్లేషకులు అంటున్నారు. పైగా అనేక సేవా కార్యక్రమాలు అలిని ప్రజలకు దగ్గర చేశాయి. కరోనా(Corona) టైమ్‌లోనూ అలి పేదలకు ఎంతో సాయం చేశారు.

ఈసారి అలీ ఎక్కడ నుంచి పోటీ చేసినా విజయం తథ్యమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ చేపట్టిన బస్సు యాత్ర సందర్భంగా అలీ పాల్గొన్న సభలు సక్సెసయ్యాయి. పంచ్‌ డైలాగులతో ప్రభుత్వ పథకాలను వివరించిన తీరు ప్రజలను ఆకట్టుకుంది. ఈసారి మాత్రం తనకు టికెట్ పక్కా అని అలీ భావిస్తున్నారు. ఇక్కడ చెప్పుకోవాల్సిన మరో విషయమేమింటే ఆంధ్రప్రదేశ్‌లో కడప తర్వాత ఉమ్మడి గుంటూరు జిల్లాలోనే మైనారిటీలు ఎక్కువగా ఉన్నారు. గుంటూరు తూర్పుతో పాటు నరసరావుపేటలలో టీడీపీకి సరైన నాయకుడు లేడు. మైనారిటీ ఓటర్లు ఎక్కువగా ఉండే ఆ నియోజకవర్గాలలో ముస్లిం అభ్యర్థుల కోసం టీడీపీ అన్వేషిస్తోంది. ఒకవేళ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ కనుక అలీకి మొండిచేయి చూపిస్తే, అతడిని తమవైపుకు లాగేసుకోవడానికి టీడీపీ రెడీగా ఉంది. పుట్టింటికి తిరిగి వచ్చేస్తాడన్న నమ్మకంతో ఉంది. ఇంతకీ అలీ పార్టీ మరతారా?

Updated On 14 Dec 2023 3:58 AM GMT
Ehatv

Ehatv

Next Story