Chalamalasetty Sunil : మూడుసార్లు ఓటమి..ఈసారైనా చలమలశెట్టి ఫేట్ మారుతుందా?
దురదృష్టవంతుడ్ని బాగు చేయలేరు.. అదృష్టవంతుడ్ని చెరపలేరు అంటారు.. రాజకీయాలలోనూ అంతే. అయితే ఎక్కడైనా కావాల్సింది సహనమే. అదిగో..ఆ సహనం లేకపోవడం వల్లే మూడుసార్లు ఎంపీగా పోటీ చేసినా ఫలితం లేకుండాపోయింది. అదే పనిగా పార్టీలు మారడం వల్ల ఆయనపై వరుసగా ఓడిపోతున్న సానుభూతి కూడా లేదన్న చర్చ జరుగుతోంది. అతనెవరో కాదు..ప్రస్తుతం కాకినాడ నుంచి వైసీపీ(YCP) ఎంపీ అభ్యర్థిగా(MP) పోటీ చేస్తున్న చలమలశెట్టి సునీల్(Chalamalasetty Sunil).
దురదృష్టవంతుడ్ని బాగు చేయలేరు.. అదృష్టవంతుడ్ని చెరపలేరు అంటారు.. రాజకీయాలలోనూ అంతే. అయితే ఎక్కడైనా కావాల్సింది సహనమే. అదిగో..ఆ సహనం లేకపోవడం వల్లే మూడుసార్లు ఎంపీగా పోటీ చేసినా ఫలితం లేకుండాపోయింది. అదే పనిగా పార్టీలు మారడం వల్ల ఆయనపై వరుసగా ఓడిపోతున్న సానుభూతి కూడా లేదన్న చర్చ జరుగుతోంది. అతనెవరో కాదు..ప్రస్తుతం కాకినాడ నుంచి వైసీపీ(YCP) ఎంపీ అభ్యర్థిగా(MP) పోటీ చేస్తున్న చలమలశెట్టి సునీల్(Chalamalasetty Sunil). గత మూడు పర్యాయాలు మూడు వేర్వేరు పార్టీల నుంచి కాకినాడ ఎంపీగా పోటీ చేసిన చలమలశెట్టి సునీల్.. మూడుసార్లు ఓడిపోయారు. కాకినాడలో(Kakinada) వైసీపీకి చాలా కష్టమని అంతా అనుకుంటున్న సమయంలో మళ్లీ ఆయనను సమన్వయకర్తగా నియమించారు. గ్రీన్ కో వ్యాపార సంస్థ చలమలశెట్టి కుటుంబానిదే. డబ్బుకు లోటులేని ఈ కుటుంబం నుంచి.. సునీల్ ప్రజారాజ్యం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 2009లో కాకినాడ నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత వైసీపీలో చేరి.. 2014 ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసి మరోసారి ఓడిపోయారు. ఆ రెండు ఎన్నికల్లో ఓ సారి 30 వేలు.. మరోసారి 3 వేల ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత అధికార టీడీపీలో చేరి.. 2019 ఎన్నికల్లో ఆ పార్టీ తరపున పోటీ చేశారు. అయితే.. జనసేన పార్టీ భారీగా ఓట్లు చీల్చడంతో పాతిక వేల ఓట్ల తేడాతో మళ్లీ ఓడిపోయారు. ఆ తర్వాత వైసీపీ అధికారంలోకి రావడంతో మళ్లీ ఆ పార్టీలో చేరిపోయారు. కాకినాడ లోక్‌సభ సీటును జనసేన పార్టీ సాన సతీష్ కుమార్‌కు కేటాయించినట్లుగా తెలుస్తోంది. ఈసారైనా చలమచెట్టి సునీల్‌కు విజయం వరిస్తుందో లేదో చూడాలి.