వైసీపీ నుంచి సస్పెండ్(YSRC suspends) కు గురైన నలుగురు ఎమ్మెల్యేలు(4MLAs) ఏ పార్టీకి వెళ్తరానే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. నిజంగా ఈ నలుగురు ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్(Cross Voting) కు పాల్పడ్డారా..? లేదా అనేది పక్కన పెడితే.. ప్రస్తుతం ఈ నలుగురు టీడీపీ(TDP)లోకే వెళ్తారనే ప్రచారమూ సాగుతోంది. కొంతకాలంగా ఈ నలుగురు ఎమ్మెల్యేలు వైసీపీ అధిష్టానంపై చాలా అసంతృప్తితో ఉన్నారు.

వైసీపీ నుంచి సస్పెండ్(YSRC suspends) కు గురైన నలుగురు ఎమ్మెల్యేలు(4MLAs) ఏ పార్టీకి వెళ్తరానే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. నిజంగా ఈ నలుగురు ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్(Cross Voting) కు పాల్పడ్డారా..? లేదా అనేది పక్కన పెడితే.. ప్రస్తుతం ఈ నలుగురు టీడీపీ(TDP)లోకే వెళ్తారనే ప్రచారమూ సాగుతోంది. కొంతకాలంగా ఈ నలుగురు ఎమ్మెల్యేలు వైసీపీ అధిష్టానంపై చాలా అసంతృప్తితో ఉన్నారు. సమయం దొరికినప్పుడల్లా పార్టీపై ప్రత్యక్షంగాను, పరోక్షంగానూ విమర్శలు, సెటైర్లే వేస్తూ వచ్చారు. కొన్నిసార్టు సొంత పార్టీ నాయకులపై విమర్శలు కూడా చేశారు. వీటన్నిటినీ గమనిస్తూ వచ్చిన అధిష్టానం అవకాశం కోసం ఎదురుచూసింది.
విప్‌ను ధిక్కరించినందుకు నలుగురు ఎమ్మెల్యేలపై సస్పెన్షన్‌ వేటు వేసింది వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ(YSRCP). ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ నిర్ణయాన్ని కాదని ప్రత్యర్థి పార్టీ తెలుగుదేశానికి ఓటు వేశారన్న కారణంతో పార్టీ నుంచి బహిష్కరించింది వైఎస్‌ఆర్‌సీపీ. అబ్బే తాను క్రాస్‌ ఓటింగ్‌కు పాల్పడలేదని ఎమ్మల్యే శ్రీదేవి(MLA Sridevi)సంజాయిషీ ఇచ్చుకున్నా అధిష్టానం వినిపించుకోలేదు. మరోవైపు మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి(Mekapati Chandrasekhar Reddy) కూడా తాను వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థికే ఓటేశానని అన్నారు. ఈయనమాటా పట్టించుకోలేదు. కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి(Kotamreddy Sridhar Reddy) మాత్ర ఆత్మప్రబోధానుసారం ఓటు వేశానని స్పష్టం చేశారు. మరో ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి(Anam Ramanarayana Reddy) మాత్రం ఏమీ అనకండా గమ్మున ఉన్నారు. మొత్తం మీద ఈ నలుగురు ఎమ్మెల్యేలు టీడీపీ అభ్యర్థికి ఓటు వేశారని అంతర్గత దర్యాప్తులో వైఎస్‌ఆర్‌సీపీ తేల్చింది. కనిపెట్టింది. అందుకే మరో ఆలోచన లేకుండా వారిని పార్టీ నుంచి వెళ్లగొట్టింది. ఫ్యాన్‌ పార్టీ నుంచి సస్పెండ్‌ అయిన ఆ నలుగురు ఏ వైపు వెళతారు? ఏ పార్టీ తీర్థం పుచ్చుకుంటారు? వచ్చే ఎన్నికల్లో వారికి టికెట్లు దొరుకుతాయా? ఇలాంటి ప్రశ్నలు రాజకీయాల పట్ల కొంచెం ఆసక్తి ఉన్నవారందరీ మనసుల్లో మెదులుతున్నాయి.

నిజానికి వీరంతా చాన్నాళ్లుగా వైఎస్‌ఆర్‌సీపీ అధిష్టానంపై అసంతృప్తితో ఉన్నారు. కొంచెం కోపం కూడా ఉంది వారిలో. ఈ నలుగురూ కట్టగట్టుకుని టీడీపీలోకి వెళ్తారనే ప్రచారం జోరుగా సాగుతుంది. కాకపోతే తమ తమ నియోజకవర్గాలలో ఉన్న వెసులుబాటు, కార్యకర్తల అభీష్టం, క్యాడర్‌ అభిప్రాయాలను బట్టి ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని అనుకుంటున్నారు. ఎంతకాదనుకున్నా జగన్‌ పార్టీకి గట్టిగా పోటీనిచ్చే పార్టీ తెలుగుదేశమే కాబట్టి అందులో చేరడమే బెటరని భావిస్తున్నారు. రేప్పొద్దున అధికారంలోకి వచ్చే ఛాన్సు ఉంటే గింటే అది టీడీపీకేనని నలుగురు ఎమ్మెల్యేల భావన. సరే.. ఎలాగూ ఈ నలుగురికి చంద్రబాబు(Chandrababu) ఆహ్వానం పలుకుతారు. కానీ తర్వాత సంగతేమిటి? వీరికి చంద్రబాబు టికెట్‌ ఇస్తారా? పాతకాపులకే పట్టం కడతారా? ఇప్పికే టీడీపీలో ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీర్‌రెడ్డిలకు టికెట్లు కన్ఫామ్‌ అయ్యాయి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో వీరిద్దరూ టీడీపీ నుంచే బరిలో దిగుతారట! ఉండవల్లి శ్రీదేవికి చంద్రబాబు టికెట్‌ హామీ ఇస్తారా? ఇవ్వగలరా? కష్టమేనంటున్నారు నేతలు. మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ఆయనకు కూడా టికెట్‌ గ్యారంటీ లేదు. ఈ నలుగురు ఎమ్మెల్యేలలో ముగ్గురు నెల్లూరు జిల్లా(Nellore District)కు చెందిన వారే కాబట్టి అక్కడ విపరీతమైన చర్చ జరుగుతోంది. మొత్తంగా వీరు గంపగుత్తగా టీడీపీలో చేరడం ఖాయమే కానీ. ఎప్పుడన్న దానిపై మాత్రం స్పష్టత రావాల్సి ఉంది.

Updated On 25 March 2023 5:05 AM GMT
Ehatv

Ehatv

Next Story