Chandrababu Warning : ముఖ్యమంత్రి చెప్పారు సరే.. దందాలు ఆపేస్తారంటారా..?
టీడీపీ(TDP) ప్రజాప్రతినిధులు ఇసుక(Sand), మద్యం(Alcohol) దందాలకు పాల్పడుతున్నారన్న వార్తల మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు(Chandrababu) ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు.
టీడీపీ(TDP) ప్రజాప్రతినిధులు ఇసుక(Sand), మద్యం(Alcohol) దందాలకు పాల్పడుతున్నారన్న వార్తల మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు(Chandrababu) ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. పార్టీ నెతలెవరూ ఇసుక, మద్యం వ్యాపారాల్లో తల దూర్చకూడదన్నారు. వైసీపీ(YCP) చేసిన తప్పులను మనం చేయొద్దన్నారు. ఈ నాలుగు నెలల్లో మీరు చేసిన పనుల చిట్టా తన వద్ద ఉందని చంద్రబాబు(Chandrababu) హెచ్చరించారు. ప్రజల నమ్మకాన్ని మనం నిలబెట్టుకోవాలని.. ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ కలిగేలా ప్రవర్తించాలన్నారు. ప్రజల్లో సానుకూలత లేకుండా డబ్బుతో గెలుస్తామనుకున్నవారి పరిస్థితి ఏమైందో చూశామన్నారు. కొందరు నేతలు చాలా కాలంగా మద్యం వ్యాపారంలో ఉన్నారు.. అలాంటి వారికి ఎక్జెంప్షన్ ఉంటుంది కానీ..అందరూ ఇందులో తలదూర్చకూడదని చంద్రబాబు ఎమ్మెల్యేలకైతే గట్టిగానే చెప్పారు. స్వయంగా టీడీపీకి అనుకూల పత్రిక ఈనాడులో కూడా టీడీపీ నేతల దందాలపై వార్తా కథనాలు రావడంతో దీనిని ఆదిలోనే తుంచేయాలని చంద్రబాబు భావించినట్లున్నారు.
ఇసుక అమ్మకాల్లో టీడీపీ నేతలు చేతివాటం ప్రదర్శిస్తున్నారనడానికి ఈనాడు కథనాలు కూడా ఉదాహరణ. ట్రాక్టరుకు ఇంత లెక్కన, లారీకి ఇంత లెక్కన ఎమ్మెల్యేల వసూళ్లకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు వచ్చాయి. దీంతో తమ పార్టీ ఎమ్మెల్యేలు చేస్తున్న చేతివాటంపై చంద్రబాబుకు సమాచారం అందిన తర్వాతే ఆయన ఎమ్మెల్యేలతో సమావేశమై గట్టి ఆదేశాలిచ్చారు. అయితే చంద్రబాబు ఉచిత ఇసుక విదానాన్ని ప్రవేశపెట్టిన తర్వాత కూడా ప్రజలకు ఆ మేర ఇసుక లభించడం లేదు. దీంతో ఉచిత ఇసుకపై ప్రజలు అసంతృప్తిగా ఉన్నారనే రిపోర్టు కూడా వచ్చింది. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ కూడా ఇసుక దందాపై విమర్శలు చేశారు. తమ ప్రభుత్వంలో ఆన్‌లైన్‌లో అందుబాటులో పెట్టి ఇసుక విక్రయించి ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చితే.. ఉచిత ఇసుక పేరుతో టీడీపీ నేతల జేబుల్లో ప్రభుత్వ ఆదాయం పోతుందని విమర్శించారు. ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల దోపిడీకి అరికట్టకపోతే ఉచిత ఇసుక అనే హామీకి అర్థమేలేదంటున్నారు. ప్రజలకు అందుబాటులో ఇసుకు ఉంచకపోతే.. చంద్రబాబు ఎన్ని సమావేశాలు పెట్టినా దండగే అని అభిప్రాయపడుతున్నారు. కూటమి నేతలు కొనసాగిస్తున్న దందాలను, అక్రమాలను ఎప్పటికప్పుడు సమీక్షించి చంద్రబాబు చర్యలు చేపట్టకపోతే ప్రభుత్వం అప్రతిష్ట పాలవతుందని విశ్లేషిస్తున్నారు.