ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు(AP Assembly Elections) దగ్గరకొచ్చేస్తున్నాయి. అధికారపక్షం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌(YSRCP) ఓ పక్కన, టీడీపీ(TDP)-జనసేన(Janasena)-బీజేపీ(BJP) కూటమి ఓ పక్కన మోహరించాయి. సమరశంఖారావాన్ని పూరించాయి. అదేమిటో కానీ యుద్ధానికి ముందే కూటమి చేతులెత్తిసినట్టు కనిపిస్తోంది. అదే సమయంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌లో మాత్రం ఉత్సాహం పరుగులు తీస్తోంది. రెండు నెలల కిందట ఏపీలో ఎవరు గెలుస్తారని ఎవరిని అడిగినా చెప్పడం కష్టమనే సమాధానం వచ్చేది. టీడీపీ పుంజుకున్నట్టు కనిపిస్తోందని కూడా అన్నార. ఇప్పుడు మాత్రం గెలుపు కచ్చితంగా జగన్‌దేనని(CM Jagan) బల్లగుద్దీ మరీ చెబుతున్నారు.

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు(AP Assembly Elections) దగ్గరకొచ్చేస్తున్నాయి. అధికారపక్షం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌(YSRCP) ఓ పక్కన, టీడీపీ(TDP)-జనసేన(Janasena)-బీజేపీ(BJP) కూటమి ఓ పక్కన మోహరించాయి. సమరశంఖారావాన్ని పూరించాయి. అదేమిటో కానీ యుద్ధానికి ముందే కూటమి చేతులెత్తిసినట్టు కనిపిస్తోంది. అదే సమయంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌లో మాత్రం ఉత్సాహం పరుగులు తీస్తోంది. రెండు నెలల కిందట ఏపీలో ఎవరు గెలుస్తారని ఎవరిని అడిగినా చెప్పడం కష్టమనే సమాధానం వచ్చేది. టీడీపీ పుంజుకున్నట్టు కనిపిస్తోందని కూడా అన్నార. ఇప్పుడు మాత్రం గెలుపు కచ్చితంగా జగన్‌దేనని(CM Jagan) బల్లగుద్దీ మరీ చెబుతున్నారు. దారినపోయే కంపను చంద్రబాబు(Chandrababu) అనవసరంగా నెత్తిన పెట్టుకున్నారన్నది టీడీపీ అభిమానుల భావన. గత ఎన్నికలప్పుడు వచ్చిన సీట్లన్ని కాకపోయినా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం గ్యారంటీ అని టీడీపీ సపోర్టర్లే అంటున్నారు. జనసేనతో పొత్తు పెట్టుకోవడం వల్ల టీడీపీకి రాజకీయ ప్రయోజనం కలుగుతుందనే అభిప్రాయం అప్పట్లో ఉండింది. టీడీపీ-జనసేన కలయికను చూసి వైసీపీ క్యాడర్‌ కూడా కాసింత భయపడిన మాట వాస్తవమే. ఉభయ గోదావరి జిల్లాలలో వైసీపీ గెలవడం చాలా కష్టమని అనుకున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉంది. ఎప్పుడైతే సీట్ల సర్దుబాటు జరిగాయో అప్పుడు వైసీపీ గెలుపు ఖాయమైపోయింది. జనసేనకు ఉద్దేశపూర్వకంగా తక్కువ సీట్లు ఇవ్వడంతో కాపులు కస్సుబుస్సుమంటున్నారు. జనసేన పార్టీ క్యాడర్‌ కూడా తీవ్ర అసంతృప్తితో ఉంది. పైగా పవన్‌కల్యాణ్‌(Pawan kalyan) కోరుకున్న స్థానాలేవీ చంద్రబాబు ఇవ్వకపోవడంతో కార్యకర్తలు కోపంగా కూడా ఉన్నారు. ఇలాంటి పరిస్థితులలో ఓట్లు బదిలీ అవుతాయని అనుకోవడానికి లేదు. మొదట జనసేనకు 24 అసెంబ్లీ సీట్లు ఇచ్చింది టీడీపీ. బీజేపీ కూడా చేరడంతో ఆ 24 సీట్లలో కోత పెట్టే 21 స్థానాలకు కుదించింది. లోక్‌సభ స్థానాల విషయంలోనూ అంతే! మూడిచ్చినట్టు ఇచ్చి తర్వాత అందులోంచి ఒకటి లాగేసుకుంది టీడీపీ. ఇంత చేసినా ఇంకా చంద్రబాబు చెంతనే పవన్‌ ఉండటం కాపులకు నచ్చడం లేదు. చంద్రబాబుకు అధికారం అప్పగించడాని పవన్‌ ఇంతగా దిగజారతాడని తాము అనుకోలేని వారు బాహాటంగానే అంటున్నారు. పవన్‌కు ఆత్మాభిమానం లేదని తేటతెల్లమయ్యిందని చెబుతున్నారు. అందుకే పెద్ద నాయకులంతా నెమ్మదిగా పార్టీ నుంచి వైదొలుగుతున్నారు. బీజేపీతో పొత్తు త‌ర్వాత కూట‌మి పరిస్థితి మరింత దయనీయంగా తయారయ్యింది. బీజేపీకి పది అసెంబ్లీ స్థానాలు, ఆరు పార్లమెంట్‌ సీట్లు కేటాయించారు. ఇందులో కచ్చితంగా గెలిచే స్థానాలేమిటో బీజేపీ కూడా చెప్పలేకపోతున్నది. బీజేపీతో అంటకాగుతున్నందున ముస్లింలు, క్రిస్టియన్లు, దళితులు టీడీపీ-జనసేనలకు దూరమయ్యారు. బీజేపీతో పొత్తు వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువన్న సంగతి ఇప్పుడిప్పుడే చంద్రబాబు-పవన్‌లకు అర్థమవుతోంది. ఈ పరిణామాలన్నీ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌కు లాభాన్ని కలిగిస్తున్నాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌కు అనుకూల వాతావరణం ఏర్పడింది. ఉభయ గోదావరి జిల్లాలలో సగానికి సగం సీట్లు గెల్చుకోవడం గ్యారంటీ అన్న నమ్మకం వైసీపీకి వచ్చింది. తెలుగుదేశంపార్టీ ఓట్లు జనసేనకు పడతాయని చెప్పలేని పరిస్థితి. అలాగే టీడీపీ వాళ్లు బీజేపీకి ఓటేస్తారన్న గ్యారంటీ లేదు. సేమ్‌ టు సేమ్‌ జనసేన ఓట్లు టీడీపీకి బదిలీ అవుతాయని అనుకోవడానికి లేదు. ఇదంతా చూసి టీడీపీలో నిరాశ ఏర్పడిందంటే అనుకోవచ్చు. జనసేన బాధపడుతుందని అంటే అవున్లే అనుకోవచ్చు. కానీ ఈ రెండు పార్టీల కంటే టీడీపీ అనుకూల మీడియానే ఎక్కువగా బాధపడుతోంది. చంద్రబాబులాగా బహిరంగంగా ఏడవటం ఒక్కటే ఆ మీడియాకు మిగిలింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి వంద సీట్లు పక్కా అని తెలుస్తోంది.

Updated On 28 March 2024 12:54 AM GMT
Ehatv

Ehatv

Next Story