తెలుగుదేశం పార్టీ(TDP) అధినేత చంద్రబాబునాయుడు(Nara chandrababu) ఢిల్లీకి వెళ్లి వచ్చారు. బీజేపీ(BJP) పెద్దలు పిలిస్తేనే చంద్రబాబు వెళ్లారంటోంది టీడీపీ అనుకూల మీడియా! అబ్బే తామేమీ పిలవలేదని, ఆయనే వచ్చారని బీజేపీ నాయకులు అంటున్నారు. సరే ఏదైతేనేమీ చంద్రబాబు అయితే ఢిల్లీకి(Delhi) వెళ్లారు. కేంద్ర హోమ్‌శాఖ మంత్రి అమిత్ షాతో(Amit shah) పొత్తుల విషయం మాట్లాడారు. రాత్రి వేళ జరిగిన ఈ చర్చల సారాంశమేమిటో తెలియదు కానీ, పొత్తు అయితే కుదిరిందని మీడియా కోడై కూసింది.

తెలుగుదేశం పార్టీ(TDP) అధినేత చంద్రబాబునాయుడు(Nara chandrababu) ఢిల్లీకి వెళ్లి వచ్చారు. బీజేపీ(BJP) పెద్దలు పిలిస్తేనే చంద్రబాబు వెళ్లారంటోంది టీడీపీ అనుకూల మీడియా! అబ్బే తామేమీ పిలవలేదని, ఆయనే వచ్చారని బీజేపీ నాయకులు అంటున్నారు. సరే ఏదైతేనేమీ చంద్రబాబు అయితే ఢిల్లీకి(Delhi) వెళ్లారు. కేంద్ర హోమ్‌శాఖ మంత్రి అమిత్ షాతో(Amit shah) పొత్తుల విషయం మాట్లాడారు. రాత్రి వేళ జరిగిన ఈ చర్చల సారాంశమేమిటో తెలియదు కానీ, పొత్తు అయితే కుదిరిందని మీడియా కోడై కూసింది. బీజేపీతో జనసేన(Janasena) ఎప్పట్నుంచో అంటకాగుతూ వస్తున్నది. ఇప్పుడా కూటమిలోకి టీడీపీ కూడా వచ్చి చేరిందనుకోవాలి. పొత్తు కుదిరినప్పుడు సీట్ల సర్దుబాటు కూడా చర్చకు వచ్చి ఉండాలి కదా! ఈ విషయం మాత్రం చంద్రబాబు మాట్లాడటం లేదు. అందుకు కారణం అమిత్‌ షా సీట్ల విషయం పట్టుబట్టడమే! తాము అడిగినన్ని సీట్లు ఇవ్వాల్సిందేనని, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ను(Pawan kalayan) మొదటి రెండున్నరేళ్లు ముఖ్యమంత్రిని చేయాల్సిందేనని చంద్రబాబుతో అమిత్‌ షా అన్నారట! 26 అసెంబ్లీ స్థానాలు, ఏడు లోక్‌సభ స్థానాలను(Lok sabha) బీజేపీకి ఇవ్వాలని అమిత్‌ షా ప్రతిపాదన చేశారట! ఇందులో ఏ ఒక్కటి తగ్గినా తమకు పొత్తు అవసరం లేదని నిర్మోహమాటంగా చెప్పారట అమిత్‌ షా!నంబర్‌తో పాటు తమకు ఎక్కడెక్కడ ఏ ఏ స్థానాలు కావాలో కూడా చంద్రబాబుకు చెప్పారట! ఓ జాబితాను సమర్పించారట! ధర్మవరం, ఆళ్లగడ్డ, ప్రొద్దుటూరు, మదనపల్లె, రాజమండ్రి సిటీ, విజయవాడ సెంట్రల్‌, గుంటూరు వెస్ట్‌, ఏలూరు, శ్రీకాళహస్తి తదితర అసెంబ్లీ నియోజకవర్గాలను బీజేపీ అడుగుతోందని సమాచారం. చంద్రబాబు మరీ మొహమాట పెట్టేస్తే మాత్రం అయిదారు సీట్లను బీజేపీ వదిలేసుకోవచ్చు. 20కి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గేదే లేదని బీజేపీ నేతలు చెబుతున్నారు. బీజేపీకే 26 అసెంబ్లీ సీట్లు ఇస్తే జనసేన ఎన్ని స్థానాలు డిమాండ్‌ చేస్తుందోనన్న భయం అయితే చంద్రబాబుకు ఉంది. ఇప్పటికే నియోజకవర్గాలలో గ్రౌండ్‌ను ప్రిపేర్‌ చేసుకున్న నాయకుల హార్ట్‌ బీట్‌ మాత్రం అమాంతం పెరిగింది. తమకు సీటు దక్కుతుందా? లేక పొత్తులో భాగంగా జనసేనో, బీజేపీనో తన్నుకుపోతుందా అన్న టెన్షన్‌ అయితే టీడీపీ నేతల్లో ఉంది.

Updated On 16 Feb 2024 5:47 AM GMT
Ehatv

Ehatv

Next Story