తెలుగుదేశం(TDP)- జనసేన(Janasena) పార్టీ కూటమి తొలి జాబితా విడుదలయ్యింది. పొత్తులో భాగంగా జనసేనకు 24 అసెంబ్లీ నియోజకవర్గాలు, మూడు లోక్‌సభ స్థానాలను టీడీపీ ఇచ్చింది. మరీ ఇన్ని తక్కువ స్థానాలు ఇస్తారా అంటూ జనసేన శ్రేణులు మండిపడుతున్నాయి. పవన్‌కల్యాణ్‌ను(Pawan kalayan) కాపునేతలు తిట్టిపోస్తున్నారు. ఇదిలా ఉంటే మొదటి జాబితాలో చంద్రబాబునాయుడు 94 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. పవన్‌ కల్యాణ్‌ మాత్రం అయిదుగురు అభ్యర్థులను ప్రకటించి మిగిలిన 19 స్థానాలను పెండింగ్‌లో పెట్టారు.

తెలుగుదేశం(TDP)- జనసేన(Janasena) పార్టీ కూటమి తొలి జాబితా విడుదలయ్యింది. పొత్తులో భాగంగా జనసేనకు 24 అసెంబ్లీ నియోజకవర్గాలు, మూడు లోక్‌సభ స్థానాలను టీడీపీ ఇచ్చింది. మరీ ఇన్ని తక్కువ స్థానాలు ఇస్తారా అంటూ జనసేన శ్రేణులు మండిపడుతున్నాయి. పవన్‌కల్యాణ్‌ను(Pawan kalayan) కాపునేతలు తిట్టిపోస్తున్నారు. ఇదిలా ఉంటే మొదటి జాబితాలో చంద్రబాబునాయుడు 94 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. పవన్‌ కల్యాణ్‌ మాత్రం అయిదుగురు అభ్యర్థులను ప్రకటించి మిగిలిన 19 స్థానాలను పెండింగ్‌లో పెట్టారు. ఇప్పుడదే టీడీపీ, జనసేన నేతలలో టెన్షన్‌ పుట్టిస్తోంది. ఆ ప్రకటించాల్సిన 19 స్థానాలు ఏమిటో తెలియక ఆందోళన పడుతున్నారు. జనసేనకు ఉభయ గోదావరి జిల్లాలలో బలమున్నదన్నది కాదనలేని వాస్తవం. అలాగే ఉత్తరాంధ్రలో(North Andhra) కూడా జనసేనకు అంతో ఇంతో బలముంది. కాబట్టి ఈ రెండు చోట్లా జనసేనకు ఎక్కువ స్థానాలు ఇచ్చే అవకాశం ఉంది. రాయలసీమలో(Rayalseema) జనసేన బలం పెద్దగా లేదు కాబట్టి తక్కువ సీట్లు ఇచ్చే ఛాన్స్‌ ఉంది. అయితే సీమలో జనసేనకు ఇచ్చే స్థానాలు ఏమిటన్నదే ఆసక్తిగా మారింది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని తిరుపతి, శ్రీకాళహస్తి స్థానాలపై చర్చ జరుగుతోంది. పొత్తు ధర్మంలో భాగంగా ఈ రెండు సీట్లను జనసేనకు ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ రెండు సీట్లు జనసేనకు దక్కకపోతే మాత్రం ఆ పార్టీకి అంతకు మించిన అవమానం మరోటి ఉండదు. ఎందుకంటే తిరుపతిలో కాపులు బలంగా ఉన్నారు. మెగాస్టార్‌ చిరంజీవి(Chiranjeevi) ప్రజారాజ్యం పార్టీ పెట్టిన తర్వాత ఆయన తన స్వస్థలం పాలకొల్లు నుంచి, తిరుపతి నుంచి పోటీ చేశారు. పాలకొల్లు ఓటర్లు చిరంజీవిని కాదనుకున్నా, తిరుపతి ప్రజలను ఆయనను అక్కున చేర్చుకున్నారు. భారీ మెజారిటీ రాలేదు కానీ చిరంజీవి గౌరవాన్ని కాపాడారు. తిరుపతిలో మొదట్నుంచి జనసేన బలంగానే ఉంది. పసుపులేటి హరిప్రసాద్‌, రాయల్‌ కాని రాయల్, రాజారెడ్డి, కాపు యువకులు జనసేనకు బలం, బలగం. తిరుపతి సీటును జనసేనకు ఇస్తే మాత్రం గెలుపు పక్కా అని పార్టీ క్యాడర్‌ అంటోంది. జనసేన కచ్చితంగా గెలిచే సీటు ఏదైనా ఉందంటే అది తిరుపతే! శ్రీకాళహస్తిలో కూడా ఇంచుమించు ఇలాంటి పరిస్థితే ఉంది. అక్కడ బలిజ సమాజికవర్గం ఎక్కువ. శ్రీకాళహస్తిలో జనసేన ఇన్‌ఛార్జ్‌గా కోట వినుత ఉన్నారు. ఆమె, ఆమె భర్త ఇద్దరూ అధికారపార్టీ బెదిరింపుకు భయపడకుండా పార్టీని అంటిపెట్టుకుని వస్తున్నారు. ఇదిలాఉంటే శ్రీకాళహస్తి తెలుగుదేశంపార్టీ ఇన్‌ఛార్జ్‌ బొజ్జల సుధీర్‌రెడ్డి ఇప్పుడు బయటకు వచ్చి తనదే టికెట్‌ అంటూ హడావుడి చేస్తున్నారు. ఇంతకాలం ఆయన ఎక్కడ ఉన్నారో ఎవరికీ తెలియదు. కరోనా సమయంలో జనసేన పార్టీ క్యాడరే ప్రజలకు అంతో ఇంతో సేవలు చేసింది. వీటిని దృష్టిలో పెట్టుకునే శ్రీకాళహస్తి టికెట్ తమకే ఇవ్వాలని జనసేన నాయకులు గట్టిగా పట్టుబడుతున్నారు. ఏమవుతుందో చూడాలి.

Updated On 27 Feb 2024 1:16 AM GMT
Ehatv

Ehatv

Next Story