TDP-Congress contest together : ఏపీలో టీడీపీ-కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తాయా?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి రాబోయే మూడు నాలుగు నెలలు కాస్త గడ్డుకాలమే! ఇది చెప్పడానికి జ్యోతిష్య శాస్త్రంలో పట్టా పుచ్చుకోవాల్సిన పని లేదు. ఏపీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు చూసి చెప్పవచ్చు. ఇప్పటికే సొంత చెల్లెలు వై.ఎస్.షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. చేరడమే కాదు, ఆ పార్టీ పగ్గాలు తీసుకోబోతున్నారు. ఏ పార్టీ అయితే తనను ఇబ్బంది పెట్టిందో, జైలుపాలు చేసిందో ఆ పార్టీలో చెల్లెలు చేరడాన్ని ఏ అన్న అయినా ఎలా జీర్ణించుకోగలరు చెప్పండి!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్(ap cm jagan)కి రాబోయే మూడు నాలుగు నెలలు కాస్త గడ్డుకాలమే! ఇది చెప్పడానికి జ్యోతిష్య శాస్త్రంలో పట్టా పుచ్చుకోవాల్సిన పని లేదు. ఏపీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు చూసి చెప్పవచ్చు. ఇప్పటికే సొంత చెల్లెలు వై.ఎస్.షర్మి(Ys Sharmila) కాంగ్రెస్ పార్టీ(Congress Party)లో చేరుతున్నారు. చేరడమే కాదు, ఆ పార్టీ పగ్గాలు తీసుకోబోతున్నారు. ఏ పార్టీ అయితే తనను ఇబ్బంది పెట్టిందో, జైలుపాలు చేసిందో ఆ పార్టీలో చెల్లెలు చేరడాన్ని ఏ అన్న అయినా ఎలా జీర్ణించుకోగలరు చెప్పండి! అదీ కాకుండా తన విరోధి అయిన టీడీపీతో ఫ్రెండ్‌షిప్ చేయడం ఎలా సహిస్తారు? లోకేశ్‌కు క్రిస్మస్ కానుకలను ( Lokesh christmas gifts) షర్మిల పంపినప్పుడే అర్థమయ్యింది. జగన్‌ను రెచ్చగొట్టేందుకు ఉద్దేశపూర్వకంగానే షర్మిల ఆ పని చేశారని చెప్పుకుంటున్నారు. అదీ కాకుండా జగన్ శత్రువులంతా తమకు మిత్రులన్నట్టుగా షర్మిల, ఆమె కుటుంబసభ్యులు ప్రవర్తిస్తున్నారు. జగన్ శత్రువులతో షర్మిల భర్త బ్రదర్ అనిల్‌కుమార్(Sharmila's husband brother Anil Kumar) ఫోటోలకు పోజులు కూడా ఇచ్చారు. జగన్ ప్రత్యర్థి, పులివెందుల టీడీపీ అభ్యర్థి(Pulivendula TDP candidate) బీటెక్ రవి(BTech Ravi)తో బ్రదర్ అనిల్ నవ్వుతూ ఫోటో దిగారు. మరో శత్రువు ఆదినారాయణరెడ్డి(adi narayanareddy)తో కూడా అలాగే ఫోటోకు పోజిచ్చారు. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదంతా వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌ను రెచ్చగొట్టడానికేనని అర్థమవుతోంది. అలాగే జమ్మలమడుగు టీడీపీ అభ్యర్థి భూపేష్(Jammalamadugu TDP candidate Bhupesh ) తండ్రి నారాయణరెడ్డి(Narayanareddy)ని కూడా అనిల్ ఎయిర్‌పోర్ట్‌లో కలిశారు. మరో నాలుగు నెలలలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఎన్నికలకు జగన్ పార్టీ ఆల్‌రెడి సంసిద్ధమయ్యింది. అభ్యర్థుల ఎంపిక కూడా జరుగుతోంది. కొన్ని చోట్ల కొత్తవారికి అవకాశం కల్పిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ కూడా ఎన్నికలకు సమాయత్తమయ్యింది. టీడీపీతో నూటికి నూరుశాతం పొత్తు ఉంటుందని జనసేన అధినేత పవన్‌కల్యాణ్(Janasena president pavan kalyan) నాలుగైదు సార్లు ప్రకటించారు. కాకపోతే ఇంకా ఖరారు కాలేదు. బీజేపీయేమో జనసేనతో పొత్తు ఉంటుందని ప్రకటించింది కానీ టీడీపీ ప్రస్తావన తేవడం లేదు. బీజేపీ-టీడీపీ-జనసేన కలిసి(tdp-JanaSena alliance) పోటీ చేయాలని పవన్ గట్టిగా అనుకుంటున్నాడు. బీజేపీ మాత్రం టీడీపీని దగ్గర రానివ్వడం లేదు. ఈ లెక్కన టీడీపీతో జనసేన పొత్తు ఉంటుందా ఉండదా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఎందుకంటే బీజేపీని కాదని పవన్ నిర్ణయం తీసుకోలేడు. బీజేపీ దగ్గరకు రానివ్వకపోతే ఇండియా కూటమిలో చేరడానికి టీడీపీ రెడీగా ఉంది. అదే జరిగితే టీడీపీ, కాంగ్రెస్ మధ్య లోపాయికారి ఒప్పందం(agreement between TDP and Congress) కుదురుతుంది. మొత్తంగా ఏపీ రాజకీయాలు అత్యంత ఆసక్తికరంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.