RK Roja : మంత్రి రోజా సంగతేమిటి? గెలుస్తారా? ఓడిపోతారా?
ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh) వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ(YCP) అధికారాన్ని నిలుపుకుంటుందా? టీడీపీ(TDP), బీజేపీ(BJP), జనసేనలతో(Janasena) కూడిన కూటమి విజయం సాధిస్తుందా? అన్నది చెప్పడానికి విశ్లేషకులు సంకోచిస్తున్నారు. లెక్కలేసుకుంటున్నారు కానీ సరైన ఆన్సర్ రావడం లేదు. కొందరు జగనే అంటున్నారు. కొందరేమో బాబే అని చెబుతున్నారు. ఇది అలా ఉంచితే మంత్రి రోజా(Rk roja) సంగతేమిటి? ఆమె గెలిచే అవకాశాలు ఉన్నాయా? అనుకున్నట్టుగానే ఓడిపోబోతున్నారా? ఇప్పుడీ విషయంపై పెద్ద చర్చ నడుస్తోంది.
ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh) వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ(YCP) అధికారాన్ని నిలుపుకుంటుందా? టీడీపీ(TDP), బీజేపీ(BJP), జనసేనలతో(Janasena) కూడిన కూటమి విజయం సాధిస్తుందా? అన్నది చెప్పడానికి విశ్లేషకులు సంకోచిస్తున్నారు. లెక్కలేసుకుంటున్నారు కానీ సరైన ఆన్సర్ రావడం లేదు. కొందరు జగనే అంటున్నారు. కొందరేమో బాబే అని చెబుతున్నారు. ఇది అలా ఉంచితే మంత్రి రోజా(Rk roja) సంగతేమిటి? ఆమె గెలిచే అవకాశాలు ఉన్నాయా? అనుకున్నట్టుగానే ఓడిపోబోతున్నారా? ఇప్పుడీ విషయంపై పెద్ద చర్చ నడుస్తోంది. అందుకు కారణం నగరిలో 82 శాతం పోలింగ్ నమోదు కావడం. జనం ఇంత ఉత్సాహంతో ఓట్లు వేశారు కాబట్టి రోజా విజయావకాశాలు మెరుగుపడ్డాయన్నది వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ వారి వాదన. జనం ఉత్సాహంతో పోలింగ్ స్టేషన్‌లకు రాలేదని, రోజాను ఓడగొట్టడానికే వచ్చారని తెలుగుదేశంపార్టీ తరఫున పోటీ చేస్తున్న గాలి భాను ప్రకాశ్(Gal Bhanu Prakash) అంటున్నారు. గత ఎన్నికల్లో తృటిలో ఓడిపోయాను కానీ ఈసారి అలా జరగదని భానుప్రకాశ్ చెబుతున్నారు. 2014లో జరిగిన ఎన్నికల్లో గాలి ముద్దుకృష్ణమనాయుడిపై విజయం సాధించిన రోజా తర్వాత ఆయన కుమారుడిపై గెలుపొందారు. ఇప్పుడామె హ్యాట్రిక్ కొడతారా లేదా అన్నదే ఉత్కంఠగా మారింది. రోజాకు సొంత పార్టీ నుంచే ఇబ్బందులు వచ్చాయి. నగరిలో(Nagari) వర్గపోరు ఎక్కువగా ఉంది. క్యాడర్‌లో చాలా మంది రోజాకు వ్యతిరేకంగా పని చేశారు. ఎన్నికల సమయం దగ్గరపడుతున్న సమయంలో రోజా వ్యతిరేకులంతా ఏకమయ్యారు. పార్టీని వదిలిపెట్టేసి గాలి భానుప్రకాశ్ గెలుపు కోసం పని చేశారు. అసమ్మతి ఎక్కువగా ఉండటంతో రోజా ఓడిపోతారనే అనుకున్నారు. అదే సమయంలో తెలుగుదేశంపార్టీలో అసంతృప్తి నేతలు వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌లో చేరడం రోజాకు కలిసివచ్చింది. ముఖ్యంగా అశోక్‌రాజ్ చేరికతో కాసింత విశ్వాసం పెరిగింది. అలాగే గాలి భానుప్రకాశ్ తల్లి, ఆయన తమ్ముడి సహకారం రోజాకు పరోక్షంగా ఉందని కొందరు అంటుంటారు. డబ్బు పంపిణిలో కూడా రోజాదే పై చేయి అయ్యిందట! వీటన్నంటినీ పరిగణనలోకి తీసుకుంటే రోజా కొద్దిపాటి ఓట్ల తేడాతో అయినా విజయం సాధిస్తారనే టాక్ వినిపిస్తోంది.. చూద్దాం ఏమవుతుందో!