ఏపీలో(AP) క్రమక్రమంగా ఎన్నికల(Elections) వేడి రాజుకుంటోంది. ఫిబ్రవరి మొదటి, లేదా రెండో వారంలో ఎన్నికల కోడ్‌ వచ్చే అవకాశం ఉంది. ఎన్నికల్లో గెలిచేందుకు పార్టీలు వ్యూహాలు పన్నుతున్నాయి. నియోజకవర్గాల ఇంచార్జీలను నియమిస్తూ సీఎం జగన్‌(CM Jagan) దూకుడుగా ముందుకు వెళ్తున్నారు. ఈ క్రమంలో టీడీపీ(TDP)-జనసేన(Janasena) కూడా తమ అభ్యర్థులపై కసరత్తులు మొదలు పెట్టారు. అయితే బీజేపీతో ఇంకా పొత్తు తేలకపోవడంతో సీట్ల సర్దుబాటుపై కసరత్తు చేస్తున్నారు.

ఎంపీ రఘురామకృష్ణంరాజు(Raghurama Krishnam Raju) ఎక్కడి నుంచి పోటీచేస్తారన్న అంశం ఇప్పుడు చర్చకు దారి తీసింది. ఎంపీ రఘురామకృష్ణంరాజు గత ఎన్నికల్లో వైసీపీ(YCP) తరపున నర్సాంపురం నుంచి పోటీ చేసి గెలుపొందారు. క్రమేణా వైసీపీ అధినేత జగన్‌కు, రఘురామకృష్ణంరాజుకు గ్యాప్‌ పెరిగింది. సీఎం జగన్‌పై బహిరంగ విమర్శలు చేస్తూ వచ్చారు. వైసీపీ కూడా అంతే దీటుగా రఘురామకృష్ణంరాజును టార్గెట్‌ చేసింది. ఓ దశలో జైలుకు కూడా వెళ్లింది. అసలు రఘురామకృష్ణంరాజును కనీసం నియోజకవర్గంలో అడుగుకూడా పెట్టనివ్వలేదు. దీంతో ఆయన కోర్టును ఆశ్రయించి, కోర్టు అనుమతితో నియోజకవర్గానికి నాలుగేళ్ల తర్వాత వెళ్తున్నారు.

ఈ క్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ(BJP) పొత్తు పెట్టుకుంటేనే వైసీపీని దీటుగా ఎదుర్కోగలమని ఆయన అంటున్నారు. ఈ మేరకు టీడీపీ-జనసేన కూటమితో బీజేపీని జతకట్టించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని తెలిసింది . టీడీపీ-జనసేన కూటమితో పొత్తు పెట్టుకోవాలని పలువురు ఢిల్లీ బీజేపీ పెద్దలను కలుస్తున్నారు. ఒకవేళ బీజేపీ, టీడీపీ, జనసేన కలిస్తే బీజేపీ టికెట్‌తో నర్సాపురంలో(Narsapuram) పోటీచేయాలని భావిస్తున్నారట. బీజేపీతో పొత్తు కుదరకపోతే, టీడీపీ-జనసేన పొత్తులో భాగంగా నర్సాపురం స్థానాన్ని ఎవరికి కేటాయిస్తే అదే పార్టీ నుంచి పోటీ చేయాలని చూస్తున్నారు. నర్సాపురంలో టీడీపీ అభ్యర్థిగా రఘురామకృష్ణంరాజు పోటీ చేస్తే అక్కడ తమ క్యాడర్‌ డిస్టర్బ్‌ అవుతారన్న ఆలోచనలో జనసేన ఉందట. తమ పార్టీ అభ్యర్థినే దింపాలని జనసేన ఆలోచన కూడా ఉందని తెలుస్తోంది. అదే జరిగితే జనసేనలో చేరి ఆ పార్టీ అభ్యర్థిగా పోటీచేయాలని ఆయన అనుకుంటున్నారు. పొత్తులో భాగంగా నర్సాపురం స్థానం టీడీపీకి కేటాయించి.. అక్కడ తనకు అవకాశం కల్పించలేకపోతే రాజమండ్రి ఎంపీ టికెట్‌ కావాలని ఆయన కోరుతున్నారని తెలిసింది. పొత్తులు తేలాకనే రఘురామకృష్ణంరాజు అభ్యర్థిత్వంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Updated On 13 Jan 2024 3:51 AM GMT
Ehatv

Ehatv

Next Story