Raghurama Krishna Raju : రఘురామకృష్ణరాజులో ఆశలు సన్నగిల్లలేదు..టికెట్‌పై ఇంకా నమ్మకంతో ఉన్నారు
నరసాపురం(Narsapuram) లోక్‌సభ సభ్యుడు రఘురామకృష్ణరాజు(Raghu rama Krishna Raju) తనకు టికెట్ వస్తుందన్న ఆశతోనే ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు(AP) సంబంధించి ఆల్‌మోస్టాల్ అన్ని పార్టీలు అభ్యర్థులను ప్రకటించేశాయి. చాలా మంది ప్రచారంలో దిగిపోయారు. ఇంటింటికి తిరుగుతూ ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు. నామినేషన్‌ల టైమ్ వరకల్లా ఒకట్రెండ్ మార్పలు జరిగే అవకాశం అయితే ఉంది కానీ అది అంత సులభమైన విషయం మాత్రం కాదు.
నరసాపురం(Narsapuram) లోక్‌సభ సభ్యుడు రఘురామకృష్ణరాజు(Raghu rama Krishna Raju) తనకు టికెట్ వస్తుందన్న ఆశతోనే ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు(AP) సంబంధించి ఆల్‌మోస్టాల్ అన్ని పార్టీలు అభ్యర్థులను ప్రకటించేశాయి. చాలా మంది ప్రచారంలో దిగిపోయారు. ఇంటింటికి తిరుగుతూ ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు. నామినేషన్‌ల టైమ్ వరకల్లా ఒకట్రెండ్ మార్పలు జరిగే అవకాశం అయితే ఉంది కానీ అది అంత సులభమైన విషయం మాత్రం కాదు. ఎందుకంటే ఇప్పుడు టికెట్ సంపాదించినవారు అలాంటి ఇలాంటి నేతలు కాదు. రాజకీయాలలో సుదీర్ఘ అనుభవం ఉన్నవారు. ఎన్నో పోరాటాలు చేసినవారు. కానీ రఘురామకృష్ణరాజు మాత్రం మార్పులపై బోల్డన్ని నమ్మకాలు పెట్టుకున్నారు. ఆ నమ్మకంతోనే ఈ ఎన్నికల్లో తాను తప్పకుండా పోటీ చేస్తానని అంటున్నారు. ఏ పార్టీ తరఫున పోటీ చేస్తారో ఆయనకే తెలియదు. అసెంబ్లీకి చేస్తారో, లోక్‌సభకు చేస్తారో అన్నదాంట్లో కూడా స్పష్టత లేదు. అయినా సరే గ్యారంటీగా పోటీ చేసి తీరతానని ఆయన చెప్పుకోవడమే ఆసక్తి కలిగించే అంశం. మూడు నాలుగు రోజులలో క్లారిటీ వస్తుందని ట్రిపులార్ చెప్పుకొచ్చారు. ఏ పార్టీ నుంచి పోటీ చేస్తానో చెప్పలేను కానీ తాను నరసాపురం లోక్‌సభ నుంచి పోటీ చేయడం గ్యారంటీ అని వివరణ ఇచ్చుకున్నారు. పొత్తులో భాగంగా నరసాపురం ఏ పార్టీకి దక్కినా టికెట్ మాత్రం తనదేనని గొప్పలు చెప్పుకున్నారు. సీట్ల షేరింగ్‌లో నరసాపురం లోక్‌సభ స్థానం బీజేపీకి దక్కింది. బీజేపీ అధినాయకత్వం నిమిషం కూడా ఆలోచించకుండా టికెట్‌ను భూపతిరాజు శ్రీనివాసవర్మకు ఇచ్చింది. ఇప్పుడు రఘరామకృష్ణరాజు పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. టీడీపీ అనుకూల మీడియాలో గంటలతరపడి మాట్లాడిన రఘరామకృష్ణరాజుకు కనీసం టీడీపీ అయినా టికెట్ ఇవ్వకపోతుందా అని గట్టిగా అనుకున్నారు. అందుకే చంద్రబాబును అమితంగా పొడిగారు. చంద్రబాబు తనకు న్యాయం చేస్తారంటూ విశ్వసించారు. చంద్రబాబును అంత పొడిగిన రఘురామకృష్ణరాజు తెలుగుదేశం పార్టీలో మాత్రం చేరలేదు. స్థిరత్వం లేని మనిషి కాబట్టే ఆయనకు టికెట్ ఇవ్వడానికి పార్టీలు జంకుతున్నాయి. అయినా రఘురామకృష్ణరాజు మాత్రం మూడు పార్టీలను బతిమాలుకుంటున్నారు. నరసాపురం కాకపోతే మరో చోటు నుంచైనా టికెట్ ఇవ్వమని అడుగుతున్నారు. మరి ఆర్‌ఆర్‌ఆర్‌ను ఎవరు కనికరిస్తారో చూడాలి!