ఆంధ్రప్రదేశ్(AP)లో మూడు పార్టీల కూటమి అధికారంలోకి వస్తుందని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు(Chandrababu), జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్(Pawan Kalyan) పదే పదే చెబుతూ వస్తున్నారు. బీజేపీ తమతో చేతులు కలిపిన తర్వాత బలం పెరిగిందని అంటున్నారు. రాబోయే ఎన్టీయే ప్రభుత్వమేనని సౌండ్ బాక్స్‌లు బద్దలయ్యేలా చెబుతున్నారు.
ఆంధ్రప్రదేశ్(AP)లో మూడు పార్టీల కూటమి అధికారంలోకి వస్తుందని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు(Chandrababu), జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్(Pawan Kalyan) పదే పదే చెబుతూ వస్తున్నారు. బీజేపీ తమతో చేతులు కలిపిన తర్వాత బలం పెరిగిందని అంటున్నారు. రాబోయే ఎన్టీయే ప్రభుత్వమేనని సౌండ్ బాక్స్‌లు బద్దలయ్యేలా చెబుతున్నారు. టీడీపీ అనుకూల మీడియా కూడా ఇదే రాస్తూ, చెబుతూ వస్తున్నది. బీజేపీ తమతోనే ఉన్నదని వీరు చెబుతున్నారు కానీ బీజేపీ మాత్రం ఆ మాట చెప్పడం లేదు. చెప్పడానికి జంకుతుంది. టీడీపీ-జనసేనలతో అంటీముట్టనట్టగా ఉంటున్నది. కూటమి మేనిఫెస్టో విడుదల సందర్భంగా బీజేపీ వైఖరి ఏమిటో తెలిసిపోయింది. మేనిఫెస్టో కేవలం టీడీపీ-జనసేనలదేనని, తమది కాదన్నట్టుగా బీజేపీ వ్యవహరించింది. ఆ మేనిఫెస్టో కాపీని కనీసం చేత్తో ముట్టుకోవడానికి కూడా ఇష్టపడేలేదు బీజేపీ. పోనీ టీడీపీ, జనసేన కార్యకర్తలు సఖ్యతతో ఉన్నారా అంటే అదీలేదు. జనసేన, బీజేపీ పోటీ చేస్తున్న ప్రతి నియోజకవర్గంలో ఏదో ఒక గొడవ ఉంటూనే వస్తోంది. వీటన్నింటినీ బీజేపీ అధినాయకత్వం జాగ్రత్తగా గమనిస్తోంది. పరిస్థితి బాగోలేదు కాబట్టే ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారసభల్లో పాల్గొనడానికి ఇష్టపడటం లేదు. అసలు మోదీకి టీడీపీ, జనసేనలను ఎన్టీయే కూటమి నుంచి బయటకు పంపించాలనే ఉంది కానీ ఎన్నికల ముందు అలా చేస్తే ప్రజలు తప్పుగా అర్థం చేసుకునే ప్రమాదం ఉందని వెనకడుగు వేస్తున్నారట! ప్రధాని మోదీ ఈ నెల 3, 4 తేదీలలో తెలంగాణలో పర్యటిస్తున్నారు. పలు ఎన్నికల సభలు, రోడ్ షోలలో పాల్గొంటారు. నల్లగొండ జిల్లాలో కూడా మోదీ సభలు ఉంటాయని బీజేపీ ప్రచార కమిటీ చెప్పింది. 3, 4 తేదీలలోనే మోదీ ఆంధ్రప్రదేశ్‌లో కూడా పర్యటిస్తారని తెలిపింది. రాజంపేట, రాజమండ్రిలలో సభలు ఉంటాయని, విజయవాడలో రోడ్ షో ఉంటుందని కొన్ని రోజుల కిందట చెప్పారు. కానీ ఆ షెడ్యూల్ ఇప్పుడు మారింది. ఆంధ్రప్రదేశ్‌లో కాకుండా తెలంగాణలోనే సభలు నిర్వహించేలా మోదీ షెడ్యూల్‌ను మార్చినట్టు సమాచారం. అదే జరిగితే మాత్రం ఏపీలో టీడీపీ- జనసేన పరువు పోవడం ఖాయమని అనుకుంటున్నారు.