సినిమాల్లో అయితే వందమందిని అవలీలగా మట్టికరిపించేస్తాడు. సై అంటే సై అంటాడు. అవతలివ్యక్తి ఎంతటి బలశాలి అయినా వెనుకంజవేయడు. మరి ఓ మహిళ ఎదుట ఎందుకలా గజగజలాడిపోతున్నాడు? ఆమెపై గెలుపు కష్టమన్న విషయం అవగతమయ్యిందా? ఇదంతా ఎవరి గురించో పాఠకులకు అర్థమయ్యే ఉంటుంది. పిఠాపురం(Pithapura) అసెంబ్లీ నియోజకర్గం నుంచి పోటీ చేస్తున్న జనసేన(Janasena) అధినేత పవన్‌ కల్యాణ్‌(Pawan kalyan) పరిస్థితి ఇది! ఆయన ఎందుకంత భయపడుతున్నారో తెలియడం లేదు. అక్కడ 80 వేలకు పైగా కాపు సామాజికవర్గ ఓటర్లు ఉన్నారు.

సినిమాల్లో అయితే వందమందిని అవలీలగా మట్టికరిపించేస్తాడు. సై అంటే సై అంటాడు. అవతలివ్యక్తి ఎంతటి బలశాలి అయినా వెనుకంజవేయడు. మరి ఓ మహిళ ఎదుట ఎందుకలా గజగజలాడిపోతున్నాడు? ఆమెపై గెలుపు కష్టమన్న విషయం అవగతమయ్యిందా? ఇదంతా ఎవరి గురించో పాఠకులకు అర్థమయ్యే ఉంటుంది. పిఠాపురం(Pithapura) అసెంబ్లీ నియోజకర్గం నుంచి పోటీ చేస్తున్న జనసేన(Janasena) అధినేత పవన్‌ కల్యాణ్‌(Pawan kalyan) పరిస్థితి ఇది! ఆయన ఎందుకంత భయపడుతున్నారో తెలియడం లేదు. అక్కడ 80 వేలకు పైగా కాపు సామాజికవర్గ ఓటర్లు ఉన్నారు. ఈ గణాంకాలు చూసే కదా పవన్‌ ఆ నియోజకవర్గాన్ని ఎంచుకున్నది. దీంతో పాటు టీడీపీకి(TDP) చెందిన వర్మ సపోర్ట్‌ ఎలాగూ పవన్‌కే ఉంది. పిఠాపురంలో వర్మకు బలమైన క్యాడర్‌ ఉందన్న విషయం తెలిసిందే.

ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే మూడు సినిమాల నుంచి హడావుడిగా స్పెషల్ టీజర్లు వచ్చాయి. ఆ టీజర్లన్నీ పవన్‌కు మించినవాడు లేనే లేడన్నట్టుగా ఉన్నాయి. నిజానికి పవన్‌కు భీమవరం నుంచి మళ్లీ పోటీ చేయాలనే ఉండింది. టీడీపీ అధినేత చంద్రబాబు ఆలోచన వేరుగా ఉంటుంది కదా! పవన్‌ కల్యాణ్‌ను భీమవరం నుంచి తప్పించేసి పిఠాపురానికి పంపించడంలో చంద్రబాబు సక్సెసయ్యారు. పిఠాపురానికి పవన్ వచ్చినప్పటి నుంచి హడావుడి మొదలయ్యింది. ఇక్కడో ఇల్లు తీసుకున్నారు పవన్. మెగా ఫ్యామిలీలో చాలా మంది ఇప్పటికే పిఠాపురం చేరారు. పవన్‌ తరఫున ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు.

అన్న నాగబాబు(Nagababu) దంపతులు దగ్గరుండి మరీ ప్రచారం సంగతులు చూసుకుంటున్నారు. జబర్దస్త్‌ కమెడియన్లు బాగానే కష్టపడుతున్నారు. ఇంత మంది వచ్చి ప్రచారం చేస్తున్నా పవన్‌కు మాత్రం గెలుపుపై ఎక్కడో ఏదో అనుమానం వస్తున్నది. ఆ అనుమానంతోనే కాసింత భయం ఆయనలో ఆవరించింది. తను గెలవకపోతే పరిస్థితి ఏమిటని పవన్‌ అనుకుంటున్నట్టుగా ఉంది. ఈ ఎన్నికల్లో పవన్‌ విజయం సాధించకపోతే జనసేన పార్టీకి షట్టర్లు వేసుకోవాల్సిందే! పవన్‌ అదృష్టం బాగుండి చంద్రబాబు గెలిచి ముఖ్యమంత్రే అయ్యారనుకోండి. అప్పుడు పవన్‌కు ఇంపార్టెన్స్‌ పెరుగుతుందని అనుకోవడం మూర్ఖత్వమే అవుతుంది. చంద్రబాబు(Chandrababu) సంగతి తెలిసినవారెవ్వరూ అలా అనుకోరు.

జనసేనకు చెందిన వారు అయిదారుగురు గెలిచినా వారు పవన్‌ వెంటనే ఉంటారన్న గ్యారంటీ ఏమీ లేదు. అందుకే పవన్‌ మరికొంత మంది మద్దతు కోరుకుంటున్నారు. ఇప్పటి వరకు కమ్మ సామాజికవర్గ ప్రముఖులెవ్వరూ పవన్‌కు మద్దతు పలకలేదు. నిర్మాత నాగవంశీ, హీరో నాని, చిన్న హీరో రాజ్‌ తరుణ్‌లు పవన్‌కు జై కొడుతున్నారు. తమ్ముడి గెలుపు కోసం అన్న చిరంజీవి కూడా రంగంలోకి దిగారు. తన తమ్ముడు అలాంటి ఇలాంటివాడు కాదని, గొప్ప వీరుడని, మహా త్యాగి అని, అతడు అసెంబ్లీలో ఉండాల్సిన వాడని చెబుతూ పవన్‌ను గెలిపించండి అంటూ పిఠాపురం ప్రజలను వేడుకున్నారు చిరంజీవి. ఇప్పుడు పవన్ గెలుపు సునాయాసం కావాలంటే ఎన్టీఆర్‌, మహేశ్‌బాబు, ప్రభాస్‌, రామ్‌చరణ్‌, అల్లు అర్జున్‌ను రంగంలోకి దిగాల్సి ఉంటుంది. అన్నట్టు పిఠాపురం నియోజకవర్గంలో బ్రాహ్మణ ఓట్లు కూడా ఎక్కువేనట! అంచేత త్రివిక్రమ్‌ను కూడా వచ్చి ప్రచారం చేస్తారేమో!

Updated On 8 May 2024 1:27 AM GMT
Ehatv

Ehatv

Next Story