Pawan kalyan : పవన్.. హస్తిన రాయభారం ఫలించేనా?
జనసేన(Janasena) అధినేత పవన్ కల్యాణ్(Pawan kalyan) ఢిల్లీ(Delhi) వెళ్లనున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జనసేన-టీడీపీ(TDP) కలిసి ఎన్నికలకు(Election) వెళ్లాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇక.. ఈ కూటమిలోకి బీజేపీని కూడా తీసుకుని రావాలని జనసేనాని పవన్ కల్యాణ్ ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు. పొత్తుల విషయంలో బీజేపీని(BJP) ఒప్పించాలని పవన్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ పర్యటనలో పొత్తులపై బీజేపీ అధిష్టానంతో మంతనాలు జరపుతారని పార్టీ వర్గాల సమాచారం.
జనసేన(Janasena) అధినేత పవన్ కల్యాణ్(Pawan kalyan) ఢిల్లీ(Delhi) వెళ్లనున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జనసేన-టీడీపీ(TDP) కలిసి ఎన్నికలకు(Election) వెళ్లాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇక.. ఈ కూటమిలోకి బీజేపీని కూడా తీసుకుని రావాలని జనసేనాని పవన్ కల్యాణ్ ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు. పొత్తుల విషయంలో బీజేపీని(BJP) ఒప్పించాలని పవన్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ పర్యటనలో పొత్తులపై బీజేపీ అధిష్టానంతో మంతనాలు జరపుతారని పార్టీ వర్గాల సమాచారం. ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో పొత్తుల డైలమాపై క్లారిటీ కోసమే పవన్ ఢిల్లీ వెళ్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలు కలిసి పోటీ చేస్తాయని గతంలో పవన్ కల్యాణ్ అనేక సందర్భాల్లో మాట్లాడారు. కానీ..అంశాన్ని బీజేపీ తేల్చలేదు. ఇప్పటికే..గెలుపే లక్ష్యంగా అధికార వైసీపీ(YCP) బలమైన అభ్యర్థులపై కసరత్తు చేస్తోంది. ఇటు ఎమ్మెల్యే, అటు ఎంపీ సీట్లకు ఏకకాలంలో అభ్యర్థులను ఖరారు చేసే పనిలో పడింది. ఒకవైపు అభ్యర్థులను ఎంపిక చేస్తూనే..మరోవైపు సిద్ధం పేరుతో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి ఎన్నికల ప్రచార బరిలోకి దూకింది. అంటే..కూటమితో పోలిస్తే..ఎన్నికలకు సమాయత్తం కావడంలో అధికార పార్టీ ఒక అడుగు ముందే ఉందని చెప్పాలి. కానీ..టీడీపీ-జనసేన కూటమిలో ఈ దూకుడు కనిపించడం లేదు. పొత్తులో వెళ్లాలని నిర్ణయించుకున్నా.. ఎవరు ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తారనే లెక్క తేలలేదు. అలాగే ఎవరు..ఎక్కడెక్కడా పోటీ చేస్తారనే విషయంపైనా క్లారిటీ లేదు. పైగా సీట్ల సర్దుబాటు ఆలస్యమైనకొద్దీ ఇరు పార్టీలకు కొత్త చిక్కులు వచ్చిపడుతున్నాయి. ఇరు పార్టీల ఆశావహుల్లోనూ అసహనం పెరిగిపోతోంది. పొత్తుల నేపథ్యంలో ఎవరి సీటుకు ఎసరు వస్తుందోనన్న ఆందోళనతో సీనియర్ నేతలు సైతం టెన్షన్ పడుతున్నారు. సీట్ల సంగతి తేల్చాలని అధినేతలపై ఒత్తిడి తెస్తున్నారు. ఈ నేపథ్యంలో వీలైనంత త్వరగా సీట్ల సర్దుబాటు అంశాన్ని తేల్చాలని ఇరు పార్టీల అధినేతలు నిర్ణయించుకున్నట్టు సమాచారం. మొదటి నుంచి టీడీపీ-జనసేన కూటమితో బీజేపీ కలిసివస్తుందని పవన్ కల్యాణ్ పదేపదే చెబుతూ వస్తున్నారు. కూటమిలో సీట్ల సర్దుబాటు ఆలస్యానికి ఇది కూడా ఒక కారణమని తెలుస్తోంది. మొత్తాంగా పవన్ కల్యాణ్ ఢిల్లీ టూర్ తో బీజేపీ కూటమితో కలిసి వస్తుందా? లేదా..అన్న సంగతి తేలిపోతుందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.