ఆంధ్రప్రదేశ్‌కు(Andhra Pradesh) ఇది సువర్ణావకాశమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. 2014లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం రెండు రాష్ట్రాలుగా విభజించినప్పుడు ఏపీకి ప్రత్యేక హోదా(Special status) ఇస్తామని అప్పటి కాంగ్రెస్‌(Congress) ప్రధాని మన్మోహన్‌సింగ్‌(Manmohan singh) స్యయంగా పార్లమెంట్‌లో ప్రకటించారు. ఆ తర్వాత ఎన్నికల్లో బీజేపీ గెలిచి ప్రత్యేక హోదా హామీని నిలబెట్టుకోలేకపోయింది. ఒంటరిగా బీజేపీకి మెజార్టీ స్థానాలు రావడంతో 2014లో చంద్రబాబు, 2019 జగన్‌ బీజేపీపై ఎంత ఒత్తిడి తెచ్చిన ఈ అంశాన్ని మోడీ సర్కార్‌ పక్కన పెట్టింది.

ఆంధ్రప్రదేశ్‌కు(Andhra Pradesh) ఇది సువర్ణావకాశమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. 2014లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం రెండు రాష్ట్రాలుగా విభజించినప్పుడు ఏపీకి ప్రత్యేక హోదా(Special status) ఇస్తామని అప్పటి కాంగ్రెస్‌(Congress) ప్రధాని మన్మోహన్‌సింగ్‌(Manmohan singh) స్యయంగా పార్లమెంట్‌లో ప్రకటించారు. ఆ తర్వాత ఎన్నికల్లో బీజేపీ గెలిచి ప్రత్యేక హోదా హామీని నిలబెట్టుకోలేకపోయింది. ఒంటరిగా బీజేపీకి మెజార్టీ స్థానాలు రావడంతో 2014లో చంద్రబాబు, 2019 జగన్‌ బీజేపీపై ఎంత ఒత్తిడి తెచ్చిన ఈ అంశాన్ని మోడీ సర్కార్‌ పక్కన పెట్టింది. అయితే తాజాగా దేశంలో సార్వత్రిక ఎన్నికలు ఫలితాలు వచ్చాయి. బీజేపీ సింగిల్‌ లార్జెస్ట్ పార్టీకి అవతరించినా కానీ మ్యాజిక్‌ ఫిగర్‌ను దాటలేకపోయింది. 2014, 2019లో మ్యాజిక్‌ ఫిగర్ దాటుతూ బీజేపీ సొంతంగా గెలిచింది. ఆ సమయంలో ఎన్డీఏ సంకీర్ణ కూటమిలో ఉన్న పార్టీల అవసరం లేకుండానే మోడీ ప్రభుత్వం పరిపాలించింది. 2014లో టీడీపీతో పొత్తు పెట్టుకుని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పిస్తామని హామీ ఇచ్చింది. కానీ రకరకాల కారణాలు చెప్తూ ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేకపోయిందని ఎన్డీఏ కూటమి నుంచి చంద్రబాబు 2019లో కాంగ్రెస్‌తో జతకట్టారు. 2019లో జరిగిన ఎన్నికల్లో జగన్ గెలిచినా బీజేపీ ప్రభంజనం ముందు ఈ నినాదం గెలవలేకపోయింది.

అయితే తాజాగా బీజేపీకి(BJP) మ్యాజిక్‌ ఫిగర్‌కు కొన్ని స్థానాలు తక్కువ అయ్యాయి. ఎన్డీఏ కూటమిలో బీజేపీ తర్వాత అతి పెద్ద పార్టీగా టీడీపీ(TDP) అవతరించింది. 16 స్థానాలతో తదుపరి స్థానంలో టీడీపీ ఉంది. ఆ తర్వాత 14 స్థానాలతో బీహార్‌ సీఎం నితీష్‌కుమార్‌(CM Nitish Kumar) ఉన్నారు. వీరిద్దరూ ఈ సంకీర్ణ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించనున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు(chandrababu) అవసరం మోడీకి రావడంతో ఏపీ ప్రజల చిరకాల వాంఛ ప్రత్యేక హోదా(special status) అంశాన్ని తిరిగి తీసుకురావాలని కోరుతున్నారు. అందుకు ఇదే సమయం అనుకూలమైందని.. మోడీని(Modi) ఈ అంశంపై ఒప్పించాలని కోరుతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్‌ ఈ అంశాన్ని అమలుపరుస్తామని ఆఫర్‌ కూడా చేస్తోంది. చంద్రబాబు ఇండియా కూటమిలో చేరితే ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని గతంలో తామే హామీ ఇచ్చామని.. ప్రభుత్వం ఏర్పాటైతే ప్రత్యేక హోదాను ప్రకటిస్తామని కాంగ్రెస్ చెప్తోంది. ఆ దిశగా ఇండియా కూటమి నేతలు సంప్రదింపులు కూడా చేస్తున్నారు. కేంద్రంలో ఏ ప్రభుత్వం ఏర్పాటైనా కూడా రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమని.. ప్రత్యేక హోదా వస్తే చాలని.. ఎవరితోనైనా కలిస్తే ఎంటనే చర్చ కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతోంది. అయితే ఎన్డీఏ కూటమిని వదిలేసి చంద్రబాబు ఇండియా కూటమిలోకి చేరుతారా అందుకు పవన్‌ అంగీకరిస్తారా అనే ప్రశ్న తలెత్తుతోంది. ఒకవేళ ఎన్డీఏ కూటమిలో కొనసాగినా ప్రత్యేక హోదాపై రాజీపడొద్దని అటు చంద్రబాబును, ఇటు పవన్‌ కల్యాణ్‌ను ప్రజలు కోరుతున్నారు. ఎన్డీఏ కూటమిలోనే కొనసాగినా స్పెషల్‌ స్టేటస్‌ రాకపోతే వచ్చిన సదావకాశాన్ని వినియోగించుకోలేదన్న అపప్రదను మూటగట్టుకుంటారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Updated On 5 Jun 2024 2:18 AM GMT
Ehatv

Ehatv

Next Story