Pithapuram : పిఠాపురంలో పవన్ ఓడిపోవాలని కోరుకుంటున్నదెవరు? కుట్రలు చేస్తున్నదెవరు?
ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) ప్రజలే కాదు, తెలంగాణ పబ్లిక్ కూడా పిఠాపురంలో ఏం జరుగుతోంది? ఏం జరగబోతున్నది? అని చర్చించుకుంటున్నారు. కాకినాడ జిల్లాలో ఉన్న పిఠాపురం(Pithapuram) ఒక్కసారిగా వార్తల్లోకి ఎందుకొచ్చిందంటే అక్కడి నుంచి జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్(Pawan kalyan) పోటీ చేస్తుండటమే! అందుకే అందరి దృష్టి అటువైపుకు మళ్లింది. అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్(YSRCP) పార్టీ మరింత ప్రత్యేకంగా దృష్టి పెట్టింది.
ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) ప్రజలే కాదు, తెలంగాణ పబ్లిక్ కూడా పిఠాపురంలో ఏం జరుగుతోంది? ఏం జరగబోతున్నది? అని చర్చించుకుంటున్నారు. కాకినాడ జిల్లాలో ఉన్న పిఠాపురం(Pithapuram) ఒక్కసారిగా వార్తల్లోకి ఎందుకొచ్చిందంటే అక్కడి నుంచి జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్(Pawan kalyan) పోటీ చేస్తుండటమే! అందుకే అందరి దృష్టి అటువైపుకు మళ్లింది. అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్(YSRCP) పార్టీ మరింత ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. పవన్‌ను ఓడించడానికి వ్యూహరచన చేస్తోంది. అంత శ్రమపడాల్సిన పనిలేదని, పవన్ ఓడించడానికి తెలుగుదేశంపార్టీనే ప్రణాళికలు రచిస్తోందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. పిఠాపురంలోని జనసేన క్యాడర్‌కు ఈ అనుమానం ఎప్పట్నుంచో ఉంది. వర్మను అడ్డం పెట్టుకుని చంద్రబాబు, లోకేశ్‌లు ఆడుతున్న నాటకం కాదు కదా అని సందేహపడుతున్నారు. నిజానికి పిఠాపురం నుంచి పోటీ చేయాలనే నిర్ణయం పవన్ ఆకస్మికంగా తీసుకున్నదేమీ కాదు.
ఏడాది నుంచి అనుకుంటున్నదే! భీమవరం నుంచి కానీ, పిఠాపురం నుంచి కానీ పోటీ చేయాలని పవన్ అనుకుంటున్నారని చాన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. పిఠాపురంలో కాపు సామాజికవర్గం ఓట్లు ఎక్కువగా ఉండటంతో ఆ స్థానాన్నే పవన్ ఎంచుకున్నారు. పిఠాపురం నుంచి పోటీ చేస్తానని చంద్రబాబు(Chandrababu), లోకేశ్‌లకు(Lokesh) ముందుగానే చెప్పారు. అప్పుడు మిత్రపక్షంగా తెలుగుదేశంపార్టీ ఏం చేయాలి? పిఠాపురంలో పవన్‌కు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలి. ఇక్కడ్నుంచి పవన్ పోటీ చేస్తారని, అంచేత ఎక్కువ ఆశలు పెట్టుకోవద్దని, పార్టీ కోసం ఎక్కువగా ఖర్చు చేయవద్దని తెలుగుదేశం పార్టీ(TDP) ఇన్‌ఛార్జ్ వర్మకు చెప్పి ఉండాలి.
కానీ చంద్రబాబు తన సహజసిద్ధమైన రాజకీయ కుట్రలకు తెరలేపారు. అందుకే పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నానని పవన్ ప్రకటించడానికి అక్కడి టీడీపీ కార్యలయంలో విధ్వంసం చెలరేగింది. ఇందంతా ముందస్తు ప్రణాళికలో భాగమేనని ఎవరికైనా ఇట్టే అర్థమవుతుంది. పిఠాపురంలో జరిగిన విధ్వంస కాండను చూసి జనసేన నాయకులు, కార్యకర్తలు బిత్తరపోయారు. దీని వెనుక టీడీపీ ఉందని అనుమానపడ్డారు. వాస్తవానికి పిఠాపురం నుంచి పవన్ పోటీచేయడం టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడికి అసలు ఇష్టం లేదట! అలాంటిది పోటీ చేస్తే గెలవాలని ఎలా అనుకుంటారు? యనమలకు కాపు వ్యతిరేకి అన్న పేరు ఉభయ గోదావరి జిల్లాలలో ఉంది. పైగా వర్మతో యనమలకు మంచి దోస్తానా ఉంది. పవన్ ఓడిపోవాలని జగన్‌కు ఎంత ఉంటుందో అంతకు మూడు రెట్లు చంద్రబాబు, లోకేశ్, యనమల రామకృష్ణుడులకు ఉంటుంది. పిఠాపురంలో పవన్ గెలిచారే అనుకుందాం! అప్పుడు కాకినాడ జిల్లాలో పవన్ పెత్తనమే సాగుతుందన్నది యనమల రామకృష్ణుడు భయం! ఒకవేళ టీడీపీ అధికారంలోకి వస్తే ప్రతీ విషయంలో పవన్ అడ్డుపడతాడన్నది చంద్రబాబు, లోకేశ్‌ల భయం.
చూస్తూ చూస్తూ పక్కలో బల్లెంలాంటి పవన్‌ను ఎలా పక్కన పెట్టుకోవాలన్నది చంద్రబాబు భావన! చంద్రబాబు నైజమే అంత! వెన్నుపోటు పొడవడంలో ఆయన మాస్టర్స్ చేశారుగా! అందుకే వర్మను రెచ్చగొట్టి హింసకు పాల్పడేలా చేశారు బాబు! వర్మ అంతగా చెలరేగుతుంటే చంద్రబాబు కానీ, లోకేశ్ కానీ సర్దిచెప్పే ప్రయత్నం చేయలేదు. అంతా అయ్యాక వర్మను పిలిచి మాట్లాడారు. అప్పటికే జరగాల్సిందంతా జరిగిపోయింది. పిఠాపురంలో జరిగిన విధ్వంసం చూసి పవన్ భయపడతారని, తమ దగ్గరకు వచ్చి మొరపెట్టుకోవాలన్నది చంద్రబాబు గీసిన స్కెచ్! అట్టాగే పవన్ వచ్చి చంద్రబాబును బతిమాలారు. వర్మ నుంచి ఇబ్బందులు రాకుండా చూడమని ప్రాధేయపడ్డారు. చంద్రబాబు ఇగో సంతృప్తి చెందింది. వర్మను చంద్రబాబు పిలిపించుకుని ఎమ్మెల్సీ హామీ ఇచ్చినట్టు టీడీపీ అనుకూల మీడియా ప్రచారం చేసింది. పిఠాపురంలో ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానంటూ రంకెలేసిన వర్మ ఒక్కసారిగా చల్లబడ్డారంటే, కచ్చితంగా ఏదో కుట్ర ఉండే ఉంటుందని జనసైనికులు భావిస్తున్నారు. సాధారణ జనానికి కూడా విషయం అర్థమయ్యింది. ఇప్పుడు పవన్‌ను ఓడించడానికి జగన్ వ్యూహరచన చేయడం అనవసరం. ఆ పని చంద్రబాబు నిర్విఘ్నంగా పూర్తి కానిస్తున్నారు. ఆల్ ది బెస్ట్ పవన్ కల్యాణ్...!