Pawan kalyan : పిఠాపురంలోనూ పవన్‌కు అంత ఈజీ కాదు!
కిందటి ఎన్నికల నుంచి జనసేన(Janasena) అధినేత పవన్ కల్యాణ్(Pawan kalyan) అనుభవాన్ని గడించారో లేదో తెలియదు కానీ పాఠాలైతే నేర్చుకున్నారు. భీమవరంలో పరాజయానికి గల కారణాలను తెలుసుకోగలిగారు. అందుకే ఈసారి భీమవర వదిలేసి కాకినాడ(Kakinada) జిల్లా పిఠాపురం(Pithapuram) నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు. కులాలు, మతాలకు అతీతమని పదే పదే చెప్పుకునే పవన్‌కల్యాణ్‌కు ఆఖరికి కులమే కావాల్సి వచ్చింది.
కిందటి ఎన్నికల నుంచి జనసేన(Janasena) అధినేత పవన్ కల్యాణ్(Pawan kalyan) అనుభవాన్ని గడించారో లేదో తెలియదు కానీ పాఠాలైతే నేర్చుకున్నారు. భీమవరంలో పరాజయానికి గల కారణాలను తెలుసుకోగలిగారు. అందుకే ఈసారి భీమవర వదిలేసి కాకినాడ(Kakinada) జిల్లా పిఠాపురం(Pithapuram) నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు. కులాలు, మతాలకు అతీతమని పదే పదే చెప్పుకునే పవన్‌కల్యాణ్‌కు ఆఖరికి కులమే కావాల్సి వచ్చింది. పిఠాపురాన్ని ఎందుకు ఎంచుకున్నారంటే అక్కడ తన సామాజికవర్గం ఓటర్లు ఎక్కువగా ఉండటమే. సేఫెస్ట్ ప్లేస్ కాబట్టే పిఠాపురాన్ని సెలెక్ట్ చేసుకున్నారు పవన్. అయితే పిఠాపురంలో కూడా పవన్ గెలుపు అంత ఈజీ కాదని అంటున్నారు విశ్లేషకులు. పవన్‌కల్యాణ్‌పై తెలుగుదేశం పార్టీ(TDP) రెబల్ అభ్యర్థి వర్మ(Varma) బరిలో దిగారే అనుకుందాం! అప్పుడు పరిస్థితి ఏమిటి? పిఠాపురంలో ఎంతకాదన్నా వర్మకు ఓ ఇమేజ్ ఉంది. ఓ గుర్తింపు ఉంది. తెలుగుదేశంపార్టీ ఓట్లలో హీనపక్షం 70 శాతం ఓట్లయినా వర్మకు పడతాయి. 2009లో పిఠాపురం నుంచి వంగా గీత ప్రజారాజ్యం తరఫున పోటీ చేశారు. తన సమీప ప్రత్యర్థి, తెలుగుదేశం పార్టీ నాయకుడు వి.ఎస్.ఎన్.వర్మపై కేవలం 1,036 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం మూడో స్థానంలో నిలిచారు. 2014 ఎన్నికల్లో వి.ఎస్.ఎన్. వర్మ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ(YSRCP) అభ్యర్థి పెండెం దొరబాబుపై 47 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో గెలిచారు. టీడీపీ అభ్యర్థికి కేవలం 15, 187 ఓట్లు మాత్రమే ఇచ్చాయి. దీన్నిబట్టి పిఠాపురం నియోజకవర్గంలో బర్మ బలమేమిటో అర్థమవుతోంది. 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి దొరబాబు తన సమీప ప్రత్యర్థి వర్మపై 14,989 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. జనసేన అభ్యర్థి ఎం.శేషుకుమారికి కేవలం 28,011 ఓట్లు మాత్రమే వచ్చాయి.పిఠాపురంలో 90 వేలకు పైగా కాపు సామాజికవర్గ ఓట్లు ఉన్నాయని జనసేన అంటుంది కానీ అన్ని ఓట్లు ఉండకపోవచ్చు. ఉంటే శేషుకుమారి గెలిచేవారు కదా! ఈసారి పవన్‌కు వర్మ దెబ్బేసినా వేయవచ్చు. ఎన్నికల్లో నిలబడటం గ్యారంటీ అని ఎనిమిది నెలలుగా టీడీపీ ఇన్‌ఛార్జ్ వర్మ చెప్పుకుంటున్నారు. ప్రచారం కూడా చేసుకుంటున్నారు. వైఎస్ఆర్ తరపున ఈసారి కాకినాడ ఎంపీ వంగా గీతను నిలబడతారు.రాబోయే ఎన్నికల్లో వర్మ వర్సెస్ గీత పోటీ రసవత్తరంగా ఉండవచ్చని అనుకుంటున్న సమయంలో హఠాత్తుగా పవన్ పేరు తెరమీదకు వచ్చింది. పవన్ పోటీ చేసినా తాను వెనక్కి తగ్గనని, కచ్చితంగా తాను కూడా పోటీ చేసి తీరతానని వర్మ చెబుతున్నారు. అవసరమైతే స్వతంత్ర్య అభ్యర్థిగానైనా బరిలో దిగుతానని అంటున్నారు.