Pawan kalyan : పవన్ కల్యాణ్‌కి గాజువాక గండం !
ఎన్నికలు(Elections) సమీపిస్తున్న వేళ గాజువాక(Gajuwaka) నియోజకవర్గంలో పొలిటికల్(Political) చర్చ హాట్ హాట్ సాగుతోంది. దీనికి కారణం..గతంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pawan kalyan) ఇక్కడి నుంచి పోటీ చేసి ఓడిపోవడమే. మరి..ఇక్కడి నుంచి పవన్ కల్యాణ్ మరోసారి పోటీ చేస్తారా? అంటే..అవుననే అంటున్నారు జన సైనికులు. పవన్ కూడా..ఓడిన చోటనే గెలిచి ప్రత్యర్థుల నోళ్లు మూయించాలన్న ఆలోచనతో ఉన్నారట. అదే నిజమైతే..ఈసారైనా గెలిచి..అసెంబ్లీలో అధ్యక్షా అంటారా? లేదా..? అనే దానిపై ఆసక్తికర చర్చ సాగుతోంది.

ఏపీలో మళ్లీ సాధారణ ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో గాజువాక నియోజకవర్గం నుంచి పవన్ కల్యాణ్ పోటీ చేస్తారా? అన్న చర్చ మళ్లీ ఊపందుకుంది. 2009లో నియోజకవర్గం ఏర్పడి నాటి నుంచి జరిగిన మూడు ఎన్నికల్లోనూ మూడు పార్టీలను గెలిపించి..విలక్షణమైన తీర్పునిచ్చారు గాజువాక ఓటర్లు. 2010లో ఇక్కడి నుంచి పోటీ చేసిన జనసేన(Janasena) అధినేత పవన్ కల్యాణ్ కు గాజువాక ఓటర్లు గట్టి షాకిచ్చారు. దీంతో మరోసారి ఇక్కడి నుంచి పోటీ చేయాలా..? వద్దా? అనే డైలామాలో ఉన్నారు పవన్ కల్యాణ్. అయితే పోగొట్టుకున్న చోటే..వెతుక్కోవాలన్న సామేత చందగా..గాజువాక నుంచే మరోసారి పోటీ చేయాలని పవన్ కల్యాణ్ యోచిస్తున్నట్టు తెలుస్తోంది
వారాహి మూడో యాత్రలో సందర్భంగా.. గాజువాకలో ఏర్పాటు చేసిన పవన్ సభకు(Public Meeting) అద్భుతమైన జన స్పందన కనిపించింది. జనం విరగబడి రావడంతో పవన్ కు పట్టలేనంత ఆనందం కలిగిందట. ఇదే అదనుగా వచ్చే ఎన్నికల్లో గాజువాక జనసేన సొంతమై తీరుందని అనేశారు. అంతేకాదు గాజువాకలో జనసేన పోటీ చేస్తుందని చెప్పేశారు. మరి..జనసేన తరఫున ఎవరు పోటీ చేసేది మాత్రం చెప్పలేదు. ఈ సెగ్మెంట్లో టీడీపీ-జనసేనకు బలమైన ఓటింగ్ ఉంది. ఈసారి పవన్ పోటీ చేస్తే గెలుపు ఖాయమనే ధీమాతో ఉన్నారు జనసైనికులు. అందుకే గాజువాక నుంచి పవన్ కల్యాణ్ పోటీ చేయాలని క్యాడర్ కోరుకుంటోంది.
అయితే 2019లోనే గాజువాకలో పవన్ కల్యాణ్‌ని ఓడించి గట్టి షాక్ ఇచ్చిన వైసీపీ.. 2024లోనూ పవన్ చెక్ పెట్టేందుకు భారీ స్కెచ్చేసింది. బలమైన సామాజికవర్గానికి చెందిన మంత్రి గుడివాడ అమరనాధ్ని(Amarnath) ఇంచార్జిగా నియమించిన హైకమాండ్.. ఆపరేషన్ గాజువాకను సక్సెస్ ఫుల్‌గా కంప్లీట్ చేసింది. మంత్రి గుడివాడ స్వగ్రామం మింది..గాజువాక నియోజకవర్గం పరిధిలోనే ఉంది. ఇప్పటికే గాజువాకలో వరుసగా రెండుసార్లు విజయం సాధించిన వైసీపీ..ఈసారి కూడ గెలుపు తీరాలని చేరాలని చూస్తోంది. అందుకే గుడివాడను బరిలోకి దింపుతున్నట్టు తెలుస్తోంది.
వచ్చే ఎన్నికల్లో పవన్ కల్యాణ్ మరోమారు పోటీకి గాజువాకను ఎంచుకుంటారని ప్రచారం సాగుతున్న క్రమంలో.. గట్టి అభ్యర్థితో చెక్ పెట్టేలా వైసీపీ వ్యూహం రూపొందించిందన్నది రాజకీయ పరిశీలకులు చెబుతున్నమాట.