ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలకు(AP elections) అన్ని పార్టీలు సమయాత్తమవుతున్నాయి. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని(YSRCP) ఓడించడమే లక్ష్యంగా విపక్షాలు నడుం బిగించాయి. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిని(Jagan Mohan Reddy) గద్దెదింపడం కోసం ఎత్తులు వేస్తున్నాయి. పొత్తులు పెట్టుకుంటున్నాయి. ఇప్పటికే జనసేనతో(Janasena) తెలుగుదేశం(TDP) పార్టీ పొత్తు పెట్టుకుంది. టీడీపీతో చెలిమికి జనసేన అధినేత పవన్‌కల్యాణే(Pawan kalyan) ఎక్కువ ఆసక్తిని కనబరుస్తున్నారు. బీజేపీనేమో(BJP) జనసేనతో కలిసి పోటీ చేయడానికి సిద్ధమవుతోంది. మరి ఎన్నికల నాటికి టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి కడతాయా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.

చంద్రబాబుకు బీజేపీతో కలవాలనే కోరిక బలంగా ఉంది. చంద్రబాబు ఇంట్రెస్ట్ చూపిస్తున్నా బీజేపీ అధినాయకత్వం నుంచి మాత్రం సానుకూల స్పందన రావడం లేదు. చంద్రబాబులో ఆశలు సన్నగిల్లలేదు కాబట్టే కాంగ్రెస్‌ వైపు వెళ్లడం లేదు. టీడీపీతో కలిసేది లేదని బీజేపీ నుంచి స్పష్టమైన సంకేతాలు వచ్చిన మరుక్షణం కాంగ్రెస్‌తో చేరడానికి చంద్రబాబు రెడీగా ఉన్నారు. అందుకే కాంగ్రెస్‌లో చేరిన షర్మిలతో సంబంధాలు పెంచుకుంటున్నారు.

వామపక్షాలు చంద్రబాబువైపే ఉంటాయన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇంతమంది జగన్‌కు వ్యతిరేకంగా కూటమి కట్టడం వల్ల అంతిమంగా ప్రయోజనం ఎవరికి? అంటే జగన్‌కే అని సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌కు ఓటేయాలనుకునేవాళ్లు మరో పార్టీకి కచ్చితంగా వేయరు. జగన్‌కు ఓటు వేయకూడదని ఆల్‌రెడీ నిర్ణయం తీసుకునేవారు ఎలాగూ వేయరు. వారు బీజేపీ- జనసేన కూటమికి వేస్తారా? టీడీపీ-వామపక్షాలకు వేస్తారా? కాంగ్రెస్‌కు వేస్తారా అన్నది తేలాల్సి ఉంది.

అంటే వ్యతిరేక ఓట్లు చీలే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. కాబట్టి ఎన్నికల నాటికి జగన్ వ్యతిరేక గ్రూపులు ఎన్ని ఉంటే జగన్‌కు అంత అడ్వాంటేజ్‌. షర్మిల కాంగ్రెస్‌ పార్టీలో చేరడం వల్ల పార్టీ బలోపేతమయ్యిందని రుద్రరాజు చెబుతున్నారు కానీ అంత సీన్‌ కనిపించడం లేదు. పైగా షర్మిల(YS sharmila), బ్రదర్‌ అనిల్‌కుమార్‌(Brother Anil Kumar) తీసుకుంటున్న నిర్ణయాలు వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి అభిమానులకు బాగా బాధిస్తున్నాయి.

ఆంధ్రజ్యోతి పత్రిక అన్నా, ఆ మీడియా యజమాని రాధాకృష్ణ అన్నా వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి అసలు పడేది కాదన్న విషయం అందరికీ తెలిసిందే! వైఎస్‌ను స్థిమితంగా పరిపాలన చేసుకోనివ్వలేదు ఆ మీడియా. అందుకే వైఎస్‌ఆర్‌ పదే పదే ఆ రెండు పత్రికలు అంటూ ఈనాడు-ఆంధ్రజ్యోతిలను ఉద్దేశించి మాట్లాడేవారు. వైఎస్‌ ఉన్నంత కాలం ప్రతి రోజు ఆయనకు వ్యతిరేకంగా ఏదో ఒక వార్త వండి వార్చేది ఆంధ్రజ్యోతి. అలాంటి రాధాకృష్ణకు షర్మిల ఇంటర్వ్యూ ఇచ్చారు.

తెలుగుదేశంపార్టీ నేతలతో సఖ్యతగా ఉంటున్నారు. జగన్‌ వ్యతిరేకులతో కలిసి ఫోటోలు దిగుతున్నారు. జగన్‌ను జైల్లో వేసినప్పుడు ఇదే షర్మిల టీడీపీని, ఆ పార్టీ అనుకూల మీడియాను దుమ్మెత్తి పోసిన విషయం ప్రజలకు ఇంకా గుర్తుంది. అందుకే కట్టర్‌ వైఎస్‌ అభిమానులు జగన్‌ వైపు ఉంటారే తప్ప షర్మిల వైపుకు వెళ్లరని విశ్లేషకుల భావన! మొత్తంగా ఈసారి ఏపీ ఎన్నికలు మాత్రం సస్పెన్స్‌ థ్రిల్లర్‌ సినిమాను తలపించేట్టుగా ఉండబోతున్నాయి.

Updated On 5 Jan 2024 2:03 AM GMT
Ehatv

Ehatv

Next Story