వచ్చే ఎన్నికల్లో(AP Elections) గెలుపే లక్ష్యంగా జగన్(Jagan) అభ్యర్థుల మార్పులు చేర్పులు చేపట్టారు. ఇప్పటికే నాలుగు దశల్లో ఎమ్మెల్యేలు(MLA), మంత్రులు(Minister), ఎంపీలను మార్చారు. మరికొందరికి స్థాన చలనం కల్పించారు. తాజాగా ఐదో లిస్టుపై కసరత్తు చేసిన అధిష్టానం రేపోమాపో విడుదల చేస్తారనే ప్రచారం ఉంది. గత నాలుగు జాబితాల నుంచి తప్పించుకున్న కొందరు ఐదో జాబితా రూపంలో గండం తప్పకపోవచ్చనే చర్చ జరుగుతోంది.

వచ్చే ఎన్నికల్లో(AP Elections) గెలుపే లక్ష్యంగా జగన్(Jagan) అభ్యర్థుల మార్పులు చేర్పులు చేపట్టారు. ఇప్పటికే నాలుగు దశల్లో ఎమ్మెల్యేలు(MLA), మంత్రులు(Minister), ఎంపీలను మార్చారు. మరికొందరికి స్థాన చలనం కల్పించారు. తాజాగా ఐదో లిస్టుపై కసరత్తు చేసిన అధిష్టానం రేపోమాపో విడుదల చేస్తారనే ప్రచారం ఉంది. గత నాలుగు జాబితాల నుంచి తప్పించుకున్న కొందరు ఐదో జాబితా రూపంలో గండం తప్పకపోవచ్చనే చర్చ జరుగుతోంది. టికెట్ల కేటాయింపు, అభ్యర్థిత్వాల విషయంలో జగన్ చాలా కరాఖండీగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. తమ కుటుంబానికి సన్నిహితంగా ఉండే మంగళగిరి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డిని(MLA Ramakrishna reddy) పక్కన పెట్టడం దీనికి నిదర్శనం.

ఇక సర్వేల్లో, పార్టీలో, ప్రజల్లో సానుకూలత లేని వ్యక్తి ఎవరైనా సరే.. చాలా మొండిగా, నిక్కచ్చిగా ఉంటున్న జగన్(CM Jagan) కూడా కొందరి విషయంలో మాత్రం సానుభూతితో వ్యవహరిస్తున్నారనే ప్రచారం ఉంది. అలాంటి వారిలో నగరి ఎమ్మెల్యే రోజా(MLA Roja) కూడా ఉన్నారు. ఈసారి మంత్రి రోజాకు టికెట్ దక్కదనే ప్రచారం మొదటి నుంచి ఉంది. నియోజకవర్గం నేతల్లో రోజా పట్ల విపరీతమైన వ్యతిరేకత ఉంది. ఎన్నాళ్ల నుంచో ఆమెను వ్యతిరేకిస్తూ వస్తున్నారు. పైగా జిల్లా మంత్రి పెద్దిరెడ్డితోనూ(Minister Peddireddy) రోజాకు వైరం ఉన్న సంగతి తెలిసిందే. అభ్యర్థిత్వాల మార్పు చేర్పుల విషయంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చాలా కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి తరుణంలో రోజాకు ఇక టికెట్ దక్కదనే ప్రచారాన్ని ‎ఆమె వ్యతిరేకులు ప్రారంభించారు. రోజా మాత్రం నగరి టికెట్(Nagari MLA Ticket) పై ధీమాగా ఉన్నారు. టిక్కెట్ దక్కేదీ లేనిది జగన్ నిర్ణయిస్తారని..సీఎం ఎలా ఆదేశిస్తే అలా చేస్తానని అన్నారు. మూడో జాబితాలోనే శ్రీకాళహస్తి, నగరి నియోజకవర్గాల విషయంలో మార్పు ఉంటుందని ప్రచారం జరిగింది. కానీ..ఆమె వ్యతిరేకులు కోరుకున్నట్టు జరగలేదు. ఒకరకంగా రోజా పట్ల జగన్ సానుభూతితో ఉన్నారని పార్టీ వర్గాల్లో జరుగుతున్న చర్చ. తాజాగా ఐదో జాబితా రేపోమాపో వెలువడుతుందని ప్రచారం జరుగుతున్న సమయంలో రోజాకు వ్యతిరేకంగా అసమ్మతివర్గం గళం పెంచింది. రోజాకు టికెట్ దక్కగల అవకాశాలను నీరుగార్చడానికి ఆమె వ్యతిరేకులు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు
నగరి నియోజకవర్గ పరిధిలోని దాదాపు అన్ని మండలాల్లో ఉన్న సొంత పార్టీ నాయకులతో రోజాకు విభేదాలు ఉన్నాయి. ఆమె ఒంటెత్తు పోకడలు అనుసరిస్తోందన్నది వారి వాదన. రోజాను ద్వేషిస్తున్న వారంతా ఇప్పుడు స్వరం పెంచుతున్నారు. అయితే..వీరి వెనుక మంత్రి పెద్దిరెడ్డి ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. పార్టీ నేతల్లో ఇంత వ్యతిరేకత ఉన్న రోజాకు..జగన్ టికెట్ ఇవ్వడం కష్టమేనంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మరి..రోజా విషయంలో సీఎం జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేదానిపై నగరి నియోజకవర్గంలో ఆసక్తికర చర్చ జరుగుతోంది.

Updated On 24 Jan 2024 1:36 AM GMT
Ehatv

Ehatv

Next Story