తెలుగుదేశంపార్టీకి(TDP) చెందిన తిరుగుబాటు ఎమ్మెల్యే వల్లభనేని వంశీ(Vallabhaneni Vamsi) పొలిటికల్‌ ఫ్యూచర్‌ గందరగోళంలో పడింది. గత ఎన్నికల్లో గన్నవరం నియోజకవర్గం నుంచి తెలుగుదేశంపార్టీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ(YSRCP) తుఫాన్‌ను తట్టుకుని వంశీ గెలుపొందడం గమనార్హం. జగన్‌(CM Jagan) ముఖ్యమంత్రి అయిన తర్వాత వంశీ ఎందుకో టీడీపీకి నెమ్మదిగా దూరం అయ్యారు. సీఎం జగన్‌కు దగ్గరయ్యారు. ప్రభుత్వం అండదండలు ఉండటంతో గన్నవరంలో హవా చెలాయించారు.

తెలుగుదేశంపార్టీకి(TDP) చెందిన తిరుగుబాటు ఎమ్మెల్యే వల్లభనేని వంశీ(Vallabhaneni Vamsi) పొలిటికల్‌ ఫ్యూచర్‌ గందరగోళంలో పడింది. గత ఎన్నికల్లో గన్నవరం నియోజకవర్గం నుంచి తెలుగుదేశంపార్టీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ(YSRCP) తుఫాన్‌ను తట్టుకుని వంశీ గెలుపొందడం గమనార్హం. జగన్‌(CM Jagan) ముఖ్యమంత్రి అయిన తర్వాత వంశీ ఎందుకో టీడీపీకి నెమ్మదిగా దూరం అయ్యారు. సీఎం జగన్‌కు దగ్గరయ్యారు. ప్రభుత్వం అండదండలు ఉండటంతో గన్నవరంలో హవా చెలాయించారు. అదే సమయంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌లో చాన్నాళ్ల నుంచి ఉన్న యార్లగడ్డ వెంకట్రావ్‌, డాక్టర్‌ దుట్టా రామచంద్రరావులతో గొడవ పడ్డారు. గత ఎన్నికల్లో గన్నవరం నుంచి వైసీపీ తరఫున పోటీ చేసింది యార్లగడ్డ వెంకట్రావే(Yarlagadda Venkatarao)! గన్నవరంలో నెలకొన్ని విభేదాలను పరిష్కరించడానికి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ చేసిన ప్రయత్నాలు విష్ఫలమయ్యాయి. గన్నవరం నియోజకవర్గం టికెట్ కనుక వంశీకి ఇస్తే పని చేయబోమని వెంటక్రావ్‌, రామచంద్రరావు గట్టిగా చెప్పడంతో జగన్‌కు ఏం చేయాలో పాలుపోలేదు. వంశీకే టికెట్‌ ఇస్తానని జగన్ చెప్పిన కారణంతో యార్లగడ్డ వెంకట్రావ్‌ పార్టీని వదిలిపెట్టేశారు. ఆ వెంటనే టీడీపీలో చేరిపోయారు. అలా చేరారో లేదో ఇలా గన్నవరం ఇన్‌చార్జ్‌గా నియమితులయ్యారు. వచ్చే ఎన్నికల్లో ఆయన టీడీపీ నుంచి పోటీ చేస్తారన్నమాట! వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అంతర్గతంగా నిర్వహించిన సర్వేలలో వంశీకి ప్రతికూల ఫలితాలే వచ్చాయి. పైగా నియోజకవర్గంలోని వైసీపీ క్యాడర్‌ కూడా వంశీకి అండగా ఉండటం లేదు. గన్నవరం నుంచి పోటీ చేస్తే ఓడిపోతావ్‌ కాబట్టి మరో నియోజకవర్గం నుంచి పోటీ చేయాల్సిందిగా జగన్‌ చేసిన సూచనను వంశీ పట్టించుకోలేదు. మొన్నామధ్య గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని(Kodali nani), వల్లభనేని వంశీలను సీఎం జగన్ పిలిపించుకుని మాట్లాడారు. గన్నవరంలో వాస్తవ పరిస్థితులను వివరించారు. పెనమలూరు లేదా మైలవరం నియోజకవర్గాలలో ఏదో ఒక చోట నుంచి పోటీ చేయమని వంశీని కోరారు జగన్. ఇందుకు వంశీ నో చెప్పారట! ముఖ్యమంత్రి జగన్‌తో సమావేశం ముగిసిన తర్వాత వంశీ సెల్‌ఫోన్‌ను స్విచాఫ్‌ చేసుకున్నారట!

Updated On 22 Feb 2024 2:59 AM GMT
Ehatv

Ehatv

Next Story