టీటీడీ బోర్డు మెంబర్‌పై కేసు పెడతారా..?

తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టను భంగం కల్గించేలా ఎవరు వ్యవహరించినా, తిరుమల తిరుపతి దేవస్థానంపై తప్పుడు ప్రచారం చేసినా ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చాలా కష్టపడి పనిచేస్తోంది. ఎవరైనా తప్పుగా మాట్లాడితే సహించేది లేదని టీటీడీ గట్టిగా చెప్తూ వచ్చింది. అలా ఒప్పుకోమని చెప్పే క్రమంలో కొన్ని రిజర్వేషన్లు మాత్రం పాటిస్తోంది. నేను తిరుమలను వ్యక్తుల సమూహంగా చూడడం లేదు.. శ్రీవారి భక్తుల సమూహంగా చూస్తున్నా. ఎవరు ఎటువంటి తప్పుడు మాట మాట్లాడినా రిపీట్‌కాకుండా చూడాల్సిన అవసరం ఉంది. ఆ బాధ్యత ధర్మ కర్తల మండలిపై ఉందని భావిస్తున్నా. ఈ క్రమంలోనే నేను సూచన చేస్తున్నా.. తిరుమల తిరుపతి బోర్డు దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నా. టీటీడీ బోర్డు సభ్యుడిగా ఉన్న నరేష్ అనే వ్యక్తి దర్శనం చేసుకున్నారు. ఆయన దర్శనం చేసుకొని బయటకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఆయన మహాద్వారాం నుంచి బయటకు వెళ్లేందుకు ప్రయత్నించగా అక్కడ ఉండే టీటీడీ సిబ్బంది ఆయనను భక్తులు వెళ్లే మార్గం వెళ్లాలి అని సూచించారు. దీంతో కోపం వచ్చి ఆయన మాట్లాడిన మాటలు మీకు చూపిస్తున్నాం. ఇదే అంశంపై సీనియర్ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ..
