కృష్ణాజిల్లా(Krishna District) పామర్రు(Pamarru) నియోజకవర్గంలో డ‌బుల్ మ‌ర్డ‌ర్(Double Murder) తీవ్ర క‌ల‌క‌లం సృష్టించింది. మొవ్వ మండలం అయ్యంకి గ్రామంలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. పాత కక్షల నేపథ్యంలో అయ్యంకి గ్రామంలో వీరంకి వరలక్ష్మి(Varalakshmi) అనే మహిళను నడిరోడ్డుపై దారుణ హత్య(Murder) చేసిన దుండ‌గులు.

కృష్ణాజిల్లా(Krishna District) పామర్రు(Pamarru) నియోజకవర్గంలో డ‌బుల్ మ‌ర్డ‌ర్(Double Murder) తీవ్ర క‌ల‌క‌లం సృష్టించింది. మొవ్వ మండలం అయ్యంకి గ్రామంలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. పాత కక్షల నేపథ్యంలో అయ్యంకి గ్రామంలో వీరంకి వరలక్ష్మి(Varalakshmi) అనే మహిళను నడిరోడ్డుపై దారుణ హత్య(Murder) చేసిన దుండ‌గులు.. ఆమె భర్త అయిన‌ వీరంకి వీర కృష్ణను(Veera Krishna) పంచాయతీ ఆఫీస్ దగ్గర హంత‌మొందించారు. ఒకేరోజు రెండు జంట హత్యలు జ‌ర‌గ‌డంతో అయ్యంకి గ్రామ‌స్తులు భ‌యంతో వ‌ణికిపోయారు. పట్టపగలే నడిరోడ్డుపై భార్యాభర్తలు ఇద్దరినీ దుండగులు కిరాతకంగా నరికి చంపారు. హ‌త్య‌కు పాల్ప‌డిన వారు వీరంకి గణేష్, అతని ఇద్దరు సోదరులుగా గ్రామస్తులు అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న కూచిపూడి పోలీసులు.. ఘ‌ట‌నా స్థలానికి చేరుకుని ప‌రిశీలిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Updated On 21 Sep 2023 5:57 AM
Ehatv

Ehatv

Next Story