ఈరోజుల్లో ఇది కామన్‌ అనుకున్నదో ఏమో.. ఓ మహిళ తనకు పెళ్లయి ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత మరో యువకుడితో పరిచయం పెంచుకుంది. ఆ తర్వాత అది వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఇంకేముంది ప్రియుడి మాయమాటల బుట్టలో పడింది. భర్తను అంతం చేయాలని ప్లాన్‌ ఈసింది. ఆ మహిళకు తన భర్త కంటే ప్రియుడే ఎక్కువయ్యాడు.

ఈరోజుల్లో ఇది కామన్‌ అనుకున్నదో ఏమో.. ఓ మహిళ తనకు పెళ్లయి ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత మరో యువకుడితో పరిచయం పెంచుకుంది. ఆ తర్వాత అది వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఇంకేముంది ప్రియుడి మాయమాటల బుట్టలో పడింది. భర్తను అంతం చేయాలని ప్లాన్‌ ఈసింది. ఆ మహిళకు తన భర్త కంటే ప్రియుడే ఎక్కువయ్యాడు. ప్రియుడి కోసం కట్టుకున్న భర్తను కడతేర్చాలని నిర్ణయించుకుంది. తమ సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను తొలగించాలని ప్రియుడిని ఉసిగొల్పింది. ఆ మహిళ పడక సుఖానికి అలవాటు పడ్డ యువకుడు.. ఆమె చెప్పినట్లు చేశాడు. ఆ మహిళ భర్తను చితకబాది చావుకు కారణమయ్యాడు. విశాఖ జిల్లా(Visakha District) సబ్బవరం మండలం సాలాపువానిపాలెంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

సీఐ పిన్నింటి రమణ వెల్లడించిన వివరాల ప్రకారం సాలాపు శ్రీనివాసరావు(salapu srinivasarao) (32) దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయంలో ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నాడు. దువ్వాడ సమీపంలోని మంగళపాలెంకు చెందిన భాగ్యలక్ష్మి(Bhagya Lakshmi)తో ఆరేళ్ల క్రితం వివాహం జరిగింది. ఈ జంటకు ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. సాఫీగా సాగుతున్న వీరి కాపురంలోకి ఒకడు దూరాడు. అదే గ్రామానికి చెందిన గళ్ల రవి అనే 26 ఏళ్ల యువకుడితో భాగ్యలక్ష్మికి పరిచయం ఏర్పడింది. అది కాస్త పక్కను పంచుకునే వరకు వెళ్లింది. కొన్నాళ్ల తర్వాత విషయం ఇంట్లో తెలియడంతో తరుచుగా గొడవ పడేవారు. కొన్ని సార్లు పెద్దలు కూడా పంచాయితీ చెప్పి సముదాయించి కాపురం సాఫీగా సాగేందుకు ఒప్పించేవారు. అయినా వీరి రిలేషన్‌ షిప్ మాత్రం కంటిన్యూ అవుతూనే ఉంది. ఈ క్రమంలోనే సాలాపు శ్రీనివాసరావు పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లి తిరగి ఇంటికి వస్తుండగా.. ముందే వేసుకున్న పథకం ప్రకారం శ్రీనివాసరావును గళ్ల రవి, గరికిపాటి శ్రీహరి అడ్డగించారు. కర్రతో బలంగా అతని తలపై బాదడంతో గట్టిగా కేకలు వేశాడు శ్రీనివాసరావు. తలపై బాదిన తర్వాత దాదాపు 100 మీటర్ల దూరం వరకు శ్రీనివాసరావును లాక్కెళ్లారు నిందితులు. బాధితుడి కేకలు విన్న శ్రీనివాసరావు తండ్రి అప్పారావుతో పాటు గ్రామస్తులు ఘటనాస్థలికి వచ్చారు. అక్కడ రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న శ్రీనివాసరావును చూసి వెంటనే ఆస్పత్రికి తరలించారు. కానీ ప్రయోజనంలేకపోయింది. అప్పటికే శ్రీనివాసరావు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. మృతదేహాన్ని అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించి తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ ఘాతుకానికి తమ కోడలు, ఆమె ప్రియుడే కారకులను ఇచ్చిన తల్లిదండ్రుల ఫిర్యాదుతో వారిపై కేసు నమోదు చేసుకొని విచారిస్తున్నారు. నిందితులు ఇద్దరు గళ్ల రవి(Galla Ravi), గరికిపాటి శ్రీహరి(garikapati srihari)ని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

Updated On 29 April 2024 12:57 AM GMT
Ehatv

Ehatv

Next Story